Apple Watch Ultra 2: టెక్‌ లవర్స్ మనసు దోచేస్తున్న నయా యాపిల్‌ వాచ్‌.. ఊహకందని గ్రేట్‌ ఫీచర్లు!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Apple Watch Ultra 2: టెక్‌ లవర్స్ మనసు దోచేస్తున్న నయా యాపిల్‌ వాచ్‌.. ఊహకందని గ్రేట్‌ ఫీచర్లు!

    Apple Watch Ultra 2: టెక్‌ లవర్స్ మనసు దోచేస్తున్న నయా యాపిల్‌ వాచ్‌.. ఊహకందని గ్రేట్‌ ఫీచర్లు!

    September 14, 2023

    యాపిల్‌ లవర్స్‌ ఎంతగానో ఎదురుచూసిన ‘యాపిల్ వాచ్ ఆల్ట్రా 2’ (Apple Watch Ultra 2) వాచ్‌ ఎట్టకేలకు ప్రపంచం ముందుకు వచ్చేసింది. తాజాగా జరిగిన వండర్‌లస్ట్ ఈవెంట్‌లో యాపిల్‌ సంస్థ ఈ వాచ్‌ను లాంచ్‌ చేసింది. ఐఫోన్ 15 సిరీస్‌తో పాటు ఈ అత్యాధునిక వాచ్‌ను టెక్‌ ప్రియులకు పరిచయం చేసింది. గతేడాది వచ్చిన ‘యాపిల్ వాచ్ ఆల్ట్రా’ (Apple Watch Ultra)కు  కొనసాగింపుగా దీన్ని తీసుకొచ్చారు. ఈ స్మార్ట్‌ వాచ్ స్పెసిఫికేషన్స్, ధర వివరాలను ఇప్పుడు పరిశీలిద్దాం.

    పవర్‌ఫుల్‌ OS

    యాపిల్ వాచ్ ఆల్ట్రా 2ను పవర్‌ఫుల్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ (OS)తో తీసుకొచ్చారు. ఇది watchOS 10పై పనిచేయనుంది. వాచ్ డి‌స్‌ప్లే 3000 నిట్స్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. ఇది మునుపటి మోడల్ కంటే 50 శాతం ఎక్కువ.

    బ్యాటరీ లైఫ్‌

    Apple Watch Ultra 2 వాచ్‌కు Li-Ion 542 mAh బ్యాటరీని ఫిక్స్‌ చేశారు. దీన్ని ఒకసారి ఛార్జీ చేస్తే 36 గంటల బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది. Low Power Modeలో అయితే 72 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్ ఉంటుంది. 

    ఆల్టిట్యూడ్ రేంజ్‌

    ట్రెక్కింగ్, హైకింగ్ చేసే వారి కోసం ఈ వాచ్‌ను పవర్‌ఫుల్‌ ఆల్టిట్యూడ్ రేంజ్‌తో తీసుకొచ్చారు. సముద్ర మట్టం కంటే 500 మీటర్ల కింద, భూమి మీద నుంచి 9000 మీటర్లు పైన కూడా ఇది సమర్థవంతంగా పనిచేయగలదు. వాటర్ స్పోర్ట్స్ ఆడేవారి కోసం 40 మీటర్ల వరకు డైవింగ్ డెప్త్ ఫీచర్‌ను కూడా ఈ వాచ్‌లో పొందుపరిచారు. 

    డబల్‌ ట్యాప్‌

    ఈ వాచ్‌లో చాలా యాక్షన్స్‌ను త్వరగా, సౌకర్యవంతంగా నిర్వహించడానికి డబల్ ట్యాప్‌ విధానాన్ని యాపిల్‌ తీసుకొచ్చింది. దీని కోసం చూపుడు వేలు, బొటన వేలు కలిపి రెండుసార్లు డిస్‌ప్లే‌పై ట్యాప్ చేయాల్సి ఉంటుంది. ఇలా నొక్కడం ద్వారా వాచ్ ఫేస్ నుంచి స్మార్ట్ స్టాక్‌ కూడా ఓపెన్ అవుతుంది. మరొకసారి డబుల్ ట్యాప్ చేస్తే స్టాక్‌లోని విడ్జెట్‌ల ద్వారా స్క్రీన్ స్క్రోల్ అవుతుంది.

    సిరితో ఈజీ ఆపరేట్‌

    యాపిల్ వాచ్ అల్ట్రా 2ను సిరి ద్వారా కూడా ఆపరేట్ చేయవచ్చు. వాటర్ స్పోర్ట్స్, స్కూబా డైవింగ్ వంటివి ఈ వాచ్ పెట్టుకునే చేయవచ్చు. ఇందులోని ఓషియానిక్ ప్లస్ యాప్ వాటర్ స్పోర్ట్స్ వివరాలు తెలియజేస్తుంది. 

    అడ్వాన్స్‌డ్‌ సెన్సార్లు

    చాలా అడ్వాన్స్‌డ్‌ సెన్సార్లను ఈ వాచ్‌లో ఫిక్స్‌ చేశారు. యాక్సిలోమీటర్‌ (Accelerometer), గైరోమీటర్‌ (gyro), హార్ట్‌ రేట్‌ (heart rate), బారోమీటర్‌ (barometer), అల్టీమీటర్‌ (altimeter), దిక్సూచి (compass), SpO2, VO2max, బాడీ టెంపరేచర్‌, వాటర్‌ టెంపరేచర్‌ సెన్సార్లను ఈ వాచ్‌లో ఫిక్స్ చేశారు. 

    ధర ఎంతంటే?

    భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, యూకే, అమెరికా సహా మెుత్తం 40కు పైగా దేశాల్లో యాపిల్ వాచ్ ఆల్ట్రా2 సెప్టెంబర్ 22 నుంచి అందుబాటులోకి రానుంది. భారత్‌లో దీని ధర రూ.89,900గా ఉంది. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version