Anti Ageing Creams: ముసలి తనాన్ని దూరం చేసే ఫేస్ క్రీమ్స్… ఇవి పెట్టుకుంటే నిత్య యవ్వనమే..! 
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Anti Ageing Creams: ముసలి తనాన్ని దూరం చేసే ఫేస్ క్రీమ్స్… ఇవి పెట్టుకుంటే నిత్య యవ్వనమే..! 

    Anti Ageing Creams: ముసలి తనాన్ని దూరం చేసే ఫేస్ క్రీమ్స్… ఇవి పెట్టుకుంటే నిత్య యవ్వనమే..! 

    August 8, 2023

    ఈ రోజుల్లో చర్మ సంరక్షణపై ఫోకస్ పెట్టని వారు లేరు. బ్యూటీ, స్కిన్ కేర్ ప్రొడక్టులను వాడుతూ చర్మాన్ని హెల్దీగా కాపాడుకుంటున్నారు. అయితే, మెరిసే యవ్వనమైన చర్మం కోసం డెర్మటాలజిస్టులు తరచూ ‘రెటినోల్’ ఉత్పత్తులను సిఫార్సు చేస్తుండటం మనం గమనిస్తుంటాం. క్రీమ్, జెల్, డ్రాప్, ఆయిల్ రూపాల్లో లభ్యమయ్యే రెటినోల్ ఉత్పత్తులకు డిమాండ్ ఎక్కువే. మరి, ఆ ప్రొడక్టులు, వాటి ధర, తదితర ఉపయోగాలు తెలుసుకునే ముందు రెటినోల్ అంటే ఏంటి? దాని ప్రయోజనాలు? తీసుకోవాల్సిన జాగ్రత్తలు పరిశీలిద్దాం.

    రెటినోల్ అంటే?

    విటమిన్ A నుంచి ఉత్పన్నమయ్యేదే రెటినోల్. తొలిసారిగా 1931లో అట్లాంటిక్ సర్రా చేపల లివర్ ఆయిల్ నుంచి దీనిని వేరు చేశారు. ఇది యాంటీ ఆక్సిడెంట్‌గా ఉపయోగ పడి గాయాలను మాన్చుతుంది. చర్మ సంరక్షణలో విటమిన్ Aని విస్తృతంగా వాడొచ్చని అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రధానంగా, యాంటీ ఏజింగ్(Anti Ageing)గా ఇది ఉపయోగ పడుతుందని తెలిపింది. మృత కణాలను తొలగించి తాజా కణాలను ఏర్పరచడంలో కొల్లాజెన్‌ది కీలక పాత్ర. ఈ కొల్లాజెన్ ఉత్పత్తిని ‘రెటినోల్’ ప్రోత్సహిస్తుంది. ఫలితంగా ముఖంపై వృద్ధాప్య ఛాయలు పోయి తాజా కణాలు జనిస్తాయి. దీంతో ముఖం యవ్వనంగా కనిపిస్తుంది. ఇది మొటిమలను తొలగించడమే కాక ముడతలను దూరం చేస్తుంది. చారలను రూపుమాపుతుంది. 

    జాగ్రత్తలు..

    చర్మ సంబంధిత రుగ్మతలను నయం చేసే చికిత్సా పద్ధతుల్లో రెటినోల్ డెరివేటివ్‌ని ఉపయోగిస్తారు. అందుకే, దీనిని చాలా కాస్మొటిక్ ప్రొడక్టుల్లో ఉపయోగిస్తున్నారు. అయితే, దీనిని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. బిగినర్స్ వారంలో 2 లేదా 3 సార్లు అప్లై చేసుకుంటే చాలు. అదే పనిగా పెట్టుకుంటే డీహైడ్రేషన్ బారిన పడే అవకాశం ఉంది. పగటి పూట కన్నా రాత్రి పూట దీనిని మాయిశ్చరైజర్‌తో కలిపి అప్లై చేసుకోవాలి. రెటినోల్ అందరికీ పడకపోవచ్చు. చర్మ గుణాన్ని బట్టి, వైద్యుల సూచన మేరకు దీనిని వాడాల్సి ఉంటుంది. మరి ఆ ప్రొడక్టులేంటో చూసేద్దాం.

