Ayyappa Telugu Songs Lyrics: మిమ్మల్ని భక్తి పారవశ్యంలో ముంచెత్తే అయ్యప్ప స్వామి భజన పాటల లిరిక్స్!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Ayyappa Telugu Songs Lyrics: మిమ్మల్ని భక్తి పారవశ్యంలో ముంచెత్తే అయ్యప్ప స్వామి భజన పాటల లిరిక్స్!

    Ayyappa Telugu Songs Lyrics: మిమ్మల్ని భక్తి పారవశ్యంలో ముంచెత్తే అయ్యప్ప స్వామి భజన పాటల లిరిక్స్!

    November 28, 2024

    ప్రతి ఏడాది కార్తీక మాసం వచ్చే సరికి లక్షలాది మంది భక్తులు అయ్యప్ప స్వామిని ఆరాధిస్తూ మాలలు ధరించి 41 రోజుల దీక్ష ప్రారంభిస్తారు. ఈ సమయంలో అయ్యప్ప భక్తి పాటలు వారి ఆధ్యాత్మిక యాత్రలో ప్రధాన భాగంగా నిలుస్తాయి.

    ఈ పాటలు భక్తుల మనసును ములుసుకుని, ధ్యానానికి, సామూహిక పూజలకి, ఆలయ సందర్శనలకు ప్రేరణ కలిగిస్తాయి. వీటి ద్వారా అయ్యప్ప స్వామి పట్ల భక్తుల ప్రేమ, నమ్మకం మరింతగా పెరుగుతుంది. ఇక్కడ అందిస్తున్న పాటల లిరిక్స్‌లో దేవుని మహిమ, శబరిమల యాత్ర విశిష్టత, మరియు స్వామి అయ్యప్ప జీవిత గాథల గురించి వివరించడం జరిగింది.

    అయ్యప్ప భక్తి పాటల ప్రత్యేకత

    శ్రావ్యమైన సంగీతం: అర్థమైయ్యే సాహిత్యంతో పాటు వినసొంపైన సంగీతం ప్రతి భక్తుడి మనసులో స్థానం సంపాదిస్తుంది.

    పరమార్థం: ఈ పాటలు భక్తుల జీవితాలకు అర్థం తీసుకురావడమే కాక, వారి ఆధ్యాత్మిక సాధనలో దోహదపడతాయి.

    సామూహికత: అయ్యప్ప పాటలు భక్తుల మధ్య సామూహికతను పెంచి, సమాజాన్ని ఐక్యంగా ఉంచుతాయి.

    అయ్యప్ప పాటలు కేవలం భక్తి పాటలు మాత్రమే కాదు; ఇవి ఆధ్యాత్మిక యాత్రలో భక్తుల ప్రేరణకు మార్గదర్శకం. “స్వామియే శరణం అయ్యప్ప” అంటూ ప్రతి గానం భక్తుల హృదయాలను ఆలయాలకు దగ్గర చేస్తుంది.

