UNSTOPPABLE లాంటి టాక్ షోను ఈ 5గురు టాలీవుడ్ స్టార్లు చేస్తే…. బొమ్మ దద్దరిల్లాల్సిందే
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • UNSTOPPABLE లాంటి టాక్ షోను ఈ 5గురు టాలీవుడ్ స్టార్లు చేస్తే…. బొమ్మ దద్దరిల్లాల్సిందే

    UNSTOPPABLE లాంటి టాక్ షోను ఈ 5గురు టాలీవుడ్ స్టార్లు చేస్తే…. బొమ్మ దద్దరిల్లాల్సిందే

    July 20, 2022

    సెలబ్రిటీ టాక్ షోలు ఎన్ని వ‌చ్చినా వాటికి అత్యంత ఆదరణ ల‌భిస్తుంది. ఎందుకంటే త‌మ అభిమాన న‌టుల వ్య‌క్తిగ‌త వివ‌రాలు తెలుసుకునేందుకు ఫ్యాన్స్ ఆస‌క్తిగా ఎదురుచూస్తారు. అందుకే బాల‌కృష్ణ హోస్ట్ చేసిన అన్‌స్టాప‌బుల్‌కి అంత మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఐఎండీబీ రేటింగ్స్‌లో దేశంలోనే నెంబర్ వ‌న్ పాపుల‌ర్ షోగా నిలిచింది. మ‌న తెలుగు వాళ్లు మంచి కంటెంట్ ఉన్న కార్య‌క్ర‌మాల‌ను ఎంత ఆద‌రిస్తారో తెలిపేందుకు ఇదొక మంచి ఉదాహ‌ర‌ణ‌. కానీ అన్‌స్టాప‌బుల్ మొద‌టి సీజ‌న్ అయిపోయింది. రెండో సీజ‌న్ ఎప్పుడొస్తుంది అని అడుగున్నారు చాలా మంది ప్రేక్షకులు. వారికి అంత‌గా న‌చ్చేసింది ఈ సెల‌బ్రిటీ టాక్ షో. 

    తెలుగు ప్రేక్ష‌కులు ఎంట‌ర్‌టైన్‌మెంట్‌కి చాలా ప్రాధాన్య‌తనిస్తారు. అందుకే సంవ‌త్స‌రానికి ఎక్క‌డా లేనంత‌గా చాలా సినిమాలు తెలుగులో రిలీజ్ అవుతుంటాయి. మ‌న ద‌గ్గ‌ర ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఛాన‌ల్స్ కూడా ఎక్కువే. కానీ ప్ర‌స్తుతం ఏదో కాసేపు కాలక్షేపం కోసం టీవీ చూడ‌టం త‌ప్ప నిజ‌మైన ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఇచ్చే ప్రోగ్రామ్స్ చాలా త‌క్కువనే చెప్పుకోవాలి.  మ‌రి అన్‌స్టాప‌బుల్ వంటి షోలు ఇంకా కావాల‌ని కోరుకుంటున్నారు. బాల‌య్య అన్‌స్టాప‌బుల్ చేసిన‌ట్లు మ‌న హీరోల్లో ఎవ‌రు టాక్ షో చేస్తే బాగుంటుందో తెలుసుకుందాం.

    ర‌మ్య‌కృష్ణ‌

    రెండేళ్ల కింద బిగ్‌బాస్‌లో నాగార్జున షూటింగ్‌లో ఉన్న‌ప్పుడు ర‌మ్య‌కృష్ణ‌ హోస్ట్‌గా చేసిన ఒక ఎపిసోడ్ సూప‌ర్ స‌క్సెస్‌గా నిలిచింది. ఆమె హుందాత‌నం, చిలిపి అల్ల‌రి, అనుభ‌వం, క‌ల‌గ‌లిపి చాలాచ‌క్క‌గా ప్రేక్ష‌కుల‌ను ఎంట‌ర్‌టైన్ చేసింది. గతేడాది కూడా క‌మ‌ల్‌హాస‌న్‌కి క‌రోనా వ‌చ్చిన స‌మ‌యంలో త‌మిళ బిగ్‌బాస్‌లో ఒక ఎపిసోడ్ హోస్ట్ చేసింది. దీంతో ఆమె టాక్‌షో చేస్తే చూడాల‌ని చాలామంది ఫ్యాన్స్ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు

