Apple MacBook Pro: సేల్స్‌లోకి వచ్చిన నయా యాపిల్‌ ల్యాప్‌టాప్స్‌.. బ్యాంక్ ఆఫర్స్ ఇవే!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Apple MacBook Pro: సేల్స్‌లోకి వచ్చిన నయా యాపిల్‌ ల్యాప్‌టాప్స్‌.. బ్యాంక్ ఆఫర్స్ ఇవే!

    Apple MacBook Pro: సేల్స్‌లోకి వచ్చిన నయా యాపిల్‌ ల్యాప్‌టాప్స్‌.. బ్యాంక్ ఆఫర్స్ ఇవే!

    November 7, 2023

    ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ (Apple).. స్కేరీ ఫాస్ట్ ఈవెంట్ (Apple Scary Fast Event) సందర్భంగా సరికొత్త M3 ప్రాసెసర్‌లతో కూడిన మ్యాక్‌బుక్ ప్రో (MacBook Pro) మోడల్‌లను ఆవిష్కరించింది. అక్టోబర్ 31న ఈ ల్యాప్‌టాప్స్‌ లాంచ్‌ అవ్వగా.. తాజాగా అవి భారత్‌లో సేల్స్‌లోకి వచ్చాయి. దీంతో ఈ నయా ఆపిల్‌ ప్రొడక్ట్స్‌ను కొనుగోలు చేసేందుకు టెక్‌ ప్రియులు ఆసక్తి కనబరుస్తున్నారు. అంతేకాకుండా వాటి ఫీచర్లు తెలుసుకునేందుకు నెట్టింట తెగ సెర్చ్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో YouSay ఈ ప్రత్యేక కథనాన్ని తీసుకొచ్చింది. మ్యాక్‌బుక్ ప్రో మోడల్స్‌ ప్రత్యేకత, ఫీచర్లు, ధర వంటి విశేషాలను మీ ముందుకు తెచ్చింది. వాటి ఓ లుక్కేయండి. 

    వేరియంట్స్‌

    ఈ మ్యాక్‌బుక్‌ ప్రో ల్యాప్‌టాప్స్‌ను యాపిల్‌ M3 చిప్‌ లైనప్‌తో మూడు వేరియంట్లుగా డివైడ్ చేసింది. M3, M3 Pro, M3 Max మోడల్‌ ల్యాప్‌టాప్స్‌గా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇవి ఈ ఏడాదిలో ఆపిల్ ఆవిష్కరించిన రెండో మ్యాక్‌బుక్ ప్రో ల్యాప్‌టాప్స్‌.

    M3 Pro Chip

    ఆపిల్‌ ఈ ఏడాది ప్రారంభంలో తీసుకొచ్చిన M1 ప్రో ప్రాసెసర్ కన్నా M3 ప్రో చిప్ 40 రెట్లు వేగవంతమైంది. ఇంటెల్ కోర్ i7 CPUతో పనిచేసే గత మ్యాక్‌బుక్ ప్రో మోడల్స్‌ కన్నా కొత్త ల్యాప్‌టాప్స్‌ 11 రెట్లు వేగవంతమైనవని కంపెనీ పేర్కొంది.

    డిస్‌ప్లే

    M3, M3 Pro, M3 Max మోడల్స్‌.. 14 అంగుళాలు, 16 అంగుళాల లిక్విడ్‌ రెటినా ఎక్స్‌డీఆర్‌ (Liquid Retina XDR) డిస్‌ప్లేతో వచ్చాయి. 3,024 x 1,964 pixels రిజల్యూషన్‌, 120Hz రిఫ్రెష్‌ రేట్‌, 1,600 nits పీక్ బ్రైట్‌నెస్‌ లెవెల్‌ను ల్యాప్‌టాప్ స్క్రీన్‌ కలిగి ఉంది. 

    బ్యాటరీ లైఫ్‌

    MacBook Pro M3 14 అంగుళాల మోడల్‌ 22 గంటల బ్యాటరీ లైఫ్‌ను కలిగి ఉంది. M3 Pro, M3 Max వేరియంట్లు 18 గంటల బ్యాటరీ లైఫ్‌ అందిస్తాయని యాపిల్ ప్రకటించింది. ఇక 16 అంగుళాల MacBook Pro M3 Max మోడల్‌ గరిష్ట బ్యాటరీ లైఫ్‌ కలిగి ఉన్నట్లు స్పష్టం చేసింది. 

    ర్యామ్‌ & స్టోరేజ్

    MacBook Pro M3 మోడల్‌ 18GB RAM + 512GB SSD, M3 ప్రో మోడల్‌ 36GB + 512GB SSD స్టోరేజ్‌ సామర్థ్యాలను కలిగి ఉంది. M3 Max chip మోడల్‌ 36GB RAM + 1TB SSD, 48GB RAM + 1TB SSD వేరియంట్లలో లాంచ్ అయ్యింది. 

    అదనపు ఫీచర్లు 

    MacBook Pro M3 మోడల్ ల్యాప్‌టాప్స్‌.. Wi-Fi 6E, Bluetooth 5.3, USB Type-C పోర్ట్స్‌, రెండు థండర్‌బోల్ట్‌ పోర్ట్స్‌,  Gigabit Ethernet కెనెక్టివిటీ, సిక్స్‌ స్పీకర్స్ యూనిట్‌, Dolby Atmos ఆడియో ఫీచర్లను కలిగి ఉంది. 

    ల్యాప్‌టాప్‌ కలర్స్

    MacBook Pro M3 మోడల్స్‌ కేవలం రెండు కలర్‌ వేరియంట్లలో మాత్రమే లభించనున్నాయి. సిల్వర్‌ (Silver), స్పేస్‌ గ్రే (Space Grey) కలర్ ఆప్షన్స్‌లో మీకు నచ్చిన దాన్ని ఎంపిక చేసుకోవచ్చు.

    ధర ఎంతంటే?

    MacBook Pro M3 బేస్‌ మోడల్‌ ధరను ఆపిల్‌ రూ.1,69,900గా నిర్ణయించింది. 16 అంగుళాల మ్యాక్‌బుక్‌ ప్రో M3 18GB + 512GB వేరియంట్‌ ధర రూ. 2,49,900, 36GB + 512GB మోడల్‌ ప్రైస్‌ రూ.2,89,900. M3 Max ల్యాప్‌టాప్‌ 36GB + 1TB వేరియంట్‌ ధర రూ.3,49,900 కాగా, 48GB + 1TB మోడల్‌ను రూ.3,99,900కు విక్రయిస్తున్నారు. యాపిల్‌ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు, యాపిల్‌ స్టోర్లలో ఇవి లభిస్తున్నాయి. ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లోనూ M3 మోడల్‌ ల్యాప్‌టాప్స్‌ సేల్స్‌ మెుదలయ్యాయి. SBI క్రెడిట్‌ కార్డు, క్రెడిట్‌ EMI కొనుగోలుపై రూ.1750 రాయితీ అందుబాటులో ఉంది. అటు అమెజాన్‌లో రేపటి నుంచి విక్రయాలు ప్రారంభం కానున్నాయి. అమెజాన్‌లో ICICI క్రెడిట్‌ కార్డ్‌ కొనుగోళ్లపై రూ.1,500 వరకూ డిస్కౌంట్‌ పొందవచ్చు. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version