Amazon DishWashers: వంట పాత్రలు తోమలేక విసిగిపోయారా? అయితే ఈ డిష్‌వాషర్స్‌ ట్రై చేయండి!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Amazon DishWashers: వంట పాత్రలు తోమలేక విసిగిపోయారా? అయితే ఈ డిష్‌వాషర్స్‌ ట్రై చేయండి!

    Amazon DishWashers: వంట పాత్రలు తోమలేక విసిగిపోయారా? అయితే ఈ డిష్‌వాషర్స్‌ ట్రై చేయండి!

    October 10, 2023

    ప్రతీ ఇంట్లో వంట పాత్రలను కడగడం సాధారణంగా జరిగే విషయమే. అయితే ఈ ప్రక్రియ ఎంతో కష్టంతో కూడుకున్నది. ముఖ్యంగా మహిళలకు ఇది తలకు మించిన భారంలా అనిపిస్తుంటుంది. ఇద్దరు లేదా ముగ్గురు ఉన్న ఇంట్లో వంట పాత్రలు కడగడం కాస్త తేలికే అయినా, పెద్ద కుటుంబాల్లో మాత్రం ఇది తలకు మించిన భారంగా మారుతుంది. ఈ సమస్య నుంచి బయటపడేందుకు అమెజాన్‌లో టాప్‌ డిష్‌వాషర్స్‌ (DishWashers) అందుబాటులో ఉన్నాయి. గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ (Great Indian Festival) సేల్‌ సందర్భంగా వీటిపై అమెజాన్‌ భారీ డిస్కౌంట్‌ను ప్రకటించింది. ఈ నేపథ్యంలో వాటిపై ఓ లుక్కేద్దాం.  

    Fabre 8

    ఫేబర్‌ కంపెనీకి చెందిన ఈ డిష్‌వాషర్‌ 8 ప్లేట్‌ సెట్టింగ్స్‌ను కలిగి ఉంది. ఇండియన్‌ కిచెన్‌లోని అన్ని రకాల వంట పాత్రలను ఇది శుభ్రం చేయగలదు. క్షణాల్లో జిడ్డును తొలగించగలదు. స్టీల్‌ గిన్నెలతో పాటు గాజు, పింగాణి వంట పాత్రలను కూడా ఇది కడిగిస్తుంది. అమెజాన్‌లో ఇది రూ.4,490 అందుబాటులో ఉంది. 

    Whirlpool 14

    Whirlpool కంపెనీకి చెందిన ఈ డిష్‌వాషర్‌ ఏకంగా 14 ప్లేట్‌ సిట్టింగ్స్‌ కలిగి ఉంది. 8 వాష్‌ ప్రోగ్రామ్స్‌ ఇందులో ఉన్నాయి. 2 సంవత్సరాల వారంటీ కలిగిన ఈ డిష్‌వాషర్‌ ఆరుగురు సభ్యులున్న కుటుంబానికి సరిగ్గా సరిపోతుంది. దీని అసలు ధర రూ. 42,000. కానీ అమెజాన్‌ దీనిని 35% డిస్కౌంట్‌తో రూ.27,490 అందిస్తోంది.

    Whirlpool PowerClean

    Whirlpool నుంచి మరో పవర్‌క్లీన్‌ డిష్‌వాషర్‌ అమెజాన్‌లో అందుబాటులో ఉంది. ఇది కూడా 14 ప్లేట్‌ సిట్టింగ్స్‌ను కలిగింది. ఇందులో 11 వాష్‌ ప్రోగ్రామ్స్‌ ఉన్నాయి. కంపెనీ 2 సంవత్సరాల వారంటీని కూడా అందిస్తోంది. ఇది పాత్రలను కడగటంతో పాటు డ్రై కూడా చేస్తుంది. అమెజాన్‌లో ఇది రూ.31,990కు లభిస్తోంది. 

    Fabre 14

    ఫేబర్‌ కంపెనీ నుంచి మరో టాప్‌ రేటెడ్‌ డిష్‌వాషర్‌ మార్కెట్‌లో ఉంది. Faber 14 డిష్‌వాషర్‌ పద్నాలుగు ప్లేట్‌ సిట్టింగ్స్‌ను కలిగి ఉంది. ఇందులో 8 వాష్‌ ప్రోగ్రామ్స్‌, తక్కువ నాయిస్‌ సామర్థ్యం, ఫోల్డబుల్‌ ర్యాక్స్‌, డ్రైయింగ్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. దీని అసలు ధర రూ.56,500. కానీ అమెజాన్‌ దీనిపై 17% డిస్కౌంట్‌ ఇస్తోంది. ఫలితంగా ఈ వాష్‌డిషర్‌ను రూ.46,830 పొందవచ్చు.

    Bosch 13 Dishwasher

    ఈ డిష్‌వాషర్‌ 13 ప్లేట్‌ సెట్టింగ్స్‌తో రానుంది. అన్ని రకాల వంట పాత్రలను శుభ్రం చేస్తుంది.  ఇందులో 6 వాష్ ప్రోగ్రామ్స్‌, 3 ఆప్షన్స్‌ ఉన్నాయి. ఇది వన్ టైమ్ క్లీనింగ్‌ కోసం 10 లీటర్ల నీటిని వినియోగిస్తుంది. ఈ డిష్‌వాషర్ వంట పాత్రలను కడిగేటప్పుడు పెద్దగా శబ్దం చేయదు. దీని అసలు ధర రూ.56,900. కానీ అమెజాన్‌ దీనిని రూ.41,990 అందిస్తోంది. 

    LG 14 Place Settings  

    ఈ LG 14 వాష్‌డిషర్‌లో మీకు 14 ప్లేట్ సెట్టింగ్స్‌ ఉన్నాయి. ఇవి పాత్రలలోని మట్టి, మరకలు, జిడ్డును శుభ్రపరుస్తుంది. ఈ డిష్ వాషర్ సగం లోడ్‌లో కూడా సమర్థవంతంగా పనిచేస్తుంది. దీని అసలు ధర రూ.74,999. అమెజాన్‌ గ్రేట్‌ ఫెస్టివల్‌ సేల్స్‌ సందర్భంగా దీనిపై 33% రాయితీ లభిస్తోంది. ఫలితంగా ఈ డిష్‌వాషర్‌ రూ.50,494 పొందవచ్చు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version