Ambati Rayudu: ఐపీఎల్‌లో రాయుడి విధ్వంసం.. టాప్‌-5 బెస్ట్ ఇన్నింగ్స్ ఇవే!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Ambati Rayudu: ఐపీఎల్‌లో రాయుడి విధ్వంసం.. టాప్‌-5 బెస్ట్ ఇన్నింగ్స్ ఇవే!

    Ambati Rayudu: ఐపీఎల్‌లో రాయుడి విధ్వంసం.. టాప్‌-5 బెస్ట్ ఇన్నింగ్స్ ఇవే!

    May 29, 2023

    తెలుగు తేజం, చెన్నై సూపర్‌ కింగ్స్‌ స్టార్‌ బ్యాటర్‌ అంబటి రాయుడు ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. నేడు గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగే ఐపీఎల్‌ ఫైనల్‌ మ్యాచే అతడి కెరీర్‌లో చివరిది.  2010లో ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన రాయుడు.. ముంబయి ఇండియన్స్‌, చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఇప్పటివరకు 203 మ్యాచ్‌లు ఆడిన రాయుడు 28.29 సగటుతో 4,329 పరుగులు సాధించాడు. ఐపీఎల్‌లో 4 వేల పరుగుల మార్క్‌ను అందుకున్న టాప్‌-10 ఇండియన్‌ బ్యాటర్లలో ఒకడిగా నిలిచాడు. 

    2010-2017 మధ్య ముంబయి ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహించిన రాయుడు.. 2018లో సీఎస్కే ఛాంపియన్‌గా నిలవడంలో కీలకపాత్ర పోషించాడు. ఐపీఎల్‌లో ఇప్పటివరకు ఐదు టైటిల్స్‌ గెలిచిన ఈ తెలుగు ఆటగాడు నేటి మ్యాచ్‌లో చెన్నై గెలిస్తే ఆరో టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుంటాడు. రాయుడు రిటైర్మెంట్‌ నేపథ్యంలో ఐపీఎల్‌లో అతడు ఆడిన టాప్‌-5 బెస్ట్‌ ఇన్నింగ్స్‌ ఇప్పుడు చూద్దాం. 

    1. MI vs RCB (2012)

    2012లో ఐపీఎల్‌ సీజన్‌లో ముంబయి తరపున అంబటి రాయుడు సూపర్ ఫామ్‌ కనబరిచాడు. ముఖ్యంగా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో చెలరేగి ఆడాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన RCB 171 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన ముంబయి తడబడింది. వెంటవెంటనే వికెట్లను కోల్పోయింది. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన రాయుడు చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడాాడు. 54 బంతుల్లోనే 81 పరుగులు చేశాడు. ఓడిపోయే దశ నుంచి ముంబయిని ఒంటిచేత్తో విజయతీరాలకు చేర్చాడు. ఈ మ్యాచ్‌లో MI రెండు బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. 

    2. MI vs KXIP (2016)

    2016లో జరిగిన ముంబయి వర్సెస్‌ పంజాబ్‌ మ్యాచ్‌లోనూ రాయుడు విశ్వరూపం చూపించాడు. మెుహాలీలో జరిగిన ఆ మ్యాచ్‌లోనూ MI త్వరగానే ఓపెనర్‌ను కోల్పోయింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన రాయుడు మరో ఓపెనర్‌ పార్ధివ్‌ పటేల్‌తో కలిసి మంచి భాగస్వామ్యం నెలకొల్పాడు. ఆరంభంలో కొన్ని బంతులను ఆచితూచి ఆడిన రాయుడు.. తర్వాత తనదైన శైలిలో రెచ్చిపోయాడు. క్వాలిటీ క్రికెటింగ్‌ స్ట్రోక్స్‌తో పరుగుల వరద పారించాడు. ఫోర్లు, సిక్సర్లతో ప్రత్యర్థి బౌలర్లను ఉతికారేశాడు. ఈ క్రమంలో 37 బంతుల్లోనే రాయుడు 65 పరుగులు సాధించాడు. రాయుడు వీరవిహారంతో ముంబయి 189 పరుగుల భారీస్కోరు చేసింది. 

    3. MI vs KKR (2017)

    2017 సీజన్‌లోనూ రాయుడు ఓ చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ సీజన్‌లో రాయుడు బ్యాటు నుంచి పెద్దగా పరుగులేమి రాలేదు. దీంతో తీవ్ర ఒత్తిడికి లోనైన రాయుడు కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుత ఇన్నింగ్స్‌ ఆడాడు. ముంబయి పూర్తిగా స్ట్రగుల్‌లో ఉన్న సమయంలో బ్యాటింగ్‌కు దిగిన రాయుడు తాను ఎంత విలువైన ఆటగాడో మరోమారు నిరూపించుకున్నాడు. 46 బంతుల్లోనే 68 రన్స్‌ చేసి జట్టుకు బిగ్‌ టోటల్‌ను అందించాడు. 

    4. CSK vs SRH (2018)

    2018 సీజన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరపున బరిలోకి దిగిన రాయుడు సూపర్‌ ఫామ్‌తో అదరగొట్డాడు. ముఖ్యంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో తన తొలి ఐపీఎల్‌ సెంచరీ చేసి ప్రశంసలు అందుకున్నాడు. కేవలం 52 బంతుల్లోనే రాయుడు సెంచరీ మార్క్ అందుకోవడం విశేషం. అంతేగాక ఆ మ్యాచ్‌లో షేన్‌ వాట్సన్‌తో కలిసి 134 పరుగులు భారీ భాగస్వామ్యం నెలకొల్పాడు. ఆ సీజన్‌లో చెన్నై తరపున 600 పైగా రన్స్‌ సాధించిన రాయుడు.. ఆ జట్టు టైటిల్‌ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. 

    5. CSK vs MI (2021)

    మాజీ జట్టు ముంబయి ఇండియన్స్‌ పైనా రాయుడు కనికరం చూపలేదు. 2021లో ముంబయి వర్సెస్‌ చెన్నై మ్యాచ్‌లో రాయుడు ఉప్పెనలా విరుచుకుపడ్డాడు. ముంబయి బౌలర్లపై ఆదిపత్యం చెలాయిస్తూ 27 బంతుల్లోనే 72 పరుగులు చేశాడు. ఇందులో 7 సిక్స్‌లు, 4 ఫోర్లు ఉన్నాయి. రాయుడు విధ్వంసానికి జడేజా మెరుపులు తోడవడంతో ఆ రోజు చెన్నై భారీ స్కోరు చేసింది. తమ హోమ్‌గ్రౌండ్‌లో ముంబయిని మట్టికరిపించింది. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version