800 Movie Review: కంటతడి పెట్టించిన మురళీధరన్‌ జీవిత కథ.. సినిమా ఎలా ఉందంటే?
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • 800 Movie Review: కంటతడి పెట్టించిన మురళీధరన్‌ జీవిత కథ.. సినిమా ఎలా ఉందంటే?

    800 Movie Review: కంటతడి పెట్టించిన మురళీధరన్‌ జీవిత కథ.. సినిమా ఎలా ఉందంటే?

    November 10, 2023

    న‌టీన‌టులు: మధుర్ మిత్తల్‌, మహిమా నంబియార్, నరేన్, వేల తదితరులు

    రచన, దర్శకత్వం: ఎం.ఎస్ శ్రీపతి

    సంగీతం: జిబ్రాన్‌

    సినిమాటోగ్రఫీ: ఆర్డీ రాజశేఖర్

    నిర్మాత: వివేక్ రంగాచారి

    బ్యానర్: మూవీ ట్రైన్ మోషన్ పిక్చర్స్‌

    శ్రీలంక స్పిన్‌ దిగ్గజం ముత్త‌య్య ముర‌ళీధ‌ర‌న్ (Muttiah Muralitharan) జీవితకథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘800’. టెస్ట్ మ్యాచ్‌ల్లో 800 వికెట్లు తీసిన ఏకైక క్రికెట‌ర్ మురళీధరన్‌. అందుకే సినిమాకు ‘800’ టైటిల్‌ను పెట్టారు. శ్రీలంక‌ తమిళ కుటుంబానికి చెందిన ముత్త‌య్య ఎన్నో స‌వాళ్ల‌ని ఎదుర్కొంటూ ఆ దేశ జ‌ట్టులో చోటు సంపాదించారు. అనతికాలంలోనే స్టార్‌ క్రికెట‌ర్‌గా ఎదిగారు. ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. మరి ఆయ‌న జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ఎలా ఉంది? భావోద్వేగాలు బాగా పండాయా? వంటి అంశాలు ఇప్పుడు చూద్దాం. 

    కథ

    తేయాకు తోట‌ల్లో ప‌నిచేస్తున్న త‌మిళ కుటుంబంలో ముత్త‌య్య ముర‌ళీధ‌ర‌న్‌ జన్మిస్తారు. శ్రీలంక‌లోని కాండీలో ఆ కుటుంబం బిస్కెట్ ఫ్యాక్ట‌రీ ఏర్పాటు చేస్తుంది. ఈ క్రమంలోనే సింహ‌ళులు, త‌మిళుల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌లు చెల‌రేగుతాయి. దాంతో ముత్త‌య్య కుటుంబం ప్రాణ భయంతో దూరంగా వెళ్లి త‌ల‌దాచుకుంటుంది. 70వ దశకంలో చెలరేగిన ఘ‌ర్ష‌ణ‌ల ప్ర‌భావం త‌న బిడ్డ‌పై ప‌డ‌కూడ‌ద‌ని ముత్త‌య్య త‌ల్లిదండ్రులు ఏం చేశారు? ముత్త‌య్యకి క్రికెట్‌పై ఆస‌క్తి ఎలా ఏర్ప‌డింది? శ్రీలంక జ‌ట్టులో ఎలా చోటు సంపాదించాడు? ఎలాంటి అవ‌మానాల్ని, స‌వాళ్ల‌ని ఎదుర్కొని ఆట‌గాడిగా నిలబడ్డాడు? వంటి అంశాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

    ఎవరెలా చేశారంటే

    ముత్త‌య్య ముర‌ళీధ‌ర‌న్ పాత్ర‌లో మ‌ధుర్ మిత్తల్‌ అద్భుత నటన కనబరిచారు. ఆయ‌న బౌలింగ్ స్టైల్‌ని, హావ‌భావాల్ని బాగా అనుకరించాడు. అయితే కొన్నిచోట్ల మురళిధరన్‌లాగా ఆయన లుక్‌ అనిపించదు. కొన్నిచోట్ల భావోద్వేగాల్ని మాత్రం మధుర్‌ బాగా పండించారు మధుర్‌. ముర‌ళీ భార్య మ‌దిమ‌ల‌ర్  పాత్ర‌లో మ‌హిమా నంబియార్ కొద్దిసేపే కనిపించింది. ఇక క‌థని న‌డిపించే పాత్ర‌లో నాజ‌ర్ క‌నిపిస్తారు. ర‌ణ‌తుంగ‌, కపిల్ దేవ్‌, షేన్ వార్న్ త‌దితరుల పాత్రల్ని తెర‌పై చూపించిన తీరు ఆకట్టుకుంది. ముఖ్యంగా ర‌ణ‌తుంగ పాత్ర‌లో కనిపించిన న‌టుడు యాక్టింగ్‌తో మెప్పించాడు. అప్ప‌టి జ‌ట్టులోని స‌భ్యుల్ని గుర్తుకు తెచ్చేలా పాత్ర‌ల్ని మ‌లిచిన తీరు బాగుంది. 

