Apple Watch Series 9 Review: కొత్తగా ఇందులో ఏముంది? వాచ్ ఎవరు కొనొచ్చు!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Apple Watch Series 9 Review: కొత్తగా ఇందులో ఏముంది? వాచ్ ఎవరు కొనొచ్చు!

    Apple Watch Series 9 Review: కొత్తగా ఇందులో ఏముంది? వాచ్ ఎవరు కొనొచ్చు!

    October 23, 2023

    యాపిల్ వాచ్ సిరీస్‌ 9ను ఇటీవల యాపిల్ కంపెనీ లాంచ్ చేసింది. ఈ వాచ్ ఈ మధ్యే మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చింది. ఈ వాచ్ ఓఎస్ 10 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేస్తుంది. రూ.41 వేల ప్రైస్‌లో అందుబాటులో ఉంది. మరి గత యాపిల్‌ వాచ్‌లు సిరీస్ 8, 7 కంటే ఎలాంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి? ఇంత ధరకు ఈ స్మార్ట్ వాచ్ కొనుగోలు చేయవచ్చా? ఇప్పుడు ఈ సమీక్షలో చూద్దాం.

    Apple Watch Series 9 Design

    యాపిల్ వాచ్ 9 సిరీస్ డిజైన్ పరంగా ఎలాంటి మార్పులు చేయలేదు. పాత 7, 8 సిరీస్ వాచ్‌ల మాదిరిగానే సిరీస్ 9 వాచ్‌ కూడా ఉంది. అయితే.. మిడ్‌ నైట్ బ్లాక్ కలర్ వాచ్‌లో మాత్రం సిరామిక్ బ్లాక్ కేస్‌తో అట్రాక్టివ్‌గా ఉంది.

    Apple Watch Series 9 Price

    యాపిల్‌ వాచ్‌ 9 సిరీస్‌ను యాపిల్ కంపెనీ భారత్‌లో రూ. 41,900 స్టార్టింగ్ ప్రైస్ వద్ద లాంచ్ చేసింది. జీపీఎస్, జీపీఎల్ సెల్యులార్ మోడల్స్‌లో వాచ్‌ను లాంచ్‌ చేశారు. స్టార్ లైట్, మిడ్ నైట్, పింక్, సిల్వర్, ప్రొడ‌క్ట్ రెడ్ కలర్స్‌లో అందుబాటులో ఉంది.

    ఇక బాక్స్‌లో వాచ్ డయల్‌తో పాటు రెండు స్ట్రాప్స్ అయితే లభిస్తాయి. వాటిలో నైక్ స్పోర్ట్ బ్యాండ్, మరొకటి కార్బన్ న్యూట్రల్ స్పోర్ట్ లూప్ బ్యాండ్. ఈ రెండు కూడా ప్రీమియం లుక్స్‌ అయితే అందిస్తాయి.

    యాపిల్ వాచ్ సిరీస్ 9 ప్రత్యేకతలు:

    యాపిల్ వాచ్ సిరీస్ 9… 41mm , 45mm డయల్ ఆప్షన్లతో వచ్చింది. యాపిల్ వాచ్ 7,8 మాదిరిగానే ఇందులో కూడా ఆల్వేస్ ఆన్ రెటీనా డిస్‌ప్లేను తీసుకొచ్చారు. దీని పీక్ బ్రైట్‌నెస్ 2000nits ఉంది.  వాచ్‌ను ఒకసారి చార్జ్ చేస్తే 18 గంట‌ల పాటు వాచ్ పనిచేస్తుంది.

      వినియోగదారుల ప్రైవసీకి మరింత రక్షణ కల్పిస్తూ ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఫీచర్ తీసుకొచ్చారు. యాపిల్ వాచ్ సిరీస్ 9 వాటర్ రెసిస్టెంట్ IP68తో వస్తోంది.