    Pilgrim Retinol anti-ageing night cream

    ముఖాన్ని యవ్వనంగా ఉంచేందుకు ఉపయోగ పడే బెస్ట్ క్రీమ్ ఇది. ముఖంపై ముడతలు, గీతలు, డార్క్ స్పాట్స్‌ని ఈ క్రీమ్ తొలగిస్తుంది. వివిధ చర్మ రకాలకు ఇది అప్లై చేసుకోవచ్చు. రాత్రి పూట పెట్టుకుంటే ముఖంపై మొటిమలు, మచ్చలను తొలగించేందుకు ఈ క్రీమ్ సహాయ పడుతుంది. మృత కణాలను తొలగించి సెల్ రీజనరేషన్‌కి తోడ్పడుతుంది. మాయిశ్చరైజర్‌తో పాటు కలిపి దీనిని ముఖానికి పెట్టుకోవాలి. పగటి పూట పెట్టుకోకపోవడం మంచిది. దీని ధర రూ.551.

    BUY NOW

    Minimalist 2% Retinoid Anti Ageing Night Cream

    రెటినోల్ క్రీమ్‌లతో చికాకు కలుగుతుందని భావిస్తారు. కానీ, ఈ క్రీమ్‌ సౌకర్యవంతంగా ఉంటుంది. ఇతర రెటినోల్ ఫేస్ క్రీమ్‌లతో పోలిస్తే మరిన్ని ప్రయోజనాలు చేకూరుస్తుంది. యువీ కిరణాల నుంచి చర్మాన్ని రక్షించి వృద్ధాప్య ఛాయలను నియంత్రిస్తుంది. ముడతలు, ఫైన్ లైన్లను దూరం చేస్తుంది. ఇందులో నియాసినమైడ్ కూడా ఉండటంతో చర్మం మరింత మృదువుగా ఉంటుంది. రాత్రి సమయంలోనే దీనిని మాయిశ్చరైజర్‌తో కలిపి ఉపయోగించాలి. ధర. రూ.664.

    BUY NOW

    Mamaearth Retinol Night Cream

    మహిళల కోసం ప్రత్యేకంగా ఈ రెటినోల్ క్రీమ్‌ అందుబాటులో ఉంది. ముడతలు, ఫైన్‌లైన్స్‌తో పోరాడి నిత్య యవ్వనంగా ఉంచడానికి ఇది సహాయ పడుతుంది. ఇందులో రెటినోల్‌తో పాటు బకుచి కూడా ఉంటుంది. మృత కణాలను తొలగించి తాజా కణాల ఉత్పత్తికి తోడ్పడే కొల్లాజెన్‌ని ఇది ప్రేరేపిస్తుంది. ఫలితంగా ముఖంపై తాజాదనం ఏర్పడుతుంది. ధర. రూ.593.

    BUY NOW

    Garnier Skin Naturals Anti-Ageing Cream

    కొల్లాజెన్ స్థాయులను మెరుగు పరిచి సెల్ డీజనరేషన్‌కి ఇది తోడ్పడుతుంది. ముఖంపై ముడతలు, చారలు ఏర్పడకుండా చూసుకుంటుంది. స్విస్ యాపిల్ సెల్ ఎక్స్‌ట్రాక్ట్, ప్రొ-రెటినోల్ ఇందులో ఇమిడి ఉన్నాయి. అన్ని రకాల చర్మాలకు ఇది పనిచేస్తుంది. వివిధ పరిమాణాల్లో లభ్యమవుతోంది. ధర రూ.250.