    Contents

    కార్తీక మాసము వచ్చిందంటే

    కార్తీక మాసము వచ్చిందంటే

    కార్తీక మాసము వచ్చిందంటే కలతలుండవయ్యా

    నియమాలు నిష్టలు పాటిస్తుంటే నిలకడ వచ్చేనయ్యా

    శబరిస్వామివయ్యా నీవు అభయదాతవయ్య

    శరణం బంగారయ్య మాపై కరుణ చూపవయ్య     ||కార్తీక||

    నొసటి పెడితే చందనము ఇసుక పడితే కుందనము

    విబూది పూసిన శరీరం మేదిని నేలే కిరీటం

    పంపానదిలో శరణం శరణం స్నానమాడి శరణం శరణం

    పంపాలో స్నానమాడి పావనులమై వచ్చాము

    స్వామి స్వామి ఇరుముడి తలపైనిడి తరలివచ్చేమయ్యా

    పట్టిన దీక్షమాకే పట్టాభిషేకమయ్యా అయ్యప్పాపట్టాభిషేకమయ్యా     ||కార్తీక||

    సన్నిధానమున నిలబడి స్వామి శరణం విన్నవించి

    హృదయములే పల్లవించి భక్తావేశం పెల్లుబికి

    ఒళ్ళు పులకించి కళ్ళు ముకుళించి కైవల్యం కాంచేమయ్యా

    ముక్తి సోపానాలు ముట్టినట్లుగ ధన్యత నొందేమయ్య

    ఇంతటి గొప్ప పెన్నిధి ఇపుడె సిద్ధించేను అయ్యప్పా ఇపుడె సిద్ధించెను ||కా||

    అది గదిగో శబరి మలా

    అది గదిగో శబరి మలా – అయ్యప్పస్వామి ఉన్న మలా

    అది గదిగో పళణి మలా – అయ్యప్ప సోదరుడు ఉన్న మలా

    శరణమయ్యప్ప శరణమయ్యప్ప శరణ మయ్యప్ప స్వామియే

    స్వామియే అయ్యపా – అయ్యప్పా స్వామియె  

    అదిగదిగో శబరిమల – శివకేశవులు ఉన్నమల

    ఉన్నవారిని లేనివారిని తేడలేనిది శబరిమల

    కులమొ మతమొ, జాతి భేదము తేడలేనిది శబరిమల    ||శరణమయ్యప్ప||    

    అదిగదిగో పళనిమల శివపార్వతుల ఉన్నమల

    కైలాసం వైకుంఠం కలసిఉన్నది శబరిమల

    ఈశ్వర హృదయం మాధవనిలయం కలిసిఉన్నది శబరిమల  ||శరణమ||

    అదిగదిగో పంపానది, దక్షిణభారత గంగానది

    ఈశ్వర కేశవ నందునందుని పాదముకడిగిన పుణ్యనది

    అదిగదిగో శబరి పీఠం భక్తజనులకిది ముక్తిపీఠం

    శబరిఎంగిలి ఆరగించిన రాముడు నడిచిన పుణ్యస్ధలం

    అదిగదిగో కాంతమల అక్కడ వెలువడును మకరజ్యోతి

    హరిహర పుత్రుడు అయ్యప్ప స్వామికి హారతి ఇచ్చేదీపమది  ||శరణమ||

    శబరిమలై నౌక సాగీ పోతున్నది

    పల్లవి :     శభరిమలై నౌకా సాగీ పోతున్నది

            అయ్యప్ప నౌక సాగీ పోతున్నది

        నామంబు పలికితే నావ సాగి పోతుంది

        శరణం శరణం అయ్యప్పా స్వామి శరణం అయ్యప్పా

         అందులో చుక్కాని శ్రీ మణి కంఠుడు

        అందులో చుక్కాని శ్రీ భూతనాధుడు

        నామంబు పలికితే నావ సాగి పోతుంది.         ||శరణం||

         తెడ్డెయ్యపని లేదు తెర చాప పని లేదు

        పేదలకు సాదలకు ఇది ఉచితమండీ

        డబ్బిచ్చి ఈ నావా మీ రెక్క లేరు

        నామంబు పలికితే నావ సాగి పోతుంది         ||శరణం||

         కదలండి బాబు మెదలండి బాబు

        అమ్మలారా అయ్యలారా రండి రండి మీరూ

        నామంబు పలికితే నావ సాగిపోతుంది         ||శరణం||    

    కొండల్లో కొలువున్న కొండదేవరా

    పల్లవి:     కొండల్లో కొలువున్న కొండదేవరా

        మాకొర్కేలన్ని దీర్చవయ్య కొండదేవరా

    1.    కార్తీక మసాన కొండదేవరా

        మేము మాలలే వేస్తాము కొండదేవరా         ||కొం||

    2.    అళుదమలై (నది) శిఖరాన కొండదేవరా

        మమ్ము ఆదరించి చూడవయ్య కొండదేవరా     ||కొం||    

    3.    కరిమలై శిఖరాన కొండదేవరా

        మమ్ము కరుణించగ రావయ్య కొండదేవరా     ||కొం||

    4.    పంపానది తీరాన కొండదేవరా

        మా పాపములను బాపవయ్య కొందడేవరా     ||కొం||

    5.    పదునెనెమిది మెట్లెక్కి కొండదేవరా

        మేము పరవశించినామయ్య కొండదేవరా         ||కొం||

    6.    నెయ్యాబిషేకమయ్య కొండదేవరా

        నీకు మెండుగా జరిపిస్తాం కొండదేవరా         ||కొం||

     కొండవాడు మా అయ్యప్పా

    పల్లవి:     కొండవాడు మా అయ్యప్పా

        జాలి గుండె వాడు మా అయ్యప్పా

        ఓహో హో అయ్యప్పా శరణమో అయ్యప్పా  ..2..    ||కొం||

      నీలాల నింగిలోన చుక్కల్లో చందురుడు

        నీలగిరి కొండల్లో కొలువుతీరి ఉన్నావు

        నీలకంఠుని పుత్రుడు అయ్యప్ప

        మణికంఠ నామదేయుడు         ఓహో..    ||కొం||

       రాగాలేమాకురావు తాళాలు మాకు లేవు

        అరుపులే మా పిలుపులు అయ్యప్ప

        శరణాలే మేలుకొలుపులు         ఓహో…    ||కొం||

       పెద్దదారిలోన నడిచి వెళ్ళుతుంటే – చిన్నదారిలోన నడచి వెళ్ళుతుంటే

        దారిలోన కనిపిస్తాడు అయ్యప్ప శరణాలే పలికిస్తాడు  ఓహో..  ||కొం||

    అయ్యప్ప స్వామినీ చూడాలంటే  

    అయ్యప్ప స్వామినీ చూడాలంటే కొండకు వెళ్ళాలి

    అయ్యప్ప స్వామినీ చూడలంటే కొండలకు వెళ్ళాలి

    శబరి కొండకు వెళ్ళాలి     ||స్వామి||

    స్వామి శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప

    కార్తీకమాసమున మాలలు వేసి పూజలు చేయాలి    ||స్వామి||

    యిరుముడికట్టి శరణము చెప్పి యాత్రకు వెళ్ళాలి

    శబరి యత్రకు వెళ్ళాలి     ||స్వామి||

    ఎరుమేలి వెళ్ళి వేషాలు వేసి పేట ఆడాలి

    పేటైసుల్లి ఆడాలి     ||స్వామి||

    ఆలుదానదిలో స్నానం చేసి రాళ్ళను తీయాలి

    రెండు రాళ్ళను తీయాలి     ||స్వామి||

    పంపానదిలో స్నానము చేసి పావనమవ్వాలి

    మనము పావనము అవ్వాలి

     కనివిని ఎరుగుని ఘనయోగం

    కనివిని ఎరుగని ఘనయోగం జగము ఎరుగని జపమంత్రం

    ఇంద్రియములచే తలవంచి ఇరుముడినే తలదాల్చి

    స్వామి శరణం అయ్యప్ప అని సాగే భక్తుల సందోహం

     శ్రీతల స్నానం తొలి నియమం భూతల శయనం మలినియమం

        ఏకభుక్తమే తింటూ నీకు అర్పణం అంటూ

        ఐహిక భోగం విడిచేది ఐహిక భోగం మరిచేది

        భక్తి ప్రపత్తులు దాటేది శరణమని చాటేది

      అపితాహార్యం ఒక నియమం

        సంస్క ృతిక వర్గవమొక నియమం

        అంగదక్షిణే ఇస్తూ ఆత్మదర్శనం చేస్తూ

        మమకారములను విడిచేది మదమత్సరములు త్రుంచేది

        కర్మేఫలముగా తలచేది తత్‌త్వమ్‌ అని తెలిచేది.

