ఆసియా కప్ ఆల్ టైమ్ రికార్డ్‌లు (asia cup all time records)
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఆసియా కప్ ఆల్ టైమ్ రికార్డ్‌లు (asia cup all time records)

    ఆసియా కప్ ఆల్ టైమ్ రికార్డ్‌లు (asia cup all time records)

    September 5, 2022

    ఆసియా కప్ 15వ ఎడిషన్ ఆగస్టు 27, 2022న UAEలో ప్రారంభం కానుంది. ఈ పోటీల్లో ఛాంపియన్‌గా నిలిచేందుకు ఆరు దేశాల జట్లు పాల్గొంటున్నాయి. రెండు వారాల పాటు జరిగే ఈ టోర్నమెంట్‌ సెప్టెంబర్ 11న ముగియనుంది. షార్జా, దుబాయ్‌లోని స్టేడియాల్లో మొత్తం 13 మ్యాచ్‌లు జరగనున్నాయి. గ్రూప్ ఏలో బంగ్లాదేశ్, ఆప్గానిస్తాన్, శ్రీలంక ఉండగా.. ఇండియా, పాకిస్తాన్, హాంకాంగ్/ సింగపూర్/ కువైట్/UAE గ్రూప్ బీలో ఉన్నాయి.

    ఆసియా కప్‌ను T20 ఫార్మాట్‌లో నిర్వహించడం ఇది రెండోసారి. చివరిది 2016లో జరిగింది. T20కి ముందు 2018లో ఆతిథ్య బంగ్లాదేశ్‌ను ఫైనల్స్‌లో ఓడించి భారత్ విజయం సాధించింది. ఈ చారిత్రాత్మక టోర్నమెంట్ 1984లో మొదలు కాగా, ఇండియా ఈ సిరీస్‌లో విజేతగా నిలిచింది. ఆ తర్వాత భారత్ మొత్తం 7 సార్లు, శ్రీలంక 5 సార్లు, పాకిస్థాన్‌ 2 సార్లు టైటిల్‌ను గెలుచుకున్నాయి. ఈ సందర్భంగా గత ఆసియా కప్‌ రికార్డు వివరాలు, అత్యధిక స్కోర్లు సహా పలు అంశాలు ఇప్పుడు చుద్దాం.

    అత్యధిక పరుగులు

    శ్రీలంక మాజీ దిగ్గజ క్రికెటర్ జయసూర్య ఆసియా కప్ టోర్నమెంట్లలో అత్యధిక పరుగులు చేశాడు. 53.04 సగటు, 102.52 స్ట్రైక్ రేట్‌తో 1,220 పరుగులు తీశాడు. వీటిలో ఆరు సెంచరీలు, మూడు అర్ధసెంచరీలు ఉన్నాయి. జయసూర్య  బ్యాటింగ్ చేసిన 24 ఇన్నింగ్స్‌లలో అత్యధిక స్కోరు 130.

    అత్యుత్తమ వ్యక్తిగత స్కోరు

    భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి ఖాతాలో అత్యధిక వ్యక్తిగత స్కోరు 183 సాధించిన రికార్డు ఉంది. 2012లో పాకిస్థాన్‌పై జరిగిన మ్యాచులో కోహ్లీ 148 బంతుల్లో 22 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 183 రన్స్ చేశాడు.

    అత్యధిక వికెట్లు

    మరో శ్రీలంక దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ ఆసియా కప్ సిరీస్‌లో అత్యధిక వికెట్లు సాధించిన జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. 24 ఇన్నింగ్స్‌లలో కేవలం 3.75 ఎకానమీ రేట్‌, 28.83 సగటుతో 30 వికెట్లు తీశాడు. 2008లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచులో ముత్తయ్య 5/31 ఘనతను సాధించాడు.

    అత్యుత్తమ బౌలింగ్

    మిస్టరీ శ్రీలంక స్పిన్నర్ అజంతా మెండిస్ 2008 ఫైనల్లో భారత్‌పై 6/13 బెస్ట్ సాధించాడు. ఈ స్పిన్ బౌలర్ శ్రీలంక టైటిల్ గెలవడంలో జట్టుకు సహాయం చేశాడు. ఇప్పటి వరకు ఇదే అత్యుత్తమ గణాంకంగా నిలిచింది.

    అత్యధిక స్కోర్

    50 ఓవర్ల పోటీలో పాకిస్తాన్ అత్యధిక స్కోర్ 385 సాధించారు. 2010లో బంగ్లాదేశ్‌పై జరిగిన మ్యాచ్‌లో షాహిద్ అఫ్రిది 124 పరుగులు చేయడంతో స్కోర్ 385కు చేరింది.

    తక్కువ స్కోరు

    ఆసియా కప్‌లలో బంగ్లాదేశ్ అత్యల్ప స్కోరును చవిచూసింది. 2000లో ఢాకాలో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 34.2 ఓవర్లలో కేవలం 87 పరుగులకే ఆలౌటైంది.

    మోస్ట్ POTM 

    జయసూర్య ఈసారి మోస్ట్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులతో జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. ఆసియా కప్ చరిత్రలో లంక మాజీ కెప్టెన్ ఐదుసార్లు ఈ అవార్డును అందుకున్నాడు. అతని సహచరుడు కుమార సంగక్కర, పాకిస్తాన్ ద్వయం ఆఫ్రిది, షోయబ్ మాలిక్ 4 సార్లు ఈ అవార్డును గెలుచుకున్నారు.

    T20లో అత్యుత్తమ వ్యక్తిగత స్కోరు 

    ఆసియా కప్ T20I సిరీస్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన రికార్డును ఇండియాకు చెందిన రోహిత్ శర్మ కలిగి ఉన్నాడు. 2016 ఎడిషన్ ప్రారంభ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై 55 బంతుల్లో 83 పరుగులు చేశాడు.

    టీ20లో అత్యధిక స్కోర్

    బంగ్లాదేశ్‌పై భారత్ అత్యధిక స్కోరు 166/6 నమోదు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన మెన్ ఇన్ బ్లూ, రోహిత్ ఇన్నింగ్స్ 83, హార్దిక్ పాండ్య 31 పరుగులు చేశారు. బంగ్లాదేశ్‌ను కేవలం 121/7కి పరిమితం చేయడంతో భారత్ 45 పరుగుల తేడాతో విజయం సాధించింది.

    టీ20లో అత్యల్ప స్కోర్

    టోర్నమెంట్ చరిత్రలో UAE అత్యల్ప స్కోరును నమోదు చేసింది. 2016లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో 20 ఓవర్లలో 81/9 మాత్రమే చేశారు. ఈ లక్ష్యాన్ని 10.1 ఓవర్లలోనే ఛేదించిన భారత్‌ 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

    మోస్ట్ POTM 

    స్టార్ ఇండియా ద్వయం విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ 2 సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను గెలుచుకున్నారు. MS ధోని నాయకత్వంలో ఇద్దరూ 5 మ్యాచ్‌లు ఆడారు. టోర్నమెంట్‌లో మరో తొమ్మిది మంది వేర్వేరు ఆటగాళ్లు ఒకసారి అవార్డును గెలుచుకున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version