నేష‌న‌ల్ అవార్డులు దక్కిందెవరికి..?
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నేష‌న‌ల్ అవార్డులు దక్కిందెవరికి..?

    నేష‌న‌ల్ అవార్డులు దక్కిందెవరికి..?

    October 25, 2021
    in News

    New Delhi, Oct 25 (ANI): Vice President M Venkaiah Naidu presents Dadasaheb Phalke award to Tamil actor Rajinikanth at the 67th National Film Awards ceremony, in New Delhi on Monday. Union Minister of Information and Broadcasting Anurag Thakur was also present. (ANI Photo)

    భారతీయ చలనచిత్ర రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం సోమవారం అట్టహాసంగా జరిగింది. దిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో నిర్వహించిన 67వ జాతీయ చలనచిత్ర అవార్డుల కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా పలువురు అవార్డులు అందుకున్నారు.

    దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న రజినీ

    సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌కు సినీ పరిశ్రమలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘దాదాసాహెబ్‌ ఫాల్కే’ అవార్డు లభించింది. గత నాలుగు దశాబ్దాలుగా సినీ పరిశ్రమకు ఆయన చేస్తోన్న సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం.. ఆయన్ని ఈ పురస్కారంతో గౌరవించింది. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆయనకు అవార్డును అందజేశారు. మరోవైపు అసుర‌న్‌కు బెస్ట్ యాక్ట‌ర్ ర‌జ‌నీకాంత్ అల్లుడు ధ‌నుష్ నేష‌న‌ల్ అవార్డ్ అందుకున్నారు.

    మ‌హ‌ర్షి.. నేష‌న‌ల్ అవార్డు అందుకున్న వంశీ పైడిప‌ల్లి

    2019 సంవ‌త్స‌రానికి మ‌హ‌ర్షి సినిమాకు సంబంధించి వంశీ పైడిప‌ల్లీ, ప్రొడ్యూస‌ర్ దిల్‌రాజు నేష‌న‌ల్ ఫిల్మ్ అవార్డుల‌ను అందుకున్నారు. దిల్లీ విజ్ఞాన్ భవన్‌లో 67వ‌ జాతీయ చ‌ల‌న‌చిత్ర అవార్డుల ప్ర‌దానోత్స‌వం జ‌రుగుతోంది. 2019లో బెస్ట్ పాపుల‌ర్, ఎంట‌ర్‌టైనర్‌గా మ‌హ‌ర్షికి ఈ అవార్డు ద‌క్క‌గా, బెస్ట్ కొరియోగ్ర‌ఫీకి మ‌రో అవార్డు ల‌భించింది.

     ఉత్త‌మ తెలుగు చిత్రం జెర్సీకి నేష‌న‌ల్ అవార్డ్స్‌

    భారతీయ చలనచిత్ర రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం సోమవారం అట్టహాసంగా జరిగింది. దిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో నిర్వహించిన 67వ జాతీయ చలనచిత్ర అవార్డుల కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా పలువురు అవార్డులు అందుకున్నారు. జెర్సీ సినిమాకు 2019 సంవ‌త్సరానికి ఉత్త‌మ చిత్రం , ఉత్త‌మ ఎడిటింగ్ కేట‌గిరీస్‌లో రెండు అవార్డులు ల‌భించాయి. డైరెక్ట‌ర్ గౌత‌మ్ తిన్న‌నూరి, ప్రొడ్యూస‌ర్ నాగ‌వంశీ, ఎడిట‌ర్ న‌వీన్ నూలి ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యారు.

    విజేతలు వీరే..

    > ఉత్తమ చిత్రం: మరక్కర్ (మలయాళం)

    > ఉత్తమ నటుడు: మనోజ్‌ బాజ్‌పాయీ (భోంస్లే), ధనుష్‌ (అసురన్‌)

    > ఉత్తమ నటి : కంగనా రనౌత్‌ (మణికర్ణిక)

    > ఉత్తమ దర్శకుడు: సంజయ్‌ పూరన్‌ సింగ్‌ చౌహాన్‌ (బహత్తర్‌ హూరైన్‌)

    > ఉత్తమ తెలుగు చిత్రం: జెర్సీ

    > ఉత్తమ ఎడిటింగ్‌: నవీన్‌ నూలి (జెర్సీ)

    > ఉత్తమ వినోదాత్మక చిత్రం: మహర్షి

    > ఉత్తమ హిందీ చిత్రం: చిచ్చోరే

    > ఉత్తమ తమిళ చిత్రం:  అసురన్‌

    > ఉత్తమ సహాయ నటి: పల్లవి జోషి(ది తాష్కెంట్‌ ఫైల్స్‌)

    > ఉత్తమ సహాయ నటుడు: విజయ్‌ సేతుపతి(సూపర్‌ డీలక్స్‌)

    > ఉత్తమ యాక్షన్‌ కొరియోగ్రఫీ: అవనే శ్రీమన్నారాయణ(కన్నడ)

    > ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్‌: మరక్కర్‌ (మలయాళం)

    > ఉత్తమ సంగీత దర్శకుడు (పాటలు): డి.ఇమ్మాన్‌ (విశ్వాసం)

    > ఉత్తమ సంగీత దర్శకుడు (నేపథ్య): ప్రబుద్ధ బెనర్జీ (జ్యేష్టపుత్రో)

    > ఉత్తమ మేకప్‌: రంజిత్‌ (హెలెన్‌)

    > ఉత్తమ గాయకుడు: బ్రి.ప్రాక్‌ (కేసరి చిత్రంలోని ‘తేరీ మిట్టీ…’)

    > ఉత్తమ గాయని: శావని రవీంద్ర (బర్దో-మరాఠీ)

    > ఉత్తమ కొరియోగ్రాఫర్‌: రాజు సుందరం (మహర్షి)

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version