    జిందగీమే ఏకబార్‌ శబరియాత్ర

    పల్లవి: జిందగీమే ఏక్‌బార్‌ శబరియాత్ర ఛలో ఛలో

        హరిహరపుత్ర అయ్యప్పకో దర్శన్‌ కర్‌కే ఆవో

        స్వామియే శరణం అయ్యప్ప స్వామియే

        శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప     ||జిం||

    జీవన్‌తో కుచ్‌ బఢానహీ ఉస్‌కా ఛోటాతోపాహై

    ఉస్‌కా బేకార్‌ మత్‌ కరో భక్తి, భజన్‌ సే ధ్యాన్‌ కరో     ||జిం||

    పాప్‌ సబ్‌ కుచ్‌ మిట్‌ జాతా హై పంపా నదిమే స్నాన్‌ కరో

    జ్యోతి స్వరూప్‌కో దర్శన్‌ కో జీవన్‌ ముక్తి మిల్‌తీహై

    తుఝె జీవన్‌ ముక్తి హోతా హై             ||జిం||

    రాజా రాజా పందల రాజ

    రాజా రాజా పందల రాజ – నీవు పంబానది తీరాన కీర్తించేవు  ||2||

    శరణం అయ్యప్పా శరణం స్వామి – స్వామీ అయ్యప్పా శరణం స్వామి

    అన్నదాన ప్రభువా శరణం స్వామి – పొన్నంబలవాసా శరణం స్వామి

    అలుద పంబ జలములోన తీపివి నీవే

    అడవిలోని జీవాల ఆటవు నీవే

    బంగారు కొండపైన వేదము నీవే

    పంచగిరులు ధ్వనియించే నాధము నీవే         ||శరణం అయ్యప్పా||

    భూతదయను బోధించిన కరుణామూర్తి

    భూతనాధ సదానంద శాంతమూర్తి

    ఇంద్రియములు జయించినా సుందరమూర్తి

    ఇరుముడులను కడతేర్చే దివ్యమూర్తి         ||శరణం అయ్యప్పా||

    వావరున్ని వాల్మీకిగ మలచినావయా

    వనములోన ఘనముగా నిలిచినావయా

    గురుపుత్రుని కరుణించే శ్రీ గురునాధా

    మా కన్నియు సమస్త నీవే కాదా         ||శరణం అయ్యప్పా||

    తల్లిదండ్రుల పూజించే నీ భావనలూ

    గురువులు గౌరవించు నీ సేవలూ

    కలియుగమును రక్షించే అభయ హస్తమూ

    ఓ తండ్రి నీవేలే మా సమస్తమూ         ||శరణం అయ్యప్పా||

    అమితానందం పరమానందం

    అమితానందం పరమానందం అయ్యప్పా

    నీ రూపం చూసిన పాపం తొలగును అయ్యప్పా

    అయ్యప్పా స్వామి అయ్యప్పా – అయ్యప్పా శరణం అయ్యప్పా ||అమితానందం||

    హరియే మోహిని రూపం

    హరయే మోహన రూపం

    హరిహర సంగం అయ్యప్ప జననం

    ముద్దులొలుకు సౌందర్యం             ||అమితానందం||

    నీవు పుట్టుట పంబా తీరము

    నీవు పెరుగుట పందళ రాజ్యము

    నీ కంఠమందు మణిహారం

    మణికంఠా నీ నామం

    పులిపాల్‌ కడవికి ప్రయాణం

    మదిలో మహిషి సంహారం

    ఇంద్రుడే  వన్‌పులి వాహనం

    ఇచ్చెను శబరికి మోక్షము             ||అమితానందం||

    ఇరుముడి నీకభిషేకం

    పదునెట్టాంబడి ప్రదాయము

    మకర సంక్రమణ సంధ్యా సమయం

    మకరజ్యోతియే సత్యరూపము             ||అమితానందం||

    శాస్త్రా సన్నిధిలో అభిషేకం

    శాస్త్రా సన్నిధిలో అభిషేకం ధర్మశాస్తా సన్నిధిలో అభిషేకం

    ఆవుపాలు తెచ్చినాము అయ్యప్పా-నీకు పాలాభిషేకం అయ్యప్పా      ||శాస్తా||     

    అవు నెయ్యి తెచ్చినాము అయ్యప్పా-నీకు నెయ్యాభిషేకం అయ్యప్పా  ||శాస్తా||  

    పుట్టతేనె తెచ్చినాము అయ్యప్పా-నీకు తెనాబిషేకం అయ్యప్పా      ||శాస్తా||

    చందనము తెచ్చినాము అయ్యప్పా-నీకు చందనాభిషేకం అయ్యప్పా ||శాస్తా||    

    విభూధి తెచ్చినాము అయ్యప్పా-నీకు భష్మాభిషేకం అయ్యప్పా       ||శాస్తా||    

    లిల్లిపూలు తెచ్చినాము అయ్యప్పా-నీకు పూలాభిషేకం అయ్యప్పా      ||శాస్తా||

    కర్పూరం తెచ్చినాము అయ్యప్పా-నీకు కర్పూర హారతులు అయ్యప్పా   ||శాస్తా||    

    గురుస్వామి గురుస్వామి

    గురుస్వామి గురుస్వామి – నీకు కోటి కోటి దండాలు గురుస్వామి

    నీతోడులేనిదే గురుస్వామి, మేము శబరియాత్ర చేయలేము గురుస్వామి  ||గు||

    కార్తీకమాసమున మాలనే వేస్తావు శరణుఘోష మంత్రము నేర్పిస్తావు

    అడవిలోన స్వాములకు కష్టము వస్తే అండగా నిలిచి ఆదరిస్తావు         ||గు||

    నీవెంటవచ్చే స్వాములకు గురుస్వామి తీసుకొని వెడతావు గురుస్వామి

    నీతోడు లేనిదే గురుస్వామి ఇరుముడిని కట్టలేము గురుస్వామి         ||గు||

    గురువులేని విద్య విద్యకాదు గురువులేని యాత్ర శబరియత్రకాదు

    నీ అనుగ్రహము లేనిదే గురుస్వామి అయ్యప్ప దర్శనము కలగదులే గురుస్వామి  ||గురు||

    వీల్లాలి వీల్లాలి వీల్లాలి వీల్లాలే

    వీల్లాలి వీల్లాలి వీల్లాలి వీల్లాలే

    వీల్లాలి వీరనే వీరమణిగండనే

    రాజాది రాజనే రాజకుమారనే

    స్వామియే – అయ్యప్పో – శరణమో అయ్యప్పో     ||వీల్లాలి||

    ఎరుమేలి చేరినాము – పేటతుల్లి ఆడినాము

    వావరుని చూసినాము – వందనాలే చేసినాము

    మణికంఠునితో మేము పెద్దదారి నడిచినాము

    పాదయాత్ర ఆరంభం – శరణఘోష ప్రారంభం     ||వీల్లాలి||

    అక్కడక్కడాగినాము – ఆళందాకు చేరినాము

    ఆళుదాలో స్నామాడి – రెండు రాళ్ళు తీసినాము

    కఠిన కఠినముకొంటు – కరిమల ఎక్కినాము

    ఫరజ్యాసలేదమ – పరమాత్మ నీవయ్య

    స్వామియే అయ్యప్పా – శరణమో అయ్యప్పో     ||వీల్లాలి||

    శరణఘోష చెప్పుచు – పంపాకు చేరినాము

    పంపాలో స్నానమాడి – పాపాలను వదలినాము

    శరంగుత్తి చేరినాము – శరణములు గుచ్చినాము

    సన్నిధానం చేరినాము – పద్దెనిమిది మెట్లు ఎక్కినాము

    అయ్యప్పను చూసినాము – ఆనందం పొందినాము

    మరో జ్యాస లేదయ్యా – పరమాత్మ నీవయ్యా

    స్వామియే అయ్యప్పో – శరణమొ అయ్యప్పో     ||వీల్లాలి||

    స్వామియే శరణం శరణమయ్యప్పా

    స్వామియే శరణం శరణమయ్యప్పా

    శరణం శరణం స్వామి అయ్యప్పా

    అమ్మవారు ఉండేది వైకుంఠం – అయ్యవారు ఉండేది కైలాసం

    అన్నగారు ఉండేది ఫళనిమలా – మన స్వామి వారు ఉండేది శబరిమలా ||స్వామి||

    హరిహర అంటారు అమ్మవారి – హరిహర అంటారు అయ్యవారిని

    హరోంహర అంటారు అన్నగారిని – శరణశరణమంటారు స్వామివారిని ||స్వామి||

    గరుడ వాహనం అమ్మవారిది – వృషభ వాహనం అయ్యవారిది

    పచ్చనెమలి వాహనం అన్నగారిది – వన్‌పులి వాహనం స్వామి వారిది  ||స్వామి||

    శ్రీ చక్రధారియే అమ్మవారి – త్రిశూల ధారియే అయ్యవారు

    వేలాయుధ పాణివే అన్నగారూ – అభయ హస్తుడే స్వామివారు     ||స్వామి||

    పళ్ళింకట్టు శబరిమలక్కు కల్లుం ముల్లుం

    పళ్ళింకట్టు – శబరిమలక్కు ఇరుముడికట్టు – శబరిమలక్కు

    కట్టుంకట్టి – శబరిమలక్కు కల్లుం ముల్లుం – కాలికిమెత్తి

    పళ్ళింకట్టు శబరిమలక్కు – కల్లుముల్లుం కాలికిమెతై

    స్వామియే అయ్యప్పో, అయ్యప్పో స్వామియే              ||పళ్ళింకట్టు||

    అఖిలాండేశ్వరి అయ్యప్పా – అఖిలచరాచర అయ్యప్పా

    హరవోం గురువోం అయ్యప్పా – అశ్రిత వత్సల అయ్యప్పా

    స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే              ||పళ్ళింకట్టు||

    నెయ్యభిషేకం స్వామిక్కే – కర్పూరదీపం స్వామికే

    భస్మాభిషేకం స్వామిక్కే – పాలభిషేకం స్వామికే

    స్వామియే అయ్యప్పో అయ్యప్పో అయ్యప్పో స్వామియే   ||పళ్ళింకట్టు||

    దేహబలందా అయ్యప్పా – పాదబలందా అయ్యప్ప

    నినుతిరు సన్నిధి అయ్యప్పా – చేరేదమయ్యా అయ్యప్పా

    స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే             ||పళ్ళింకట్టు||  

    తేనభిషేకం స్వామిక్కే – చందనభిషేకం స్వామిక్కే

    పెరుగభిషేకం స్వామిక్కే – పూలభిషేకం స్వామిక్కే

    స్వామియే అయ్యప్పో, అయ్యప్పో స్వామియే           ||పళ్ళింకట్టు||  

    ఉయ్యాల ఊగుచున్నారు

    1.    ఉయ్యాల ఊగుచున్నారు, అయ్యప్పస్వామి ఉయ్యాల ఊగుచున్నారు  బంగారు ఉయ్యాల ఊగుచున్నారు

