ఎన్నో రోజులుగా మ్యాక్ బుక్ ప్రియులు ఎదురు చూస్తున్న యాపిల్ ఈవెంట్ రానే వచ్చింది. కాలీఫోర్నియాలో జరిగిన(Apple scary fast event) స్కేరీ ఫాస్ట్ ఈవెంట్‌లో యాపిల్ సరికొత్త మ్యాక్ బుక్ మోడల్స్‌ను విడుదల చేసింది. 14 అంగుళాలు, 16 అంగుళాల మ్యాక్ బుక్స్‌ను మార్కెట్‌లోకి లాంచ్ చేసింది. ఈ రెండు ప్రో మోడల్స్‌లో M3, M3 ప్రో, M3 మ్యాక్స్ చిప్ సెట్స్ ఉన్నట్లు ఉన్నట్లు తెలిపింది. ఈ చిప్‌లు డైనమిక్ కాషింగ్, రే ట్రేసింగ్ వంటి అధునాతన సామర్థ్యాలతో మెరుగైన CPU, GPU పనితీరును కనబరుచనున్నాయి. MacBook Pro మోడల్స్ లిక్విడ్ రెటినా XDR డిస్‌ప్లే, ఇన్‌బిల్ట్ 1080p కెమెరాతో పాటు ఇతర కనెక్టివిటీ ఆప్షన్లను కలిగి ఉన్నాయి. ఇతర ఫీచర్లు, ధర వంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
MacBook Pro M3 Design
గత M2 చిప్ సెట్ మ్యాక్ బుక్‌లు 13, 15 అంగుళాల పోడవు డిస్‌ప్లేతో రాగా… M3 చిప్ సెట్ కలిగిన కొత్త మ్యాక్ బుక్స్.. 14, 16 అంగుళాల పోడవు డిస్‌ప్లేతో వచ్చాయి. డిజైన్ పరంగా M2ను పోలినప్పటికీ..డిస్‌ప్లే పరంగా M3లో చాలా మార్పులు జరిగాయి. అన్ని మ్యాక్‌బుక్ ప్రో మోడల్‌లు లిక్విడ్ రెటినా XDR డిస్‌ప్లేను కలిగి ఉన్నాయి. 120Hz రిఫ్రేష్ రేట్, 1600nits వద్ద పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటాయి. ఇన్‌బిల్ట్ 1080p కెమెరా, నాణ్యమైన సౌండ్ అవుట్ అందించేందుకు ఆరు స్పీకర్లు ఉన్నాయి. సెక్యూరిటీ కోసం ఫింగర్ ఫ్రింట్ స్కానర్‌ను అందించింది. M3 చిప్‌సెట్ కలిగిన మ్యాక్ బుక్స్.. ప్రీవియస్ M2 చిప్ సెట్ కలిగిన మ్యాక్ బుక్స్ కంటే 20శాతం ఎక్కువ పర్ఫామెన్స్ స్పీడ్ కలిగినట్లు యాపిల్ వెల్లడించింది.
యాపిల్ M3 ప్రో చిప్ ప్రత్యేకతలు( M3 Chip Key Features)
బెస్ వెర్షన్ M3 చిప్ సెట్ కలిగిన మ్యాక్ బుక్స్‌లో 8 కోర్ CPU ఉంటే.. M3 ప్రోలో 12 కోర్ CPU, ఇక M3 మ్యాక్స్‌లో చిప్ సెట్ 16 కోర్CPUతో వచ్చింది. GPU విషయానికోస్తే.. M3లో 10 కోర్ GPU ఉండగా, M3 ప్రోలో 18 కోర్ GPU, M3 మ్యాక్స్‌లో 40 కోర్ GPU చిప్ సేట్‌ను తీసుకొచ్చింది. 36జీబీ, 96జీబీ, 64జీబీ, 128జీబీ స్టోరేజ్ కెపాసిటీతో మ్యాక్ బుక్ ప్రో మోడల్స్ రానున్నాయి.
