August 15 Celebrity Birthdays: స్వాతంత్ర్య దినోత్సవం రోజున జన్మించిన సెలబ్రిటీల లిస్ట్ ఇదే..!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • August 15 Celebrity Birthdays: స్వాతంత్ర్య దినోత్సవం రోజున జన్మించిన సెలబ్రిటీల లిస్ట్ ఇదే..!

    August 15 Celebrity Birthdays: స్వాతంత్ర్య దినోత్సవం రోజున జన్మించిన సెలబ్రిటీల లిస్ట్ ఇదే..!

    August 14, 2023

    ఆగస్టు 15న భారత దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించింది. ఆ రోజును యావత్ భారతావని గౌరంవగా భావిస్తారు. ఆగస్టు 15న ఏ కార్యక్రమం జరిగినా గొప్పగా పేర్కొంటూ కలకాలం గుర్తించుకుంటారు. ఈనేపథ్యంలో ఆగస్టు 15న జన్మించిన సినీ ప్రముఖులు ఎవరెవరు ఉన్నారో ఓసారి చూద్దాం..

    సుహాసిని మణిరత్నం

    సుహాసిని తమిళనాడులోని పరమకుమిడిలో 1961 ఆగస్టు 15న జన్మించింది. తమిళం , తెలుగు , మలయాళం, కన్నడ చిత్రాలలో నటించింది . కే బాలచందర్ డైరెక్షన్‌లో వచ్చిన సింధు భైరవి (1985) లో తన నటనకు గానూ ఉత్తమ నటిగా జాతీయ అవార్డును గెలుచుకుంది . తెలుగులో ఎగిరేపావురమా,  సంసారం చదరంగం, చంటబ్బాయి, నువ్వునాకునచ్చావ్ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. 

    అర్జున్ సర్జా 

    అర్జున్ తెలుగు, తమిళ సినిమా పరిశ్రమ నటుడు, దర్శకుడు. ఇతడు సుమారు 130 సినిమాలలో నటించాడు. కొన్నింటికి తానే స్వయంగా డైరెక్ట్ చేశాడు. 1962 ఆగస్టు 15న కర్ణాటకలోని తుమకూర్‌లో జన్మించారు. అర్జున్‌కు ఇద్దరు ఆడ పిల్లలు, ఐష్వర్య సర్జా, అంజనా సర్జా. ఇతను హనుమంతుని వీర భక్తుడు.  అందువల్లే శ్రీఆంజనేయం చిత్రంలో ఆంజనేయునిగా నటించాడు. 

    అద్నాన్ సమి 

    అద్నాన్ సమి ప్రముఖ భారతీయ నేపథ్య గాయకుడు. 1971 ఆగస్టు 15న లండన్‌లో సమి జన్మించారు. హిందీ, తెలుగు చిత్రాల్లో వందలాది సాంగ్స్ పాడారు.  పలు సినిమాల్లోనూ నటుడిగా యాక్ట్ చేశారు. భజరంగ్ భాయ్ జాన్ వంటి సూపర్ హిట్ చిత్రంలో నటించారు. 2016లో భారత పౌరసత్వం పొందారు. సంగీతంలో ఆయన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం 2020లో పద్మశ్రీ అవార్డుతో ఆయన్ను సత్కరించింది.

     

    ఉత్తేజ్

    ఉత్తేజ్ 1975, ఆగస్ట్ 15న నల్గొండ జిల్లాలోని సీతారాంపురంలో జన్మించారు. తెలుగు చిత్రపరిశ్రమలో నటుడిగా, సంభాషణల రచయితగా, అసిస్టెంట్ డైరెక్టర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పటివరకు 197 సినిమాల్లో నటించారు.  మనీ, మనీ మనీ, అంతం, రాత్రి, ఖడ్గం, నిన్నే పెళ్ళాడతా, డేంజర్ వంటి హిట్ చిత్రాలకు మాటలు రాశాడు. చందమామ సినిమాకు ఉత్తమ హాస్య నటునిగా నంది బహుమతి పొందాడు.

    అయాన్ ముఖర్జి

    అయాన్ ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు.  1983 ఆగస్టు 15న  పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో జన్మించారు. బ్రహ్మాస్త్ర, వేకప్‌సిడ్, ‘హే జవానిహై దివాని’ వంటి హిట్ చిత్రాలను డైరెక్ట్ చేశారు.  ప్రస్తుతం బ్రహ్మాస్త్ర పార్ట్ 2 తెరకెక్కించి పనిలో ఉన్నారు. ఈ చిత్రం మూడు పార్ట్‌లలో రానుంది. 

    రాళ్లపల్లి

    రాళ్ళపల్లి ప్రముఖ తెలుగు క్యారెక్టర్ అర్టిస్ట్. ఆయన తూర్పు గోదావరి జిల్లా, రాచపల్లిలో 1945, ఆగస్టు 15 న జన్మించారు.  రాళ్లపల్లి అసలు పేరు రాళ్లపల్లి నరసింగరావు. తెలుగులో ఆయన దాదాపు 800కు పై చిత్రాల్లో నటించారు. తనికెళ్ల భరణి వంటి రచయితలకు ఆయన మార్గదర్శి. నాటకరంగంలో 8వేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version