    న‌వీన్ పొలిశెట్టి

    న‌వీన్ పొలిశెట్టి కామెడీ టైమింగ్ వేరే లెవ‌ల్‌లో ఉంటుంది. అందుకే ఏరికోరి మ‌రి ప్ర‌భాస్ రాధేశ్యామ్ ఈవెంట్‌కు న‌వీన్‌ను హోస్ట్‌గా పెట్టుకున్నాడు. హీరో కంటే ముందే న‌వీన్ యూట్యూబ్ వీడియోలు, ఇంట‌ర్వ్యూలతో చాలా ఫేమ‌స్ అయిపోయాడు. అంద‌ర్నీ న‌వ్విస్తూ మేనేజ్ చేయ‌గ‌ల టాలెంట్ ఉన్న యంగ్ హీరో న‌వీన్‌కు సెప‌రేట్ ఫ్యాన్‌బేస్ ఉంది. ఇక ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ‌, జాతి ర‌త్నాలు వంటి సినిమాలో ఆయ‌న స్థాయి మ‌రో రేంజ్‌కు వెళ్లిపోయింది. న‌వీన్ సెన్సాఫ్‌ హ్యూమ‌ర్‌కి ఫిదా అవనివారుండ‌రు. న‌వీన్ పొలిశెట్టి హోస్ట్‌గా పెట్టి ఎవ‌రైనా టాక్‌షో చేశారంటే అది సూప‌ర్ హిట్ కావాల్సిందే.

    న‌వ‌దీప్‌

    న‌వ‌దీప్ చేసింది త‌క్కువ సినిమాలే అయినా ఎప్పుడు ఎక్క‌డో ఒక చోట అతడి పేరు వినిపిస్తూనే ఉంటుంది.  బిగ్‌బాస్ త‌ర్వాత అత‌నిపై ప్రేక్ష‌కుల‌కు మంచి అభిప్రాయం ఏర్ప‌డింది. బిగ్‌బాస్ మొద‌టి సీజ‌న్‌లో క‌నిపించిన న‌వదీప్ ప్రేక్ష‌కుల‌ను చాలా ఎంట‌ర్‌టైన్ చేశాడు. అత‌డి ఇంట‌ర్వ్యూలు చూస్తే కూడా కామెడీ టైమింగ్ అర్థ‌మ‌వుతుంది. సోష‌ల్‌మీడియాలో ఎక్కువ‌గా యాక్టివ్‌గా ఉండే న‌వ‌దీప్ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టే స్టోరీలు కామెంట్స్‌కు ఇచ్చే రిప్లైలు కూడా చాలా ఫ‌న్నీగా ఉంటాయి. ఆయ‌న‌కు ఇండ‌స్ట్రీలో ఫ్రెండ్స్ కూడా ఎక్కువే. అందుకే న‌వ‌దీప్ టాక్‌షో హోస్ట్ చేస్తే చాలా బాగుంటుంది. 

    విజ‌య్‌దేవ‌ర‌కొండ‌

    ఏది అనిపిస్తే అది మాట్లాడేయ‌డం, ఉన్న‌ది ఉన్న‌ట్లుగా కుండ బ‌ద్దలు కొట్టిన‌ట్లుగా చెప్పేయ‌డంతో పాటు మంచి మ‌న‌సు ఉన్న హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ. చాలా త‌క్కువ కాలంలోనే టాప్ హీరో రేంజ్‌కి ఎదిగిన విజ‌య్ మాట్లాడుతుంటే ఆసక్తిగా చూస్తారు ప్రేక్ష‌కులు. ఈ రౌడీ హీరో వ్యాఖ్యాత‌గా చేస్తే చూడాల‌ని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. 

    దేత్త‌డి హారిక‌

    యూట్యూబ్‌లో దేత్త‌డి హారిక‌గా ఫేమ‌స్ అయిన ఈ తెలంగాణ పిల్ల‌ బిగ్‌బాస్ త‌ర్వాత భారీగా క్రేజ్ తెచ్చుకుంది. ప్ర‌స్తుతం వెబ్‌సిరీస్‌లు, సినిమాల‌తో బిజీగా ఉన్న ఈ బ్యూటీ సెల‌బ్రిటీల‌తో మాట్లాడుతూ చ‌లాకీగా ఎంట‌ర్‌టైన్ చేస్తే సెల‌బ్రిటీ టాక్‌షో హోస్ట్ చేస్తే బాగుంటుంది. క్రేజీగా, యాక్టివ్ గా షోని న‌డిపించ‌గ‌లిగే టాలెంట్ హారిక‌లో ఉంది. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version