ప్రముఖ నటి ప్రియాంక నల్కారి వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. తన ప్రియుడు, బిజినెస్ మేన్, నటుడు రాహుల్ వర్మను మలేషియాలో సీక్రెట్‌గా పెళ్లి చేసుకుంది. మలేషియాలోని మురుగన్ ఆలయంలో వీరిద్దరూ రహస్య వివాహం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా ప్రియాంక ‘అందరి బంధువయా’ చిత్రంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తమిళంలో ‘సమ్‌థింగ్ సమ్‌థింగ్’, ‘కాంచన-3’ చిత్రాల్లో నటించింది.
ప్రియాంక పెళ్లి చేసుకున్న రాహుల్ అనే వ్యక్తి తెలుగులో పలు సీరియళ్లలో నటించినట్లు తెలుస్తోంది. ఆ సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించినట్లు సమాచారం. 2018లోనే వీరికి ఎంగేజ్మెంట్ జరగ్గా సీరియళ్లలో బిజీగా ఉండటంతో ప్రియాంక పెళ్లిని వాయిదా వేస్తూ వచ్చారు. దీని వల్లే రాహుల్ ఎంగెజ్మెంట్ రద్దు చేసుకొని మలేషియా వెళ్లాడని అప్పట్లో వార్తలు షికారు చేశాయి.
తాజాగా తన పెళ్లిపై జరుగుతున్న ప్రచారంపై నటి ప్రియాంక క్లారిటీ ఇచ్చారు. రాహుల్ తాను మలేషియాలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. అయితే పాస్‌పోర్టు లభించకపోవడంతో కుటుంబ సభ్యులు రాలేదని చెప్పుకొచ్చారు. తమ పెళ్లిపై ఇంట్లో వారంతా హ్యాపీ అని స్పష్టం చేశారు. ప్రస్తుతం రాహుల్ మలేషియాలోనే ఉండగా తాను షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చేసినట్లు స్పష్టం చేశారు.
Celebrities Featured Articles Hot Actress
Arrchita Agarwaal: శరీరం అలా ఉంటేనే ఇండస్ట్రీలోకి రావాలి: బాలీవుడ్ నటి