పెరిగిన GPU పర్ఫామెన్స్ (MacBook Pro M3 GPU)
M3, M3 ప్రో, మ్యాక్స్‌లో పెరిగిన జీపీయూ కోర్స్ వల్ల… క్లిష్టమైన వీడియో రెండరింగ్ స్పీడ్ 2.5X అధికమైనట్లు యాపిల్ వెల్లడించింది. అలాగే ఫోటో ఎడిటింగ్, వీడియో ఎడిటింగ్, 3D యానిమేషన్, 3D రెండరింగ్, మ్యూజిక్ క్రియేషన్, గేమింగ్ వంటి వాటిని తక్కువ టైంలో ఎలాంటి ల్యాగ్ లేకుండా స్పీడ్‌గా చేసుకోవచ్చు.
కలర్స్
కొత్త మ్యాక్ బుక్ ప్రో మోడల్స్ రెండు కలర్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉన్నాయి. స్పేస్ బ్లాక్, సిల్వర్ కలర్స్‌లో లభించనున్నాయి.
బ్యాటరీ లైఫ్ (MacBook Pro M3 Battery)
Apple M2 chip సెట్ కంటే Apple M3, M3 Pro or M3 Max chip మ్యాక్ బుక్స్‌లో బ్యాటరీ సామర్థ్యం పెరిగింది. ఇదివరకు M2 చిప్స్ మ్యాక్ బుక్స్‌లో బ్యాటరీ లైఫ్ 18 గంటల వరకు ఉండగా.. M3 చిప్స్‌లో 22 గంటల వరకు బ్యాటరీ లైఫ్ ఉంటుందని యాపిల్ క్లైమ్ చేసింది.
కనెక్టివిటీ పోర్ట్స్
కొత్త MacBook Pro మోడల్‌లలో Wi-Fi 6E, బ్లూటూత్ 5.3, మూడు Thunderbolt 4/ USB 4 పోర్ట్‌లు, MagSafe 3 ఛార్జింగ్ పోర్ట్, SDXC కార్డ్ రీడర్, HDMI పోర్ట్ మరియు 3.5mm హెడ్‌ఫోన్ జాక్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి.
iphone & Macbook M3
ఐఫోన్, మ్యాక్ బుక్ కనెక్టివిటీని, షేరింగ్ క్యాపబులిటీని యాపిల్ పెంచింది. మ్యాక్ బుక్ నుంచే నేరుగా iPhone నుంచి వచ్చే కాల్స్, మెసేజ్‌లకు సమాధానం ఇవ్వవచ్చు. iPhoneలో చిత్రాలు, వీడియోలు, టెక్స్ట్ కాపీ చేసి, Macలోని మరొక యాప్‌లోకి ట్రాన్సఫర్ చేయవచ్చు. iCloud ద్వారా iPhone లేదా Mac నుంచి మీకు ఇష్టమైన ఫైల్‌లను యాక్సెస్ చేయవచ్చు.
ధర (MacBook Pro M3 Price)
M3 చిప్‌సెట్‌తో 14-అంగుళాల మ్యాక్‌బుక్ ప్రో ధర రూ. 1,69,900, M3 ప్రో చిప్ సెట్‌తో కూడిన 14-అంగుళాల మ్యాక్‌బుక్ ప్రో ధర రూ. 1,99,900, M3 మ్యాక్స్ చిప్ సెట్ కలిగిన 16-అంగుళాల మాక్‌బుక్ ప్రో రూ. 2,29,900 వద్ద ప్రారంభమవుతుంది. అయితే ఈ మ్యాక్ బుక్ ప్రో మోడల్స్‌పై విద్యార్థులకు 10శాతం వరకు డిస్కౌంట్ లభించనుంది.
M3 మ్యాక్ బుక్ (14 అంగుళాలు)- విద్యార్థులకు రూ.1,58,900;
M3 ప్రో మ్యాక్ బుక్ (14 అంగుళాలు)- విద్యార్థులకు రూ. 1,84,900;
M3 ప్రో మ్యాక్స్ (16-అంగుళాలు)- విద్యార్థులకు రూ. 2,29,900.
ఎప్పుడు అందుబాటులోకి?
ప్రస్తుతం మ్యాక్ బుక్ ప్రో మోడల్స్‌ను యాపిల్ స్టోర్ నుంచి కొనుగులు చేసుకోవచ్చు. త్వరలోనే ఇవి ఆన్‌లైన్ సేల్‌కు రానున్నాయి.
Celebrities Featured Articles Movie News Telugu Movies
Drishyam 3: ట్రెండింగ్‌లో ‘దృశ్యం 3’ హ్యాష్‌ట్యాగ్.. కారణం ఇదే!