    గత మోడల్స్‌తో పోలిస్తే ఇంటర్నల్ స్టోరేజ్ డబుల్ అయింది. 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో వాచ్ సిరీస్ 9 అయితే వచ్చింది. అలాగే హెల్త్‌ మానిటర్ టూల్స్‌లోనూ ఇంప్రూమెంట్స్ కనిపిస్తున్నాయి. SPO2, హార్ట్ బీట్ రేట్‌, స్లీపింగ్ మానిటర్‌తో పాటు కొత్తగా మెంటల్ హెల్త్ టూల్ యాడ్ అయింది.

    ఇక గత మోడల్స్ పోలిస్తే… ఈ వాచ్ శక్తివంతమైన సెకండ్ జనరేషన్ అల్ట్రా వైడ్ బ్యాండ్ చిప్‌సెట్‌తో తయారైంది. ఈ వాచ్ యాపిల్ సిరీస్ 7,8 కంటే 60 శాతం ఎక్కువ స్పీడ్‌ను కలిగి ఉంది. 

    వాచ్‌ 9లో 7,8 యాపిల్ సిరీస్ వాచ్‌ల మాదిరిగానే ఎన్నో హెల్త్ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ విషయంలో పెద్ద డిఫరెన్స్ అయితే ఏమి లేదు.  హైకింగ్, సైక్లింగ్ ఫీచర్లతో పాటు మెంటల్ హెల్త్ సపోర్ట్ టూల్స్ కూడా ఇందులో ఉన్నాయి.

    డబుల్ ట్యాప్ ఫీచర్

    ఇందులో గత వాచ్ సిరీస్‌ల కంటే ఓ ప్రత్యేకమైన ఫీచర్‌ను యాపిల్ తీసుకొచ్చింది. డబుల్ ట్యాప్ గెస్చర్ ఫీచర్. ఈ ఫిచర్‌తో యూజర్లు కాల్స్ ఆన్సర్ చేయడంతో పాటు ఎండ్ చేయవచ్చు. టైమర్ స్టాప్ చేయడం, అలారం స్టాప్, కెమెరాను యాక్సెస్ చేయడం,  మ్యూజిక్ కంట్రోల్ చేయడం వంటివి అందుబాటులోకి తెచ్చారు.

    మరోవైపు ఇప్పటి వరకు యాపిల్ లాంచ్ చేసిన మొట్టమొదటి కార్బన్ న్యూరల్ ప్రొడక్ట్ ఇదే కావడం విశేషం. 

    యాపిల్ వాచ్‌ సిరీస్ 9 ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. బ్యాటరీ విషయంలో ఇంప్రూమెంట్స్ చేసినట్లు యాపిల్ చెప్పినప్పటికీ… గుర్తించదగ్గ స్థాయిలో మాత్రం అది లేదు. సింగిల్ ఛార్జ్ చేస్తే 1.5 డేస్‌ వరకు బ్యాటరీ లైఫ్ ఉంటుంది. మొదటి 30 నిమిషాల్లో 65శాతం ఛార్జింగ్‌ అయింది. ఫుల్ ఛార్జ్ అయ్యేందుకు 1 గంట 7నిమిషాల సమయం అయితే పట్టింది.

    చివరగా కొనొచ్చా?

    యాపిల్‌ వాచ్‌లో 7,8 మాదిరిగానే డిజైన్‌లో పెద్దగా మార్పులు అయితే రాలేదు. వాచ్ సిరీస్ 6 వాడుతున్న వారు అప్‌గ్రేడ్ అయ్యేందుకు వాచ్ సిరీస్ 9 మంచి ఎంపిక. ఇంటర్నల్ స్టోరేజ్, డబుల్ ట్యాప్ గెస్చర్,  ఫాస్టర్ చిప్‌సెట్, బ్రైటర్ డిస్‌ప్లే మినహా వాచ్‌ 9లో చెప్పుకోదగ్గ ఇంప్రూవ్‌మెంట్స్ అయితే ఏమి లేవు. ఓల్డ్ డిజైన్, బ్యాటరీ లైఫ్‌లో పెద్దగా ఇంప్రూవ్‌మెంట్స్ లేకపోవడం మైనస్. వాచ్ 8, 7 కలిగినవారు ఈ వాచ్‌కు అప్‌గ్రేడ్ కాకపోవడమే ఉత్తమం.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version