    ఎలా సాగిదంటే

    ముత్త‌య్య బాల్యం నుంచి ఆయన 2010లో తీసిన 800వ వికెట్ వ‌ర‌కూ సినిమా సాగుతుంది.  త‌మిళుడిగా శ్రీలంక జ‌ట్టులో చోటు సంపాదించేందుకు ఆయ‌న ప‌డిన క‌ష్టం, ఎదురైన అవ‌మానాలు  ప్ర‌థ‌మార్ధంలో చూపించారు. శ్రీలంక‌లో వివ‌క్ష ఎలా ఉండేదో, అక్క‌డి త‌మిళుల ప‌రిస్థితిని ఆరంభంలోనే క‌ళ్ల‌కు క‌ట్టారు.  క్రికెట్‌పై మ‌క్కువ పెంచుకోవడం నుంచి శ్రీలంక జ‌ట్టులో ముత్తయ్య  చోటు సంపాదించేదాకా ప్రథమార్ధం సాగింది. ద్వితియ భాగంలో క్రీడాకారుడిగా ఆయ‌న ఎదుర్కొన్న స‌వాళ్లు, సాధించిన ఘ‌న‌త‌లు చూపించారు. ముత్త‌య్య అర్ధాంత‌రంగా ఆట‌కి వీడ్కోలు చెప్పాల‌ని నిర్ణ‌యించుకోవ‌డం వెన‌క కార‌ణాల్ని ప‌తాక స‌న్నివేశాల్లో కళ్లకు కట్టారు. ముత్త‌య్య  వైవాహిక జీవితాన్ని కూడా తెర‌పై ఆవిష్క‌రించారు. 

    డైరెక్షన్‌ ఎలా ఉందంటే?

    కథలో డ్రామా, భావోద్వేగాలు, మ‌లుపులు ఉన్నప్పటికీ దానిని డైరెక్టర్ ఎం.ఎస్ శ్రీపతి సరిగ్గా తెరకెక్కించలేకపోయారు. ఎవరినీ నొప్పించకుండా కథ తీయాలని డైరెక్టర్‌ భావించినట్లు కనిపిస్తోంది. దాంతో సినిమాలో ఆశించిన స్థాయిలో భావోద్వేగాలు పండలేదు. చాలా చోట్ల ఓ డాక్యుమెంట‌రీ చూస్తున్న అనుభూతి క‌లుగుతుంది. క్రికెట్ నేప‌థ్యంలో సాగే సన్నివేశాలు బాగానే తీసినప్పటికీ, ముత్త‌య్య క్రీడా జీవితంలోని కీల‌క ఘ‌ట్టాల్ని అంత ప్రభావవంతంగా డైరెక్టర్‌ చూపలేకపోయారు. ప‌తాక స‌న్నివేశాల్లో 800వ వికెట్ సాధించే క్ర‌మాన్ని కూడా మ‌రింత రసవత్తరంగా చూపించే ఛాన్స్‌ ఉన్నా డైరెక్టర్‌ వదులుకున్నారు. ముర‌ళీ, మ‌దిమ‌ల‌ర్ వైవాహిక  జీవితాన్ని కూడా పైపైనే స్పృశించారు.

    టెక్నికల్‌గా..

    సాంకేత‌కంగా సినిమా ఉన్న‌తంగా ఉంది. జిబ్రాన్ సంగీతం, రాజ‌శేఖ‌ర్ కెమెరా ప‌నిత‌నం ఆక‌ట్టుకుంటుంది. క్రికెట్ నేప‌థ్యంలో స‌న్నివేశాల్ని తెర‌పైకి తీసుకొచ్చిన తీరు మెప్పిస్తుంది. ప్ర‌వీణ్ ఎడిటింగ్ బాగుంది. విస్తృత పరిధి  ఉన్న ఇలాంటి జీవితక‌థ‌ల్ని తెర‌పైకి తీసుకు రావ‌డం క‌త్తిమీద సాములాంటిదే. నిర్మాణం బాగుంది.

    ప్లస్‌ పాయింట్స్‌
    • మ‌ధుర్ న‌ట‌న
    • ముత్తయ్య జీవితంలో ఎత్తు ప‌ల్లాలు
    • క్రికెట్ స‌న్నివేశాలు
    మైనస్‌ పాయింట్స్‌
    • కొరవడిన భావోద్వేగాలు 
    • తేలిపోయిన పతాక సన్నివేశాలు
    రేటింగ్‌: 3/5
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version