    2.    కొండకు కొండ మధ్య మళయాళదేశమయ్యా

        మళయాళదేశం విడిచి ఆడుకొనుచురావయ్యా

    3.    విల్లాలివీరుడే నీలమణికంఠుడే

        రాజుకురాజువే పులిపాలు తెచ్చినావే

    4.    పంబలో బాలుడే పందళరాజుడే

        కుమారస్వామి తమ్ముడే వావర్‌స్వామి మిత్రుడే

    5.    ఎలిమేలిశాస్తావే, అందరికీ దేవుడే

        ముడుపుల ప్రియుడే, శివునికి బాలుడే

    6.    కలియుగవరదుడే, కాంతిమలజ్యోతియే

        కారుణ్యశీలుడే కరుణించే దేవుడే

    నేను నిజమైతే నా స్వామ నిజమౌనా

    నేనే నిజమైతే నా స్వామి నిజమౌనా

    నా ఆత్మ నిజమైతే పరమాత్మ నీవేగా                ||నేను నిజమైతే||

    ఆవువంటివాడు నేనైతే – పాలవంటివాడు నా స్వామియే

    ఆవుకు రంగులు ఉన్నవిగాని – పాలకు రంగులు లేవుగా ||నేను నిజమైతే||

    జాతివంటివాడు నేనైతే – నీతివంటివాడు నా స్వామియే

    జాతికి కులములు ఉన్నవిగాని – నీతికి జాతులు లేవుగా ||నేను నిజమైతే||

    పూలవంటివాడు నేనైతే – పూజవంటివాడు నా స్వామియే

    పూలకు రంగులు ఉన్నవిగాని – పూజకు రంగులు లేవుగా ||నేను నిజమైతే||

    చెరుకువంటివాడు నేనైతే – తీపివంటివాడు నా స్వామియే

    చెరుకుకు గనుపులు ఉన్నవిగాని – తీపికి గనుపులు లేవుగా     ||నేను నిజమైతే||

    ఏరువంటివాడు నేనైతే – నీరువంటివాడు నా స్వామియే

    ఏరుకు వంపులు ఉన్నవిగాని – నీరుకు వంపులు లేవుగా     ||నేను నిజమైతే||

    భజనవంటివాడు నేనైతే – భక్తివంటివాడు నా స్వామియే

    భజనకు వంతులు ఉన్నవిగాని – భక్తికి వంతులు లేవుగా     ||నేను నిజమైతే||

    కామాక్షి సుప్రజా స్వామి అయ్యప్పా

    కామాక్షి సుప్రజా స్వామి అయ్యప్పా

    భక్తా మనోహరా శరణమయ్యప్పా

    దీన దయాలో పరిపూర్ణ కృపాలో

    జైజై శంకర బాలా జయస్వామి అయ్యప్పా     || కామాక్షి సుప్రజా||

    హరేరామ హరేరామ స్వామి అయ్యప్పా

    హరేకృష్ణ హరేకృష్ణ శరణమయ్యప్పా

    దీనదయాలో పరిపూర్ణ కృపాలో

    జైజై శంకర బాలా జయ స్వామి అయ్యప్పా     || కామాక్షి సుప్రజా ||

    శంభో శంకర శంభో శంకర స్వామి అయ్యప్ప

    హరోంహరా హరోంహరా శరణమయ్యప్పా

    దీనదయాలో పరిపూర్ణ కృపాలో

    జైజై శంకర బాలాజయస్వామి అయ్యప్పా     ||క్షామాక్షి సుప్రజా||

    పంబా వాసా పందళరాజ స్వామి అయ్యప్పా

    గౌరీపుత్రా కోమల రూప శరణమయ్యప్పా

    దీనదయాలో పరిపూర్ణ కృపాలో

    జైజై శంకర బాలా జయ స్వామి అయ్యప్పా     ||క్షామాక్షి సుప్రజా||

    అన్నదాన ప్రభువే శరణం అయ్యప్పా

    అన్నదాన ప్రభువే శరణం అయ్యప్పా

    అరియాంగవు అయ్యావే శరణమయ్యప్పా    ||అన్న||  

    శరణమయ్యప్పా స్వామి శరణమయ్యప్పా     ||శ||

    ఏరుమేలి వాసుడవే శరణమయ్యప్పా

    ఏకస్వరూపుడవే శరణమయ్యప్పా    ||2||

    కరిమల వాసుడవే శరణమయ్యప్పా

    కలియుగ వరదుడవే శరణమయ్యప్పా     ||2|| ||అ||

    అలుదాని వాసుడే – శరణమయ్యప్ప

    ఆదరించు దేవుడవే శరణమయ్యప్ప    ||2||

    పంబా నివాసుడవే శరణమయ్యప్ప

    పందలారాజవే శరణమయ్యప్ప     ||అన్న||

    నీలిమలై వాసుడవే శరణమయ్యప్పా

    నిత్యబ్రహ్మచారివే శరణమయ్యప్పా     ||2||

    కాంతమలై ఈశుడవే శరణమయ్యప్పా

    జ్యోతి స్వరూపడవే శరణమయ్యప్పా    ||2||

    https://www.youtube.com/watch?v=VSLjZu5JA8M

    గల గల గజ్జలు కట్టి నా అయ్యప్ప స్వామి

    గల గల గజ్జలు కట్టి నా అయ్యప్ప స్వామి     ||2||

    ఆడుకుందాము రావా నా అయ్యప్ప స్వామి

    పాడుకుందాము రావా నా అయ్యప్ప స్వామి

    హరిహర తనయుడా అందాల బాలుడా

    గలగల గలగల గలగల

    గలగల గజ్జలు కట్టినా అయ్యప్ప స్వామి         ||2||

    విల్లాలి వీరుడవయ్యా నా అయ్యప్ప స్వామి

    వీరమణికంఠుడవయ్యా నా అయ్యప్ప స్వామి

    మోహన రూపుడవయ్యా నా అయ్యప్ప స్వామి

    మోహినీ బాలుడవయ్యా నా అయ్యప్ప స్వామి

    హరిహర తనయుడా అందాల బాలుడా

    గలగల గలగల గలగల             ||గలగల||       ||2||

    పంపా బాలుడవయ్యా నా అయ్యప్ప స్వామి

