మీరు ప్రీమియం ఫీచర్లతో కూడిన బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? అయితే, రెడ్‌మి నోట్ 13 ప్రో మీ కోసం మంచి ఛాయిస్. అద్భుతమైన డిస్‌ప్లే, శక్తివంతమైన కెమెరా, మెరుగైన ప్రాసెసర్ వంటి ఫీచర్లతో ఈ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. 200MP ప్రధాన కెమెరాతో కూడిన ఈ స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకంగా ఫోటోగ్రఫీ ప్రియులను ఆకర్షించడానికి రూపొందించబడింది. అంతే కాకుండా, అమెజాన్‌లో అందుబాటులో ఉన్న ప్రత్యేక ఆఫర్లతో మీరు ఈ హ్యాండ్‌సెట్‌ను మరింత తక్కువ ధరకు సొంతం చేసుకోవచ్చు. ఈ రెడ్‌మి నోట్ 13 ప్రో ఫీచర్లు, డిస్కౌంట్ ఆఫర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
రెడ్‌మి నోట్ 13 ప్రో స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్
డిస్‌ప్లే
- డిస్‌ప్లే: 6.67 అంగుళాల 1.5K అమోలెడ్ డిస్‌ప్లే.
- రిఫ్రెష్ రేట్: 120Hz రిఫ్రెష్ రేట్.
- రెజల్యూషన్: 2712 × 1220 పిక్సెల్స్, 1800 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్.
- రక్షణ: గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్, డాల్బీ విజన్ సపోర్ట్.
పవర్‌హౌస్ పనితీరు
- ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 2 చిప్‌సెట్.
- GPU: Adreno A710.
- ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 13 ఆధారిత MIUI 14.
కెమెరా వ్యవస్థ
- ట్రిపుల్ రియర్ కెమెరా: 200MP ప్రధాన కెమెరా (OIS, EIS), 8MP అల్ట్రా వైడ్, 2MP మ్యాక్రో లెన్స్.
- సెల్ఫీ కెమెరా: 16MP ఫ్రంట్ కెమెరా, వీడియో కాల్స్ మరియు సెల్ఫీల కోసం.
- వీడియో రికార్డింగ్: అధిక నాణ్యతతో వీడియోలు రికార్డ్ చేయగల సామర్థ్యం.
బ్యాటరీ- ఛార్జింగ్
- బ్యాటరీ: 5100mAh శక్తివంతమైన బ్యాటరీ.
- ఫాస్ట్ ఛార్జింగ్: 67W టర్బో ఛార్జింగ్ సపోర్ట్.
- ఇన్‌క్లూడ్ చేసిన అక్సెసరీలు: 67W అడాప్టర్ మరియు USB-C కేబుల్.
కనెక్టివిటీ ఫీచర్లు
- కనెక్టివిటీ: బ్లూటూత్ 5.2, వైఫై, GPS, IR, Glonass సపోర్ట్.
- భద్రతా ఫీచర్: ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్.
- రేటింగ్: IP54 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెన్స్.
డిజైన్ – రంగులు
- డిజైన్: మోడర్న్ మరియు ప్రీమియం లుక్స్‌తో ఆకట్టుకునే డిజైన్.
- రంగులు: కోరల్ పర్పుల్, మిడ్ నైట్ బ్లాక్, స్కార్‌లెట్ రెడ్
ధర – ఆఫర్లు
- అసలు ధర: రూ.28,999
- ఆఫర్ ధర: అమెజాన్‌లో రెడ్‌మి నోట్ 13 ప్రో (8GB + 128GB) వేరియంట్‌ను రూ.19,889కే కొనుగోలు చేయవచ్చు.
- డిస్కౌంట్: ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు ద్వారా అదనంగా మరో రూ. 895 డిస్కౌంట్ పొందవచ్చు.
- ఇతర వేరియంట్లు: 12GB ర్యామ్ + 256GB వేరియంట్ రూ.25,989;
ఎందుకు కొనాలి?
Redmi Note 13 Pro స్మార్ట్ ఫొన్ రెడ్‌మీ ప్లాగ్ షిప్ ఎడిషన్స్‌లో సక్సెస్‌ఫుల్ మొబైల్‌గా చెప్పవచ్చు. ఈ ఫొన్‌పై వినియోగదారుల నుంచి మంచి రివ్యూ రేటింగ్స్ ఉన్నాయి.తక్కువ ధర, శక్తివంతమైన 200MP కెమెరా, అధిక రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే, శక్తివంతమైన ప్రాసెసర్ కారణంగా ఈ స్మార్ట్ ఫొన్ రెండో ఆలోచన లేకుండా కొనుగోలు చేయవచ్చు.
Celebrities Featured Articles Movie News Telugu Movies
Allu Arjun: థ్యాంక్యూ పవన్ కళ్యాణ్ మామయ్య.. వివదానికి పుల్ స్టాప్ పెట్టిన బన్నీ