ఆది సాయికుమార్ హీరోగా నటించిన మూవీ ‘తీస్‌మార్‌ఖాన్’. పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్. పూర్ణ, సునీల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి కళ్యాణ్ జీ గోగాన దర్శకత్వం వహించాడు. సాయికార్తిక్ మ్యూజిక్ అందించాడు. విజన్ సినిమాస్ బ్యానర్‌పై నాగం తిరుపతిరెడ్డి ఈ చిత్రాన్నినిర్మించారు. సినిమా తప్పకుండా హిట్ అవుతుందని చాలా నమ్మకంగా ఉంది చిత్రబృందం. మరి సినిమా ఎలా ఉంది? ఆది సాయికుమార్ హిట్ కొట్టాడా? తెలుసుకుందాం
కథేంటంటే..
తీస్‌మార్‌ఖాన్(ఆది సాయికుమార్) ఒక కాలేజీ స్టూడెంట్. అతడు పోలీసు కావడమే లక్ష్యంగా పెట్టుకుంటాడు. అయితే తీస్‌మార్‌ఖాన్ పోలీసుగా మారే సమయంలో మాఫియాకు చెందిన ఒక వ్యక్తి ఇబ్బంది పెడుతుంటాడు. ఈ క్రమంలో అతడు తన సోదరిని, ఆమె భర్తను కోల్పోతాడు. తర్వాత ఏం జరుగుతుంది? వారిపై తీస్‌మార్‌ఖాన్ పగ తీర్చుకుంటాడా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!
విశ్లేషణ:
కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కింది. ఎక్కువగా హీరోకి, అతడి సోదరికి ఉన్న అనుబంధాన్ని చూపించే ప్రయత్నం చేశారు. పాయల్ రాజ్‌పుత్ కేవలం గ్లామరస్ రోల్‌లో కనిపించి, పాటల్లో అందాలు ఆరబోయడంతో సరిపెట్టింది. పూర్ణకు ఈ చిత్రంలో మంచి పాత్ర లభించింది. ఆది సాయికుమార్ వైవిధ్యమైన షేడ్స్ ఉన్న పాత్రలో నటించి మెప్పించాడు. కథలో కొత్తదనం ఏమీ ఉండదు. ఇంతకుముందు చాలాసార్లు చూసిన స్టోరీలా అనిపిస్తుంటుంది. పాటలు కూడా సందర్భం లేకుండా వచ్చి చిరాకు తెప్పిస్తుంటాయి. కమర్షియల్ సినిమాలు నచ్చేవాళ్లకు ఈ కథ ఫర్వాలేదనిపించవచ్చు. కానీ కథ విషయంలో దర్శకుడు మరికాస్త జాగ్రత్త వహిస్తే బాగుండేది. నిర్మాణ విలువలు బాగున్నాయి. సాయికార్తిక్ సంగీతం పెద్దగా మెప్పించలేదు.
బలాలు:
సినిమాటోగ్రఫీ
నిర్మాణ విలువలు
బలహీనతలు:
రొటీన్ స్టోరీ
సంగీతం
స్క్రీన్‌ప్లే
Celebrities Featured Articles Movie News
Anasuya Bharadwaj: రౌడీ బాయ్‌ను మళ్లీ గెలికిన అనసూయ! దూరపు కొండలు అంటూ..