    పందల రాజునువయ్యా నా అయ్యప్ప స్వామి

    నీలిమల వాసుడవయ్యా నా అయ్యప్ప స్వామి  

    నిత్య బ్రహ్మచారుడవయ్యా నా అయ్యప్ప స్వామి

    హరిహర తనయుడా అందాల బాలుడా

    గలగల గలగల గలగల

    గలగలగల గజ్జలు కట్టి నా అయ్యప్ప స్వామి     ||2||

    ఈ పూజలు నీకేనయ్య నా అయ్యప్ప స్వామి

    ఈ భజనలు నీకేనయ్యా నా అయ్యప్ప స్వామి

    పడిపూజలు నీకే నయ్యా నా అయ్యప్ప స్వామి

    జ్యోతి స్వరూపుడవయ్యా నా అయ్యప్ప స్వామి

    హరి హర తనయుడా అందాల బాలుడా

    గలగల గలగల గలగల

    గలగలగల గజ్జలు కట్టి నా అయ్యప్ప స్వామి    ||2||

    ఆడుకుందామురావా నా అయ్యప్ప స్వామి

    పాడుకుందాము రావా నా అయ్యప్ప స్వామి

    హరిహర తనయుడా అందాల బాలుడా

    గలగల గలగల గలగల

    గలగలగల గజ్జలు కట్టి నా అయ్యప్ప స్వామి    ||2||

     శరణం శరణం అయ్యప్పా

    శో||     శరణం శరణం అయ్యప్పా – స్వామి యే శరణం అయ్యప్పా

        శబరిగిరీశ అయ్యప్పా స్వామి యే శరణం అయ్యప్పా        శర||

       సత్యము జ్యోతి వెలుగునయ – నిత్యము దానిని చూడుమయా

        పరుగున మీరురారయ్య – శబరిగిరికి పోవుదుము           శర||

     హరి హర మానస సుతులైన – సురలా మొరలను ఆలకించి

        ధరణిలో తాను జన్మించి – పదునాల్గేళ్ళు నివశించి           శర||

     ఘోర అడవిలో బాలునిగా – సర్పము నీడలో పవళించి     

        వేటకు వచ్చిన రాజునకు – పసిబాలునిగా కనిపింప          శర||

    మణికంఠ అను  నామముతో – పెంచిరి రాజులు మురిపెముగా

        స్వామి మహిమతో రాజునకు-కలిగెను సుతుడు మరియొకడు శర||

    గరువాసములో చదివింప – గురుపుత్రుని దీవింప

        మాటలు రానీ బాలునకు మాటలు వచ్చెను మహిమలతో      శర||

    మాతాపితలను సేవించి – మహిషిని ఆను వధియించి

        శబరిగిరిలో వెలసిరాగా  – మనలను ధన్యుల చేయుటకు     శర||

    అయ్యప్పా అను నామముతో – శిలారూపమున తానున్నా

        జ్యోతి స్వరూప మహిమలతో – భక్తుల కోర్కేలు తీర్తురయ     శర||

    మార్గశిరాన మొదలెట్టి – నలుబది దినములు దీక్షతో

        శరణను భజనలు చేయుచు – ఇరుముడి కట్టి పయనింప     శర||

     భోగికి ముందు చేరాలి – పంబలో స్నానం చేయాలి

        పదునెట్టాంబడి ఎక్కాలి – స్వామిని మనమూ చూడాలి        శర||

     మకర సంక్రాతి దినమున – సాయం సమయం వేళలో

        సర్వం వదలిన సత్పురుషులకు – జ్యోతి దర్శనం మిచ్చునయా  శర||

       మకర జ్యోతిని చూడాలి – తిరువాభరణం చూడాలి

        చాలు చాలు మనికింక – వలదు వలదు ఇక మరు జన్మ     శర||

      నెయ్యభిషేకం స్వామికే – తేనాబిషేకం స్వామిక్కే

        చందనాభిషేకం స్వామిక్కే – పూలాభిషేకం స్వామిక్కే         శర||

    కూర్పరహరతీ తనకెంతో – పాయసమంటే మరియెంతో

        శరణన్న పదములు ఎంతెంతో – యిష్టం యిష్టం స్వామికే     శర||

    హరిహరాసనం స్వామిది – సుందర రూపం స్వామిది

        కన్నుల పండుగ మనదేలే – జన్మ తరించుట మనకేలే     శర||

     శరణం శరణం అయ్యప్పా – శరణం శరణం శరణమయా

        శరణం శరణం మాస్వామి – దరికి చేర్చుకో మాస్వామీ     శర||  

     కొబ్బరికాయలు అయ్యప్పకే

    కొబ్బరికాయలు అయ్యప్పకే

    కోటి పూజలు అయ్యప్పకే అయ్యప్పకే     ||2||

    శబరిమలై మా అయ్యప్పా అయ్యప్పా

    నీకు శరణం శరణం అయ్యప్పా అయ్యప్పా     ||2||

    ఇరుముడి కట్టుకొని అయ్యప్పో, అయ్యప్పా     ||2||

    మేము నీ కొండ కొస్తమయ్యా అయ్యప్పా, అయ్యప్పా     ||2||

    ఏరుమేలి కాడ అయ్యప్పా, అయ్యప్పా     ||2||

    మేము పేటతుళ్లై ఆడుతాము అయ్యప్పా     ||2||

    ఐదు కొండలు దాటి అయ్యప్పా, అయ్యప్పా

    మేము తానాలు చేస్తమయ్య అయ్యప్ప అయ్యప్ప

    పందళ రాజడవు అయ్యప్పా, అయ్యప్పా

    మా పాపాలు తొలగించు అయ్యప్పా అయ్యప్పా

    కన్నెమాల గణపతికి అయ్యప్పో అయ్యప్పో

    మేము టెంకాయ కొడుతమయ్య అయ్యప్పో అయ్యప్పో    ||కొ||

    పద్దెంది మెట్లెక్కి అయ్యప్ప అయ్యప్పా

