Appudo Ippudo Eppudo Review: బోరింగ్ లవ్‌ట్రాక్స్‌తో నిరాశపరిచిన ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’.. కానీ!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Appudo Ippudo Eppudo Review: బోరింగ్ లవ్‌ట్రాక్స్‌తో నిరాశపరిచిన ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’.. కానీ!

    Appudo Ippudo Eppudo Review: బోరింగ్ లవ్‌ట్రాక్స్‌తో నిరాశపరిచిన ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’.. కానీ!

    November 8, 2024

    నటీనటులు : నిఖిల్‌, దివ్యాంన్ష కౌషిక్‌, సత్య, అజయ్‌, సాయిరామ్‌ రెడ్డి, రుక్మిణి వసంత్‌, హర్ష చెముడు తదితరులు

    రచన, డైరెక్టర్‌ : సుధీర్ వర్మ

    సంగీతం:  కార్తిక్‌

    సినిమాటోగ్రఫీ: రిచర్డ్ ప్రసాద్‌

    ఎడిటింగ్‌: నవీన్‌ నూలి

    నిర్మాత: బి.వి.ఎస్‌. ఎన్‌. ప్రసాద్‌

    విడుదల తేదీ: నవంబర్‌ 8, 2024

    యంగ్ హీరో నిఖిల్‌ నటించిన లేటెస్ట్‌ చిత్రం ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ (Appudo Ippudo Eppudo Review). నిఖిల్‌తో ‘స్వామిరారా’, ‘కేశవ’ తీసిన దర్శకుడు సుధీర్‌ వర్మ ఈ సినిమా రూపొందించారు. బి.బాపినీడు సమర్పణలో బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మించారు. రుక్మిణీ వసంత్‌ కథానాయిక. దివ్యాంశ కౌశిక్‌ కీలక పాత్ర పోషించింది. నవంబరు 8న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? తెలుగు ఆడియన్స్‌ను ఆకట్టుకుందా? నిఖిల్‌కు విజయాన్ని అందించిందా? ఈ రివ్యూలో తెలుసుకుందాం. 

    కథేంటి

    హైదరాబాద్‌కు చెందిన రిషి (నిఖిల్‌) కెరీర్‌పై పెద్దగా ఆశలు లేకుండా సరదాగా తిరుగుతుంటాడు. ఈ క్రమంలో తొలి చూపులోనే తార (రుక్మిణి వసంత్‌) చూసి ఇష్టపడతాడు. కొన్ని నాటకీయ పరిణామాల వల్ల వారి లవ్‌ బ్రేకప్‌ అవుతుంది. లవ్‌ ఫెయిల్‌ అవ్వడంతో కెరీర్‌పై ఫోకస్‌ పెట్టిన రిషి లండన్‌కు వచ్చేస్తాడు. అక్కడ రేసర్‌గా ట్రైనింగ్‌ తీసుకుంటూ పాకెట్‌ మనీ కోసం చిన్నపాటి పనులు చేస్తుంటాడు. ఈ క్రమంలో లండన్‌లో పరిచయమైన తులసి (దివ్యాంశ కౌశిక్‌)కు రిషి దగ్గరవుతాడు. ఆమెను పెళ్లి కూడా చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. అయితే తులసి అనూహ్యంగా మిస్ అవుతుంది. మరోవైపు హైదరాబాద్‌లో ప్రేమించిన తార లండన్‌లో ప్రత్యక్షమవుతుంది. అటు రిషి అనుకోకుండా లోకల్‌ డాన్‌ బద్రినారాయణ (జాన్ విజయ్‌) చేతిలో ఇరుక్కుంటాడు. అసలు బద్రి నారాయణ ఎవరు? తులసి ఎలా మిస్ అయ్యింది? తారా ఎందుకు లండన్‌కు వచ్చింది? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. (Appudo Ippudo Eppudo Review)

