Aa Okkati Adakku Review: వింటేజ్‌ అల్లరి నరేష్‌ ఈజ్ బ్యాక్‌.. ‘ఆ ఒక్కటి అడక్కు’ హిట్‌ కొట్టినట్లేనా?
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Aa Okkati Adakku Review: వింటేజ్‌ అల్లరి నరేష్‌ ఈజ్ బ్యాక్‌.. ‘ఆ ఒక్కటి అడక్కు’ హిట్‌ కొట్టినట్లేనా?

    Aa Okkati Adakku Review: వింటేజ్‌ అల్లరి నరేష్‌ ఈజ్ బ్యాక్‌.. ‘ఆ ఒక్కటి అడక్కు’ హిట్‌ కొట్టినట్లేనా?

    May 3, 2024

    నటీ నటులు : అల్లరి నరేష్‌, ఫరియా అబ్దుల్లా, వెన్నెల కిషోర్‌, జామీ లివర్‌, హర్ష చెముడు, అరియానా గ్లోరి తదితరులు..

    డైరెక్టర్‌ : మల్లీ అంకం

    సినిమాటోగ్రాఫర్‌ : సూర్య

    సంగీతం : గోపి సుందర్‌

    నిర్మాత : రాజీవ్‌ చిలక

    నిర్మాణ సంస్థ : చిలక ప్రొడక్షన్స్‌

    విడుదల తేదీ: 3 మే, 2024

    అల్లరి నరేష్‌ (Allari Naresh), ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) జంటగా నటించిన లేటెస్ట్‌ చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’ (Aa Okkati Adakku). మల్లి అంకం దర్శకత్వం వహించాడు. కొన్ని సంవత్సరాల గ్యాప్‌ తర్వాత అల్లరి నరేష్‌ మళ్లీ కామెడీ సినిమాతో ప్రేక్షకుల ముందు వస్తుండటంపై సినిమాపై అంచనాలు పెరిగాయి. మే 3న విడుదలైన ఈ చిత్రం ఆడియన్స్‌ను ఆకట్టుకుందా? అల్లరి నరేష్‌ ఖాతాలో మరో విజయం చేరినట్లేనా? ఈ రివ్యూలో తెలుసుకుందాం. 

    కథేంటి

    గణపతి (అల్లరి నరేష్) సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో పనిచేస్తుంటాడు. పెళ్లి సంబంధాలు చూడటంలో హాఫ్ సెంచరీ కంప్లీట్ చేస్తాడు. వయసు ఎక్కువ కావడంతో పాటు పెళ్లైన సోదరుడు ఉండటంతో అతడికి ఎవరూ పిల్లను ఇవ్వరు. ఓ రోజు మ్యాట్రిమోనీ సైట్‌లో సిద్ధి (ఫరియా అబ్దుల్లా)ని చూసి ప్రేమలో పడతాడు. ఆమె తిరస్కరించడంతో ఇద్దరూ ఫ్రెండ్స్‌గా మారతారు. అయితే మ్యాట్రిమోనీ ద్వారా సిద్ధి  అబ్బాయిలను మోసం చేస్తోందంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తాయి. ఇందులో నిజమెంత? సిద్ధి ఎవరు? ఆమె నేపథ్యం ఏంటి? ఓ మ్యాట్రిమోనీ సంస్థ పెళ్లికానీ అబ్బాయిలను ఎలా మోసం చేసింది? చివరికీ సిద్ధి – గణపతి ఒకట్టయ్యారా? లేదా? అన్నది కథ.

    ఎవరెలా చేశారంటే

    గణపతి పాత్రలో అల్లరి నరేష్‌ చక్కగా ఒదిగిపోయాడు. పాత్రలో పరకాయ ప్రవేశం చేసి మరి నటించాడు. తన కామెడీ టైమింగ్‌తో వింటేజ్‌ నరేష్‌ను గుర్తు చేశాడు. ఇక సిద్ధి పాత్రలో ఫరియా అబ్దుల్లా పర్వాలేదనిపించింది. నటన పరంగా ఆమెకు పెద్దగా స్కోప్‌ రాలేదు. హీరో హీరోయిన్ల మధ్య వచ్చే సరదా సంభాషణలు, వారి పెయిర్‌ ఆకట్టుకుంటాయి. ఇక జెమీ లివర్‌ ఎక్స్‌ప్రెషన్స్‌, ఆమె హుషారైన నటన మెప్పిస్తుంది. వెన్నెల కిషోర్‌, హర్ష చెముడు స్క్రీన్‌పైన కనిపిస్తున్నంత సేపు నవ్వించారు. మిగిలిన పాత్ర దారులు తమ పరిధిమేరకు నటించారు. 

    డైరెక్షన్ ఎలా ఉందంటే

    ప్రస్తుతం చాలా మంది యువత ఎదుర్కొంటున్న సమస్యను కథాంశంగా చేసుకొని దర్శకుడు మల్లి అంకం ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మ్యాట్రిమోనీ సైట్లలో యువతీ యువకులకు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయో కళ్లకు కట్టే ప్రయత్నం చేశాడు. అయితే ప్రచార చిత్రాల్లో చూపించినట్లు ఇది ఔట్‌ అండ్ ఔట్‌ కామెడీ చిత్రం కాదు. ఎన్నారై పెళ్లి కొడుకుల మోసాలు, మనం తరచూ వార్తల్లో చూసే విషయాలు తప్ప కొత్తగా ఇందులో ఏమీ లేదు. ఫేక్ పెళ్లి కూతురు కాన్సెప్ట్ కాస్త కొత్తగా అనిపించినా దాని చుట్టూ అల్లుకున్న కామెడీ మాత్రం వర్కౌట్‌ కాలేదు. ఫస్టాఫ్‌ వరకూ కామెడీ పర్వాలేదనిపించినా సెకండాఫ్‌లో మాత్రం అది ఎక్కడ కానరాదు. పెళ్లి అనే కాన్సెప్ట్‌ తీసుకొని డైరెక్టర్‌ కథను మరీ సాగదీసినట్లు అనిపించింది. 

    టెక్నికల్‌గా 

    టెక్నికల్‌ అంశాల విషయానికి వస్తే రాజ్‌ సుందర్‌ అందించిన సంగీతం పర్వాలేదు. ‘రాజాది రాజా..’ సాంగ్‌ మళ్లీ మళ్లీ వినేలా ఉంది. నేపథ్య సంగీతం సోసోగా ఉంది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్‌ తన కత్తెరకు కాస్త పని చెప్పి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.

    ప్లస్ పాయింట్స్‌

    • అల్లరి నరేష్‌ నటన
    • కామెడీ

    మైనస్‌ పాయింట్స్

    • కథలో మెరుపులు లేకపోవడం
    • సాగదీత సీన్లు

    Telugu.yousay.tv Rating : 2.5/5

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version