    మేము పరవశించి పోతాము అయ్యప్పా అయ్యప్పా

    నెయ్యాభిషేకాలు అయ్యప్పో అయ్యప్పో

    నీకు ఘనముగ చేత్తమయ్య అయ్యప్పో అయ్యప్పా

    మకర సంక్రాంతి నాడు అయ్యప్పా, అయ్యప్పా

    నీ జ్యోతి రూపము చూపుమయ్య అయ్యప్పా అయ్యప్పా     ||కొ||

    ఎక్కడ చూసిన నీవే అయ్యప్పా

    ఎక్కడ చూసినా నీవే అయ్యప్పా సర్వంతర్యామీ నీవే అయ్యప్పా

    స్వామి ఎక్కడచూసినా నీవే అయ్యప్పా సర్వంతర్యామీ నీవే అయ్యప్పా

    చిగురాకులలో పువ్వులలో నీవే అయ్యప్పా

    పసిపాపలోన వృద్దులలోనా నీవే అయ్యప్పా     || స్వామి ఎక్కడ||

    గళగళపారే సెలయేరులలో నీవే అయ్యప్పా

    గగనానగిరి పకక్షులలోన నీవే అయ్యప్పా         || స్వామి ఎక్కడ||

    ఢమఢమ ఢమఢమ ఢమరుక్కనిలో నీవే అయ్యప్పా

    ఘణఘణ ఘణఘణ ఘంటానాధం నీవే అయ్యప్పా|| స్వామి ఎక్కడ||

    నింగి నేల శూన్యములో నీవే అయ్యప్పా

    నీతి జాతి మానవ జాతి నీవే అయ్యప్పా         || స్వామి ఎక్కడ||

    కన్నె స్వాములలో కత్తిస్వాములలో నీవే అయ్యప్పా

    గంట స్వాములలో గధాస్వాములలో నీవే అయ్యప్పా

    గురుస్వాములలో మణికంఠులలో నీవే అయ్యప్పా     || స్వామి ఎక్కడ||

    సంతసంబు సంతసంబు సంతసంబహో

    సంతసంబు సంతసంబు సంతసంబహో

    శబరిమలై యాత్రచేయ సంతసంబహో

    కార్తికేయ మాసమందు కఠిన నిష్ఠతో

    కంఠమాల వేసుకొనగ కలుగు సంతసం     ||సంత||

    శరణుఘోషవేడుగొనుచు శబరిమలై కేగగా

    ఇరుముడి దాల్చివేగ ఎరిమేలి చేరగా     ||సంత||

    ఆటవిక వేషమంది ఆడిపాడగా

    దివ్యమైన పంబనదిని తీర్ధమాడగా     ||సంత||

    శబరిపీఠమందు చేరి శరము గ్రుచ్చగా

    పదెనెట్టాంబడి నెక్కుచు పరవశించగా     ||సంత||   

    కన్నెస్వామి ఓ కన్నెస్వామి

    కన్నెస్వామి ఓ కన్నెస్వామి

    వేయికనులు చాలవులే – మన అయ్యప్పనూచూడ

    ఇరుముడిని కట్టుకొని – మనం ఎరిమేలి పోదాము

    వేషాలే వేద్దామా – పేటతల్లై ఆడుదాము

    కొబ్బరికాయ ఒకటికొట్టి – ఓవరుని మ్రొక్కుదాము   ||కన్నెస్వామి||

    ఆలుదాకు చేరుకుని – స్నానాలే చేద్దాము

    పంబాకు చేరుకుని – స్నానాలు చేద్దాము

    కొబ్బరికాయ ఒకటి కొట్టి – గణపతిని మ్రొక్కుదాము

    శరంగుత్తి చేరుకుని – శరణాలు గ్రుచ్చుదాము    ||కన్నెస్వామి||

    కొబ్బరికాయ ఒకటికొట్టి – పద్దెనిమిది మెట్లెక్కి

    పరవశం పొందుదాము – నెయ్యాభిషేకమును

    ఘనముగా చేద్దాము – సంక్రాంతి రోజున – జ్యోతినే చూద్దాము

    హారతినే ఇద్దాము – శరణమంటు వేడుదాము     ||కన్నెస్వామి||  

    అయ్యా అని పిలిచినా

    అయ్యా అని పిలిచినా అప్పా అని కొలిచినా

    అభయమిచ్చి బ్రోచేది అయ్యప్పయే అండగా నిలిచేది ఆ తండ్రియే  ||అయ్యా||

    శివకేశవ రూపమైన మోహిని పుత్రుని

    పంబానది తీరాన వెలసిన బాలుని     ||అయ్యా||

    పులిపాలను తెచ్చిన పొన్నంబల వాసుని

    తల్లి మనసు మార్చిన శబరిగిరి నాధుని     ||అయ్యా||

    మంజుమాత వలచిన మోహనరూపున

    కాంతమల జ్యోతిగా వెలుగొందు స్వామిని     ||అయ్యా||

    అజ్ఞానపు పొరలను తొలిగించే దేవుని

    అందరినీ ప్రేమ మీర కరుణించే మూర్తివి     ||అయ్యా||

     ఈశ్వర నిలయం కైలాసం

    ఈశ్వర నిలయం కైలాసం – కేశవ నిలయం వైకుంఠం

    ఈశ్వర కేశవ ప్రియనందనుని సన్నిధానమే శబరిమల     ||ఈశ్వర||

    ఆరుముఖముల దేవుడు అయ్యప్ప స్వామికి సహజుడు

    సహజుడున్నది పళనిమల తానువున్నది శబరిమల

    కడుపావనం ఇల శబరిమల

    శబరిమలకే శోభనమూర్తి భక్త స్వాంతముల చిరస్ఫూర్తి

    శరణం కోరిన తరుణ జలజమై శుభములు కురిసే మణిమూర్తి

    జీవము నొసగే జ్యోతిర్మూర్తి     ||ఈశ్వర||

    రావా అయ్యప్ప స్వామి రవ్వల పందిళ్లలోకి

    రావా అయ్యప్ప స్వామి రవ్వల పందిళ్లలోకి

    రావా అయ్యప్ప స్వామి రవ్వల పందిళ్లలోకి

    రావా అయ్యప్ప స్వామి రవ్వల పందిళ్లలోకి

    రావా అయ్యప్ప స్వామి రవ్వల పందిళ్లలోకి

    రవ్వల పందిళ్లలోన ముత్యాల ముగ్గులేసి

