అల్ల‌రి న‌రేశ్ ‘ఉగ్రం’ షూటింగ్ స్టార్ట్

అల్ల‌రి న‌రేశ్, విజ‌య్ క‌న‌క‌మేడ‌ల ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న రెండో సినిమా ‘ఉగ్రం’. నేటి నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభ‌మైన‌ట్లుగా చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది. దీనికి సంబంధించి రిలీజ్ చేసిన వీడియోలో అల్ల‌రి న‌రేశ్ మొహానికి మ‌సి పూసుకొని భ‌యంక‌రంగా ఉగ్ర‌రూపంలో క‌నిపిస్తున్నాడు. మ‌రో విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌లో ఆయ‌న క‌నిపించ‌నున్న‌ట్లు తెలుస్తుంది. మిర్నా మీన‌న్ ఇందులో హీరోయిన్‌గా న‌టిస్తుంది. షైన్ స్క్రీన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.

Exit mobile version