    ఎవరెలా చేశారంటే

    హీరో నిఖిల్ (Nikhil) ఎప్పటిలాగే సెటిల్డ్‌ నటనతో ఆకట్టుకున్నాడు. తన లుక్స్‌, కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను అలరించాడు. అయితే అతడి పాత్రలో నటన పరంగా పెద్దగా మెరుపులు లేదు. సాఫీగా చేసుకుంటూ వెళ్లాడు. హీరోయిన్ రుక్మిణి వసంత్‌ తన సహజమైన నటనతో ఆకట్టుకుంది. హావభావాలను చక్కగా పలకిస్తూ మంచి నటిగా మరోమారు నిరూపించుకుంది. మరో నటి దివ్యాంశ కౌశిక్‌కు ఇందులో మంచి పాత్రే దక్కింది. నెగిటివ్‌ షేడ్స్‌ ఉన్న తులసి పాత్రలో ఆమె ఆకట్టుకుంది. లుక్స్‌, గ్లామర్‌ పరంగా ఆమెకు మంచి మార్కులే పడ్డాయి. హాస్యనటుడు హర్ష చెముడు కామెడీ టైమింగ్ నవ్విస్తుంది. జాన్ విజయ్, అజయ్ పాత్రలు పర్వాలేదు. సత్యదేవ్, సుదర్శన్ పాత్రలు కథలో వేగం పెంచేందుకు దోహదం చేశాయి.

    డైరెక్షన్‌ ఎలా ఉందంటే

    దర్శకుడు సుధీర్ వర్మ రొటీన్‌ స్టోరీ (Appudo Ippudo Eppudo Review)నే ఈ సినిమాకు ఎంచుకున్నాడు. అయితే కథనం, స్క్రీన్‌ప్లే విషయంలో మాత్రం దర్శకుడు తన మార్క్‌ను చూపించాడు. ముఖ్యంగా మూడో వ్యక్తి (కమెడియన్‌ సత్య) కోణంలో కథను నడిపించడం ఆసక్తికరంగా అనిపిస్తుంది. సినిమాకు కీలకమైన హీరో, హీరోయిన్ల రెండు లవ్‌ట్రాక్స్‌ చాలా బోరింగ్‌గా అనిపిస్తాయి. హీరో పరిచయం, అతడి ఫస్ట్ లవ్‌ట్రాక్‌తో తొలి భాగం పేవలంగా సాగిన ఫీలింగ్‌ కలుగుతుంది. సెకండాఫ్‌ కాస్త పర్వాలేదనిపించినా కీలక సన్నివేశాల విషయంలో దర్శకుడు పూర్తిగా తడబడ్డాడు. ట్విస్టులు రివీల్‌ చేసిన విధానం కూడా బెడిసికొట్టింది. అయితే హర్ష చెముడు, సత్య, సుదర్శన్‌ కమెడితో దర్శకుడు కొంతమేర సినిమాను లాక్కొచ్చాడని చెప్పవచ్చు. కమర్షియల్‌ పాళ్లు తక్కువగా ఉండటం, పేలవమైన యాక్షన్‌ సీక్వెన్స్‌ మరింత మైనస్‌గా మారాయి. 

    సాంకేతికంగా ..

    టెక్నికల్ విషయాలకు వస్తే (Appudo Ippudo Eppudo Review) రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. కార్తిక్ అందించిన పాటలు సోసోగా ఉంది. నేపథ్య సంగీతం కాస్త పర్వాలేదు. ఎడిటింగ్ వర్క్‌ ఓకే. నిర్మాణ విలువలు కథకు తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.

    ప్లస్ పాయింట్స్‌

    • నిఖిల్‌ నటన
    • కామెడీ
    • సినిమాటోగ్రఫీ

    మైనస్‌ పాయింట్స్‌

    • పేలవమైన స్టోరీ
    • బోరింగ్ లవ్‌ట్రాక్స్‌
    • కమర్షియల్‌ హంగులు లేకపోవడం

    Telugu.yousay.tv Rating : 2/5 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version