    రవ్వల పందిళ్లలోన ముత్యాల ముగ్గులేసి

    ముత్యాల ముగ్గులోన రతనాల రాసిపోసి

    ముత్యాల ముగ్గులోన రతనాల రాసిపోసి

    రతనాల రాసిపైన పీటలే వేసినాము

    రతనాల రాసిపైన పీటలే వేసినాము

    రావా.. రావా.. రావా.. రావా.. రావా.. రావా..

    రావా అయ్యప్ప స్వామి రవ్వల పందిళ్లలోకి

    రావా అయ్యప్ప స్వామి రవ్వల పందిళ్లలోకి

    రావా అయ్యప్ప స్వామి రవ్వల పందిళ్లలోకి

    రావా అయ్యప్ప స్వామి రవ్వల పందిళ్లలోకి

    అరటిచెట్లు తెచ్చినాము మండపాలు కట్టినాము

    అరటిచెట్లు తెచ్చినాము మండపాలు కట్టినాము

    మల్లెపూలు తేచినాము మాలలే కట్టినాము

    మల్లెపూలు తేచినాము మాలలే కట్టినాము

    కొబ్బరి ఆకులు తేచినాము తోరణాలు కట్టినాము

    కొబ్బరి ఆకులు తేచినాము తోరణాలు కట్టినాము

    రావా.. రావా.. రావా.. రావా.. రావా.. రావా..

    రావా అయ్యప్ప స్వామి రవ్వల పందిళ్లలోకి

    రావా అయ్యప్ప స్వామి రవ్వల పందిళ్లలోకి

    రావా అయ్యప్ప స్వామి రవ్వల పందిళ్లలోకి

    రావా అయ్యప్ప స్వామి రవ్వల పందిళ్లలోకి

    మేళతాళాల తోటి భజనలే చేసినాము

    మేళతాళాల తోటి భజనలే చేసినాము

    ఆవునెయ్యి తోటి మేము దీపాలు పెట్టినాము

    ఆవునెయ్యి తోటి మేము దీపాలు పెట్టినాము

    పంచామృతముల తోటి అభిషేకం చేసినాము

    పంచామృతముల తోటి అభిషేకం చేసినాము

    రావా.. రావా.. రావా.. రావా.. రావా.. రావా..

    రావా అయ్యప్ప స్వామి రవ్వల పందిళ్లలోకి

    రావా అయ్యప్ప స్వామి రవ్వల పందిళ్లలోకి

    రావా అయ్యప్ప స్వామి రవ్వల పందిళ్లలోకి

    రావా అయ్యప్ప స్వామి రవ్వల పందిళ్లలోకి

    మంత్రతంత్రాల తోటి పూజలే చేస్తాము

    మంత్రతంత్రాల తోటి పూజలే చేస్తాము

    పాలు పండ్లు తేచినాము నైవేద్యం పెట్టినాము

    పాలు పండ్లు తేచినాము నైవేద్యం పెట్టినాము

    కర్పూరం వెలిగించి హారతులే ఇష్టము

    కర్పూరం వెలిగించి హారతులే ఇష్టము

    రావా.. రావా.. రావా.. రావా.. రావా.. రావా..

    రావా అయ్యప్ప స్వామి రవ్వల పందిళ్లలోకి

    రావా అయ్యప్ప స్వామి రవ్వల పందిళ్లలోకి

    రావా అయ్యప్ప స్వామి రవ్వల పందిళ్లలోకి

    రావా అయ్యప్ప స్వామి రవ్వల పందిళ్లలోకి

    రవ్వల పందిళ్లలోన ముత్యాల ముగ్గులేసి

    రవ్వల పందిళ్లలోన ముత్యాల ముగ్గులేసి

    ముత్యాల ముగ్గులోన రతనాల రాసిపోసి

    ముత్యాల ముగ్గులోన రతనాల రాసిపోసి

    రతనాల రాసిపైన పీటలే వేసినాము

    రతనాల రాసిపైన పీటలే వేసినాము

    రావా.. రావా.. రావా.. రావా.. రావా.. రావా..

    రావా అయ్యప్ప స్వామి రవ్వల పందిళ్లలోకి

    రావా అయ్యప్ప స్వామి రవ్వల పందిళ్లలోకి

    రావా అయ్యప్ప స్వామి రవ్వల పందిళ్లలోకి

    రావా అయ్యప్ప స్వామి రవ్వల పందిళ్లలోకి

    రావా అయ్యప్ప స్వామి రవ్వల పందిళ్లలోకి

    రావా అయ్యప్ప స్వామి రవ్వల పందిళ్లలోకి

    రావా అయ్యప్ప స్వామి రవ్వల పందిళ్లలోకి

    రావా అయ్యప్ప స్వామి రవ్వల పందిళ్లలోకి

    ఓం స్వామీ… శరణమయ్యప్ప

    https://www.youtube.com/watch?v=VKPoli9ao3A

    సుప్రభాతం స్వామి సుప్రభాతం

    సుప్రభాతం స్వామి సుప్రభాతం………… 2 సార్లు 

    మేలుకోవయ్య తూర్పు తెల్లవారే మేలుకో……… 2 సార్లు

    పూజకు వేళాయే స్వామి మేలుకో.  ||మేలుకో||

    మా మొరలాలించి మమ్మేలుకో సుప్రభాతం స్వామి సుప్రభాతం

    అష్టదిక్పాలురు నీ ఆజ్ఞకోసమే

    ఎదురుచూస్తున్నారు నీవు మేలుకో

    ||అష్టదిక్పాలురు||

    నా గొంతు పాడింది భూపాలం

    నిద్రలేవరా స్వామి నా కోసం స్వామి

    పంపానది నీ పాదాలు కడుగంగ

    ఆరాటపడుతోంది లేవయ్యా

    మా తొలి సంధ్య పూజలు గొనవయ్య

    ||సుప్రభాతం||

    కస్తూరి గంధాలు నీ కోసమేనయ్యా

    కావిళ్ళలలో నెయ్యి నీ కోసమే

    ||కస్తూరి||

    మా కళ్ళు వేచేను నీ కోసం 

    జగమంత వేచేను నీ కోసం స్వామి

    కనులార నీ రూపు దర్శించకుండిన ఈ కనులు మాకుండి ఫలమేమి

    నీ పేరు తలచిన భయమేమి మేలుకోవయ్యా..!