    BUY NOW

    Olay Regenerist Retinol 24 Cream

    99 శాతం శుద్ధ నియాసినమైడ్‌తో కలిపి ఈ క్రీమ్ తయారైంది. నల్లటి మచ్చలను, ముడతలను, చారలను తగ్గించడంలో ఈ క్రీమ్ ఉపయోగపడుతుంది. రాత్రి పడుకునే ముందు దీనిని అప్లై చేసుకుంటే ఉదయం లేచే సరికి ముఖం కాంతివంతంగా, యవ్వనంగా మారుతుంది. మాయిశ్చరైజర్‌తో పాటు సీరం రూపంలోనూ ఇది అందుబాటులో ఉంది. ధర రూ.1099.

    BUY NOW

    WOW Skin Science Retinol Face Cream

    అన్ని రకాల చర్మ గుణాలకు ఇది పనిచేస్తుంది. ఆయిలీ స్కిన్‌ని తొలగిస్తుంది. దుమ్ము, ధూళి నుంచి రక్షించి చర్మాన్ని యవ్వనంగా ఉంచేందుకు సహాయ పడుతుంది. ఈ బ్రాండ్ నుంచి సీరం కూడా అందుబాటులో ఉంది. ధర రూ.347.

    BUY NOW

    Dot & Key Night Reset Retinol 

    మహిళలతో పాటు పురుషులు కూడా దీనిని ఉపయోగించొచ్చు. ఇందులోని గుణాలు చర్మంపై వృద్ధాప్య ఛాయలు ఏర్పడకుండా చూసుకుంటాయి. కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రేరేపించి చర్మాన్ని నిత్య యవ్వనంగా ఉంచేలా తాజా కణాలను ఉత్పత్తి చేస్తాయి. ధర రూ. 556.

    BUY NOW

    POND’S Age Miracle Day Cream

    24 గంటల పాటు చర్మాన్ని ప్రకాశవంతంగా ఉంచేందుకు ఈ క్రీమ్ సహాయ పడుతుంది. చర్మంపై మలినాలను తొలగించి రోజంతా చర్మాన్ని మెరిపిస్తుంది. రెటినోల్- సి, నియాసినమైడ్, విటమిన్-E ఇందులో ఉన్నాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో తోడ్పడతాయి. ధర రూ.639.

    BUY NOW

    The Derma Co 0.3% Retinol Serum

    మొటిమలను తగ్గించి చర్మాన్ని తాజాగా ఉంచే సీరం ఇది. యాయిశ్చరైజర్‌తో కలిపి దీనిని వాడాలి. సులువుగా చర్మంపై ఇంకుతుంది. కాబట్టి, ఆయిల్ కాంబినేషన్ స్కిన్ ఉన్న వ్యక్తులు ఈ సీరంని ఉపయోగించవచ్చు. దీని ధర రూ.686.

    BUY NOW

    E’clat Superior Anti-aging Retinol Serum

    ఇందులో 0.8శాతం రెటినోల్ ఉంటుంది. లోతైన ముడతలను తొలగించడంలో ఈ సీరం సహాయ పడుతుంది. విటమిన్ E, హైరలోనిక్ యాసిడ్ వంటి యాంటీ యాక్సిడెంట్లను ఇది కలిగి ఉంది. దీని ధర రూ.1,220

    BUY NOW

    (DISCLAIMER: The information contained in this article, including any product recommendations, tips, and opinions, is intended for general informational purposes only. It is not a substitute for professional medical advice, diagnosis, or treatment. Always seek the advice of your physician or other qualified health provider with any questions you may have regarding a medical condition or the appropriateness of any beauty product for your specific needs.

    Readers should perform their own research and consult with a qualified healthcare provider if they have concerns about using any products mentioned in this article. Any application or use of the products or methods described is at the reader’s own discretion and risk. In no event will the author, publisher, or affiliates be liable for any loss or damage, including without limitation, indirect or consequential loss or damage, arising from the use or misuse of the information contained herein)

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version