నోకియా మరో కొత్త స్మార్ట్‌ ఫోన్‌ NokiaC99
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • నోకియా మరో కొత్త స్మార్ట్‌ ఫోన్‌ NokiaC99

  నోకియా మరో కొత్త స్మార్ట్‌ ఫోన్‌ NokiaC99

  March 20, 2023

  © Nokia

  ఒకప్పుడు మార్కెట్‌ను ఏలి ఇప్పుడు డీలా పడిన నోకియా మరో స్మార్ట్‌ఫోన్‌ ఆవిష్కరించింది. నోకియా C99 పేరిట మార్కెట్‌లోకి కొత్త ఫోన్ రాబోతోంది. బార్సిలోనాలో జరిగిన MWC 2023 ‘నోకియా సీ99’ అడుగుపెట్టింది. దీని ధర సుమారు 480 డాలర్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అంటే దాదాపు రూ. 36,000 కంటే ఎక్కువే. ఈ స్మార్ట్‌ఫోన్ 6.7” డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్, 144 మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 180W ఫాస్ట్ ఛార్జింగ్‌తో వస్తుంది.

  @manjarkhanworld

  2023 మూడో క్వార్టర్‌ కల్లా ఫోన్‌ భారత్‌లో అందుబాటులోకి వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇందులో ఇస్తున్న ఫీచర్స్ ప్రకారం ధర చూసుకుంటే చాలా తక్కువని నిపుణులు వెల్లడించారు. శామ్‌సంగ్‌ గెలాక్సీ S23, షావోమి 13 pro  వంటి ఫోన్లతో పోటీ పడుతుందని తెలిపారు. 

  ఇందులో ట్రిపుల్‌ కెమెరా ఉండనుంది. ఇందులో 144 మెగా పిక్సెల్‌, 64 మెగా పిక్సెల్‌ అల్ట్రా ఎడ్జ్‌ వైడ్ యాంగిల్ కెమెరా, 48 మెగాపిక్సెల్‌ టెలిఫొటో కెమెరా సౌకర్యం కల్పించనున్నారు. గొరిల్లా గ్లాస్‌ ప్రొటెక్షన్‌తో డిస్‌ప్లే అందించనున్నారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
  Exit mobile version