మీకు నచ్చిన మూవీని ఐదు పదాల్లో వివరించమని అడిగిన అమెజాన్ ప్రైమ్..వైరల్ అవుతున్న ఫన్నీ రిప్లైస్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మీకు నచ్చిన మూవీని ఐదు పదాల్లో వివరించమని అడిగిన అమెజాన్ ప్రైమ్..వైరల్ అవుతున్న ఫన్నీ రిప్లైస్

    మీకు నచ్చిన మూవీని ఐదు పదాల్లో వివరించమని అడిగిన అమెజాన్ ప్రైమ్..వైరల్ అవుతున్న ఫన్నీ రిప్లైస్

    February 25, 2022

    కరోనా మహమ్మారితో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. వినోదాన్ని పంచే థియేటర్లు కూడ మూతపడటంతో ఓటీటీలకు బాగా ఆదరణ పెరిగింది. రియాల్టీ షోలు, సీరియళ్లు, సినిమాలు, ఆటలు, పాటలు, వెబ్ సిరీస్‌లు ఇలా అన్నిటినీ అందించే ఓటీటీలకు వినోద ప్రియులు బాగా కనెక్ట్ అయ్యారు. ఎప్పుడు ఏ సినిమా స్ట్రీమింగ్ అయిన వెంటనే వీక్షించి ఎంజాయ్ చేస్తున్నారు. అందుకే ఇలాంటి వారిని మరింతగా తనవైపు తిప్పుకోవడానికి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం అయిన అమెజాన్ ప్రైమ్ ఓ కొత్త పంథాను ఎంచుకుంది. ఇంతకి ఆ ఐడియా ఏంటో చూడండి.

    అమెజాన్ ఐడియా ఇదీ..!

    వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా ఎప్పుడూ ఓ సరికొత్త మార్కెటింగ్ స్ట్రాటజీతో ఆమెజాన్ ప్రైమ్ ముందుకొస్తుంటుంది. ఇప్పుడు కూడ అలాంటి ప్లాన్‌తోనే భారతీయులకు సినిమాలపై ఉన్న ప్రేమను చాటుకునేలా ఓ ఆసక్తికర ట్వీట్ చేసింది. బాలీవుడ్, టాలీవుడ్, హాలీవుడ్, కోలీవుడ్ ఇలా ఏ పరిశ్రమలోనైన మీకు బాగా నచ్చిన సినిమా గురించి ఐదు పదాల్లో ఆసక్తికరంగా వివరించాలని ట్విట్టర్‌లో ఓ పోస్టు చేసింది.

     ఫిబ్రవరి 22న చేసిన ఈ పోస్టు వినోద ప్రియులకు బాగా కనెక్ట్ కావడంతో ట్విట్టర్‌లో వైరల్‌గా మారింది. ఈ పోస్టుకు దాదాపు 3500 లైకులురాగా, 700సార్లు రీట్వీట్ చేశారు. దీంతో సినీ అభిమానులు అమెజాన్ అడిగిన ప్రశ్నకు ట్విట్టర్ వేదికగా ఆసక్తికర రిఫ్లైలు ఇచ్చారు. టైటానిక్, మార్వెల్ లాంటి హాలీవుడ్ మూవీలను కూడ ఆసక్తికరంగా ఐదు పదాల్లో వివరించారు. ఇంతకీ వారి రిప్లైలు ఎలా ఉన్నాయో మీరూ చూసేయండి.

    ఎంఎస్ ధోని: ది అన్ టోల్డ్ స్టోరీ

    ఎంఎస్ ధోని జీవిత చరిత్ర ఆధారంగా సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా గురించి గౌతమ్ చక్రవర్తి అనే వ్యక్తి ఐదు పదాల్లో ఆసక్తికరంగా వివరించాడు.

    ‘టికెట్ కలెక్టర్ టూ వరల్డ్‌కప్ విన్నర్’ అంటూ అమెజాన్‌కి రిప్లై ఇచ్చాడు.

    పుష్ప పార్ట్-1

    ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించి భారీ హిట్ సాధించిన పుష్ప మూవీని ఐదు పదాల్లో ఈశ్వరా అనే యూజర్ ఫన్నీగా తెలిపాడు.

    ‘ఐ స్మగిల్ శాండిల్‌వుడ్ అండ్ పార్టీ’ అంటూ రీట్వీట్ చేశాడు

    రంగస్థలం

    రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ మూవీ రంగస్థలంపై ఓ ఫన్నీ రిఫ్లై వచ్చింది. ‘చిట్టి బాబు విల్ మేనేజ్ ఎవ్రీథింగ్’ అంటూ ఫన్నీ ట్వీట్ చేశారు.

    టైటానిక్ 

    హాలీవుడ్ మూవీ అంటే అందరికీ గుర్తొచ్చే మూవీ టైటానిక్. అలాంటి మూవీని కేవలం ఈ ఐదు పదాలతో ఈజీగా ఎలా చెప్పాలో ఈ రిప్లై చూస్తే మీకే తెలుస్తుంది.

    అవెంజర్స్: ఎండ్ గేమ్

    అవెంజర్స్ ఎండ్ గేమ్ అండ్ విలన్ పాత్ర పోషించిన థానోస్ గురించి ప్రస్తావిస్తూ ఓ ఫన్నీ ట్వీట్ చేశారు.
    వకీల్ సాబ్

    పవన్ కల్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్‌పై ఇంట్రెస్టింగ్ ట్వీట్ ఇది..

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version