Ahimsa Movie Review: తేజ రొటీన్ రొడ్డకొట్టుడు లవ్ స్టోరీ.. కానీ అభిరామ్ యాక్టింగ్ సూపర్బ్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Ahimsa Movie Review: తేజ రొటీన్ రొడ్డకొట్టుడు లవ్ స్టోరీ.. కానీ అభిరామ్ యాక్టింగ్ సూపర్బ్

    Ahimsa Movie Review: తేజ రొటీన్ రొడ్డకొట్టుడు లవ్ స్టోరీ.. కానీ అభిరామ్ యాక్టింగ్ సూపర్బ్

    June 2, 2023

    నటీనటులు: అభిరామ్‌ దగ్గుబాటి, గీతికా తివారి, సదా, కమల్‌ కామరాజ్‌, కల్పలత, రవి కాలే, రజత్ బేడి

    దర్శకత్వం: తేజ

    సంగీతం: R.P పట్నాయక్‌

    సినిమాటోగ్రఫీ: సమీర్‌ రెడ్డి

    టాలీవుడ్‌లో దగ్గుబాటి ఫ్యామిలీకి ఎంతో పేరు ఉంది. ప్రముఖ నిర్మాత డి. రామానాయుడు వారసులుగా వచ్చిన సురేష్‌బాబు, వెంకటేష్‌ ఇండస్ట్రీపై చెరగని ముద్ర వేశారు. సురేష్‌ బాబు విజయవంతమైన సినిమాలు నిర్మిస్తే.. వెంకటేష్‌ ఫ్యామిలీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. వారి వారసుడుగా వచ్చిన రానా కూడా తనకంటూ ప్రత్యేక ఫ్లాట్‌ఫామ్ క్రియేట్ చేసుకున్నాడు. తాజాగా దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి మరో హీరో ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. రానా తమ్ముడు దగ్గుబాటి అభిరామ్ ‘అహింస’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. తేజ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇవాళ (జూన్‌ 2) రిలీజైంది. మరి ఈ సినిమా ఎలా ఉంది?. అభిరామ్‌ తొలి హిట్‌ అందుకున్నాడా? ఇప్పుడు చూద్దాం. 

    కథ

    రఘు (దగ్గుబాటి అభిరామ్) అహింసావాది. చీమకు కూడా హాని తలపెట్టని మనస్తత్వం అతనిది. రఘు అంటే అతని మరదలు అహల్య (గీతికా తివారి)కి ఎంతో ప్రేమ. వాళ్ళిద్దరికీ నిశ్చితార్థమైన రోజే ఆమెపై ధనలక్ష్మి దుష్యంత రావు (రజత్ బేడీ) ఇద్దరు కుమారులు దారుణంగా అత్యాచారానికి పాల్పడతారు. పూర్తి అహింసావాదైన రఘు వారిపై న్యాయపోరాటానికి దిగుతాడు. అతడికి లాయర్‌ లక్ష్మీ (సదా) సాయం చేస్తుంది. ఈ క్రమంలో లక్ష్మీ కుటుంబాన్ని దుష్యంతరావు చంపేస్తాడు. దీంతో న్యాయంగా, అహింస మార్గంలో దుష్యంతరావును గెలవలేమని భావించిన హీరో ఏం చేశాడన్నది అసలు కథ. ఇది తెలియాలంటే థియేటర్లకు వెళ్లాల్సిందే. 

    ఎవరెలా చేశారంటే

    హీరోగా అభిరామ్‌ నటనతో ఆకట్టుకున్నాడు. కీలకమైన సన్నివేశాల్లో తన శక్తిమేరకు నటించాడు. ఇదే తొలి సినిమా కావడంతో నటన పరంగా ఓకే అని చెప్పొచ్చు. హీరోయిన్‌ గీతికా తివారి తన నటనతో ఆకట్టుకుంది. అందం, అభినయంతో మెప్పించింది. కొన్ని సీన్లలో అందాలు సైతం ఆరబోసింది. ఇక లాయర్‌ పాత్రలో సదా పర్వాలేదనిపించింది. రవి కాలె సహా మిగతా ఆర్టిస్టులు అందరూ వారి పాత్రలకు న్యాయం చేశారు. 

    డైరెక్షన్ ఎలా ఉందంటే

    డైరెక్టర్‌ తేజ మంచి కథనే ఎంచుకున్నాడు. కానీ, దాన్ని సరిగ్గా ప్రజెంట్‌ చేయలేకపోయారు. సినిమా చూస్తున్నంత ప్రేక్షకుడికి ఏమాత్రం ఆసక్తి ‌అనిపించదు. కొన్ని సీన్లు చూస్తే జయం, నువ్వు నేను సినిమాలే గుర్తుకు వస్తాయి. సినిమా మరీ సాగదీసినట్లు అనిపిస్తుంది. లాజిక్స్‌లతో సంబంధం లేకుండా ఈ సినిమాను తేజ తెరకెక్కించాడు. సినిమా పీక్ స్టేజ్‌లో ఉన్న‌ప్పుడు ఐటెమ్ సాంగ్ రావడం ఆడియన్స్‌కు రుచించదు. కొడుకుల శవాలు ఇంట్లో ఉండగా విలన్‌ ఇంట్లో ఐటెమ్‌ సాంగ్ ఎందుకు పెట్టడం అసలు అర్థం కాదు. దీంతో మూవీ త్వరగా ముగిస్తే బాగుంటుందన్న ఫీలింగ్‌ సగటు ప్రేక్షకుడికి కలుగుతుంది. మెుత్తంగా సినిమాలో తేజ మార్క్‌ ఉన్నా రొటీన్‌ సన్నివేశాలతో బోర్ అనిపిస్తుంది. 

    టెక్నికల్‌గా

    టెక్నికల్‌ విషయాలకు వస్తే ఆర్పీ పట్నాయక్‌ సంగీతం పర్వాలేదనిపించిది. కొన్ని పాటలు బాగున్నాయి. ‘ఉందిలే’ పాట ఆకట్టుకుంది. చంద్రబోస్‌ అందించిన సాహిత్యం.. లోతైన భావంతో అర్థవంతంగా అనిపిస్తుంది. నేపథ్య సంగీతం కూడా బాగుంది. సమీర్‌రెడ్డి అందించిన సినిమాటోగ్రఫీ మూవీకి ప్లస్ అని చెప్పొచ్చు. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. 

    ప్లస్‌ పాయింట్స్‌

    • సినిమాటోగ్రఫీ
    • సంగీతం

    మైనస్‌ పాయింట్స్‌

    • సాగదీత
    • రొటీన్‌ సీన్స్
    • లాజిక్‌ లేని సన్నివేశాలు

    రేటింగ్‌: 2/5

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version