భారత మహిళా పైలట్‌కు అరుదైన గౌరవం
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • భారత మహిళా పైలట్‌కు అరుదైన గౌరవం

    భారత మహిళా పైలట్‌కు అరుదైన గౌరవం

    August 19, 2022
    in News, World

    ఎయిర్‌ ఇండియా పైలట్‌ జోయా అగర్వాల్‌కు అరుదైన గౌరవం దక్కింది. ప్రఖ్యాత శాన్‌ ఫ్రాన్సిస్కో ఏవియేషన్‌ మ్యూజియంలో ఆమెకు చోటుదక్కింది. శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి బెంగళూరు వరకు నార్త్‌పోల్‌ మీదుగా 16000 కిలోమీటర్లు ప్లేన్ నడిపిన తొలి భారత మహిళా పైలట్‌గా జోయా రికార్డు సృష్టించినందుకు గానూ ఆమెకు ఈ గౌరవం దక్కింది. 2021లో జోయా ఈ ఘనత సాధించారు. ‘ SFO ఏవియేషన్‌ మ్యూజియంలో చోటు దక్కడం చాలా సంతోషంగా ఉంది. యూఎస్‌ఏలోని ప్రఖ్యాత మ్యూజియంలో నేను చిరకాలం నిలిచిపోతాననే ఊహను కూడా నేను నమ్మలేకపోతున్నాను’ అని జోయా న్యూస్‌ ఏజెన్సీ ఏఎన్‌ఐకి తెలిపింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version