అఖిల్‌ “ ఏజెంట్” ట్రైలర్ వచ్చేసింది
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • అఖిల్‌ “ ఏజెంట్” ట్రైలర్ వచ్చేసింది

  అఖిల్‌ “ ఏజెంట్” ట్రైలర్ వచ్చేసింది

  April 19, 2023

  స్టైలిష్‌ డైరెక్టర్‌ సురేందర్‌ రెడ్డి, అక్కినేని అఖిల్‌ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఏజెంట్‌’ సినిమా ట్రైలర్‌ విడుదలైంది. ఈ సినిమాతో అఖిల్‌ రేంజ్‌ పాన్‌ ఇండియాకు వెళ్తుందని చిత్రబృందం పక్కా ధీమాతో ఉంది. మరి ట్రైలర్‌ చూశాక మీకు అదే అనిపిస్తే కామెంట్‌ చేయండి.

  Screengrab Instagram: akhil akkineni

  2020లో అఖిల్ ఏజెంట్ సినిమా చేస్తున్నట్లు ప్రకటించాడు. కరోనా కారణంగా ఏడాది ఆలస్యం అయ్యింది. 2021లో చిత్రాన్ని ప్రారంభించారు. అప్పట్నుంచి షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా కాస్త ఆలస్యంగానే విడుదలవుతుంది. సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర నిర్మించారు. సినిమా విజయం సాధిస్తుందని నమ్మకంతో ఉన్నారు. 

  Courtesy Instagram: Akhil

  ఏజెంట్ చిత్రం ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇందులో మమ్ముట్టి, డినో మోరియా ప్రధాన పాత్రలో నటించారు. అఖిల్ సరసన సాక్షి వైద్య హీరోయిన్‌గా చేస్తోంది. స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌ జోనర్‌లో సినిమాను తెరకెక్కించారు. మెుదట్లో తమన్‌ను సంగీత దర్శకుడిగా ఎంచుకున్నప్పటికీ వివిధ కారణాల వల్ల మళ్లీ మార్చారు. తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్‌ హిపాప్ తమిజా పాటలు సమకూర్చారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
  Exit mobile version