Amazon Big Billion Days: టాప్‌ బ్రాండ్ స్మార్ట్‌ఫోన్లపై ప్రకటించిన భారీ డిస్కౌంట్లు ఇవే!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Amazon Big Billion Days: టాప్‌ బ్రాండ్ స్మార్ట్‌ఫోన్లపై ప్రకటించిన భారీ డిస్కౌంట్లు ఇవే!

    Amazon Big Billion Days: టాప్‌ బ్రాండ్ స్మార్ట్‌ఫోన్లపై ప్రకటించిన భారీ డిస్కౌంట్లు ఇవే!

    October 3, 2023

    దసరా పండగ నేపథ్యంలో ఈ కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు సూపర్ సేల్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. ‘బిగ్ బిలియన్ డేస్ సేల్‌’ను ఫ్లిప్‌కార్ట్ ప్రకటించగా, ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌’తో రాబోతున్నట్లు అమెజాన్ వెల్లడించింది. ఈ రెండు సేల్స్ అక్టోబర్ 8 నుంచే ఆరంభం కానున్నాయి. అయితే స్మార్ట్‌ఫోన్లపై అమెజాన్‌ ఇవ్వబోయే డిస్కౌంట్లకు సంబంధించిన సమాచారం రివీల్‌ అయ్యింది. ప్రముఖ బ్రాండ్లకు సంబంధించిన మెుబైల్స్‌ అతి తక్కువ ధరకే అందుబాటులోకి రాబోతున్నాయి. మరి ఆ ఫోన్లు ఏవి? అవి ఎంత తక్కువకు రాబోతున్నాయి? వంటి అంశాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

    iPhone 13

    అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో ఐఫోన్ 13 (iPhone 13) రూ. 40,000 కంటే తక్కువ ధరకే అందుబాటులో ఉండనుంది. గత నెలలో ఐఫోన్ 15 లాంచ్ తర్వాత యాపిల్ కంపెనీ అధికారికంగా ఐఫోన్ 13 ధరను రూ. 59,900కి తగ్గించింది. ఐఫోన్ 13ని రూ. 40 వేల కంటే తక్కువకు పొందాలంటే SBI బ్యాంక్ కార్డ్‌ని ఉపయోగించాలి. అలాగే మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్‌ చేసి రూ. 39,999 కంటే తక్కువ ధరకు ఐఫోన్ 13 పొందవచ్చు.

    HONOR 90 5G

    అమెజాన్‌ సేల్‌లో హనర్‌ 90 జీ (HONOR 90 5G) స్మార్ట్‌ఫోన్‌ కూడా భారీ డిస్కౌంట్‌తో అందుబాటులోకి రానుంది. ఈ మెుబైల్‌ ధర రూ.39,999 కాగా, అన్ని రాయితీలు పోనూ ఈ మెుబైల్‌ రూ.29,999కే (షరతులు వర్తిస్తాయి) లభించనుంది. దీనిపై 9 నెలల No Cost EMI సౌకర్యం కూడా ఉంది. 

    iQOO Z7 Pro 5G

    అమెజాన్‌లో సేల్‌లో ఈ స్మార్ట్‌ ఫోన్‌ కూడా తక్కువ ధరకే అందుబాటులోకి రానుంది. iQOO Z7 Pro 5G మెుబైల్‌ ధర రూ. 24,999. బ్యాంక్‌ డిస్కౌంటుతో పాటు కూపన్‌ ఆఫర్లు కలుపుకుని ఈ ఫోన్‌ రూ.21,499లకు లభించనుంది. iQOO Z7 Pro.. 120 Hz AMOLED FHD+ స్క్రీన్‌ కలిగి ఉంది. 64MP ప్రైమరీ కెమెరా, 4600mAh బ్యాటరీతో ఇది రానుంది. 

     Lava Agni 2 5G

    దేశీయ కంపెనీకి చెందిన ‘Lava Agni 2 5G’ స్మార్ట్‌ఫోన్‌ కూడా అమెజాన్‌ సేల్‌లో తక్కువ ధరకే రానుంది. రూ.21,499 ధర ఉన్న ఈ ఫోన్‌ను అమెజాన్‌ రూ.17999కే అందించనుంది.అక్టోబర్‌ 4 నుంచి ఈ ఫోన్‌ ప్రీ బుకింగ్స్‌ ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం రూ.99 చెల్లించాలి.  

    Motorola Razr 40 Ultra 5G

    మోటోరోలా కంపెనీకి చెందిన Motorola Razr 40 Ultra 5G అమెజాన్‌ సేల్‌లో ఆకర్షణీయమైన ధరతో రానుంది. ఈ ఫోన్‌ ప్రస్తుత ధర రూ.89,999. బ్యాంక్‌ ఆఫర్లు పోనూ ఈ ఫోన్ రూ.72999 లభించనుంది. ఈ ఫ్లిప్‌ మెుబైల్‌ 3.6 pOLED external డిస్‌ప్లేను కలిగి ఉంది. Snapdragon 8+Gen 1 processorతో ఇది వర్క్‌ చేస్తుంది. 

    Redmi 12 5G, Redmi 12C

    అమెజాన్‌ సేల్‌లో రెడ్‌మీ మెుబైల్స్ కూడా మంచి రాయితీతో రాబోతున్నాయి. Redmi 12 5G రూ.10800, Redmi 12C రూ.7,299 ధరకే లభించనున్నాయి. ప్రస్తుతం ఈ మెుబైల్స్‌ ధరలు వరుసగా రూ.11,999, రూ. 8,299గా ఉన్నాయి. 

    Realme Narzo N53

    ఈ మెుబైల్‌ను సైతం అమెజాన్‌ సేల్‌లో తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. అన్నీ డిస్కౌంట్లు పోనూ ఈ స్మార్ట్‌ఫోన్‌ రూ.7,999కే పొందవచ్చు. ప్రస్తుతం ఈ ఫోన్‌ ధర రూ.10,999 ఉండటం గమనార్హం. Realme Narzo N53 మెుబైల్ 5,000mAh బ్యాటరీ,  33W Super VOOC ఫాస్ట్‌ ఛార్జింగ్‌ ఫీచర్లను కలిగి ఉంది. 

    Samsung Galaxy M34 5G

    శాంసంగ్‌ మెుబైల్స్‌ సైతం అమెజాన్ బిగ్‌ బిలియన్‌ సేల్‌లో తక్కువ ధరకే లభించనున్నాయి. ముఖ్యంగా Samsung Galaxy M34 5G మెుబైల్‌ భారీ డిస్కౌంట్‌తో రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్‌ రూ.14,999 లభించనున్నట్లు తెలిసింది. ఈ ఫోన్‌ను ప్రస్తుతం రూ.16,499కు విక్రయిస్తున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version