    స్వాగతం అయ్యప్పా… సుస్వాగతం అయ్యప్ప

    స్వాగతం అయ్యప్పా… సుస్వాగతం అయ్యప్పా  (2 )

    రతనాల పందిళ్ళలో ముత్యాల ముగ్గులు వేసి

    నిను పూజించే వేళాయె రా  స్వామి నీకు ఇదే మా ఆహ్వానము.

                                                                                  (స్వాగతం )

    పూలెన్నో తెచ్చాము నీ పూజకై

    నీకెంతో మనసాయే ఈ వేళలో  (2 )

    నీవున్నా ప్రతి ఇల్లు ఓ కోవెల  (2 )

    పంపించు సిరులన్ని మా ఇంటికి……….

                                                                               (స్వాగతం )

    నా పిలుపులే నీకు ఆహ్వానము

    నా హృదయమే నీకు సింహాసనం (2 )

    నా కనులనే జ్యోతులుగా చేసి (2 )

    హారతులు ఇచేము ఈ వేళలో…….

                                                                              (స్వాగతం)

    ఏనాడూ ఏ జన్మ ఏ పుణ్యమో

    ఈనాడే నీ నోము నే నోచితి   (2 )

    ఈ జగములో కలకాలము  (2 )

    ఉంటాము ఎప్పుడు నీ సేవలో

                                                                         (స్వాగతం)

    స్వాముల్లార మీరు రండి

    పల్లవి: స్వాముల్లార మీరు రండి భక్తుల్లార అందరు రండి

    1 కొండగట్టు క్షేత్రమునకు పాదయాత్ర 

    అంజన్న దర్శనంకు పాదయాత్ర

    ||స్వాము||

    2 వేములవాడ క్షేత్రమునకు పాదయాత్ర 

    రాజన్న దర్శనంకు పాదయాత్ర

    ||స్వాము||

    3 కోరుట్ల క్షేత్రమునకు పాదయాత్ర 

    ధర్మశాస్త్ర దర్శనంకు పాదయాత్ర

    ||స్వాము||

    శబరిమల క్షేత్రమునకు పాదయాత్ర 

    అయ్యప్ప దర్శనంకు పాదయాత్ర

    ||స్వాము||

    అహా ఏమని వర్ణించను

     పల్లవి: అహా ఏమని వర్ణించను అయ్యప్ప స్వామి మోహనరూపం ||2||

    పాల కడలినే మధనము చేయగ ॥ 

    అమృత కలశం పుట్టినదిరా ॥ 

    అమృత బాండము పంచగ శౌరి ॥ 

    మోహినిరూపం దాల్చినాడు రా॥ (ఆహా!)

    మోహిని రూపము మోహము రేపగ  ॥ 

    పరమేశ్వరుడే పూనినాడురా ॥ 

    హరిహర దేవుల పుణ్య ఫలముగా ॥ 

    అయ్యప్పస్వామి అవతరించేరా  (ఆహా!)

    గర్వ్వందురాలైన మహిషిని చంపి  ॥ 

    ప్రజాలనెల్ల కాపాడినాడురా ॥ 

    ‘బ్రమ్మచర్యమే దీక్షగభూమి ॥ 

    శబరిమాలై కి తరలి వెళ్లిరా (ఆహా!)

    పావనమగు ఆ పంబానదిలో 

    పాపాలను ప్రక్షాళన చేయగా .2.

    భక్త కోటికే ముక్తిని చూపగు .2 .

    జ్యోతి రూపుడై వెలసి నాడురా   (ఆహా!)

    ఇరుముడి దాంగి, వరుమన దాగి, గురువైనవే వందో

    ఇరువునై తీరూం, అంద యవనయుం వెల్లూం. ఉన్ తిరువడియై కానవందో…. పళ్ళికట్టు – శబరిమలక్కు కల్లుంముల్లుం కాలికి మెతై స్వామియే – అయ్యప్పో, స్వామి శరణం – అయ్యప్ప శరణం ॥2॥ పళికట్టు శబరిమలక్కు కల్లుంముల్లుం కాలికి మెతై – స్వామియే అయ్యపో అయ్యపో స్వామియే

    1. నెయ్యభిషేకం స్వామిక్కే కర్పూర దీపం స్వామిక్కే అయ్యప్ప మార్గళం కూరికొండెల్ అయ్యనివాడి సిండ్రెడువ, శబరిమలైక్కి సిండ్రెడువ స్వామియే అయ్యప్పో – అయ్యప్పో స్వామియే

    2. కార్తికమాదం మాలయనింది నేర్తియాగమే నిరతమిరింది పార్ధసారధి మైందలీ, ఉన్ పార్కవేండియే తవమిరుంది. ఇరుముడి ఎడుత్తి ఎరుమేలి వందు వరుమనదాగి పేటైతుళ్ళి అరుణైమందరం వావరు తొడివి. అయ్యని నరుమని ఎరిడివా – స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే 2

    3. అళుడై యాట్రం ఏరుంబోదు, హరిహర మగనై తురుచిలవార్ పడికాటిడవే వందిడువా, అయ్యన్ వన్ బులియేరి వందిడువా కరిమల యేట్రం కఠినం కఠినం, కరుణై కడలుం తుణైవరువా కరిమల ఇరక్కం బంధవుడనే, పెరినది పంబయి కండిడువా స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే

    4. గంగై నదిపోల్ పుణ్ణియ నదియం, పంబై నీరాడీ…… సంకరముగ కొంగెడువ. మన సంజలమిండ్రీ ఏరిడువా నీలిమలై ఏట్రం శివబాలను మేట్రిడువా…..??

    కాలమెలాన్ నమక్కే, అరు కావలన ఇరప్పా దేగబలందా పాదబలందా, తూక్కి విడప్పా – ఏట్రి విడప్పా దేగబలం ఎండ్రలవర్తం దేగతై కందిడువా, పాదబలందా ఎండ్రాలవర్తం పాదపి కందిడువా, నల్లపాదె కాట్రేడువా – స్వామియే అయ్యప్పో – అయ్యప్పో స్వామియే

    5. శబరిపీఠమే వందిడువా, శబరి అన్నయై వణందిడువా….. శరంగుత్తి ఆలీ కన్నిమార్గళి, శరత్తిణి కోత్తిళ్ వణంగిడువా, శబరిమలైంద నేరంగిడువా అంద పదినెట్టుబడిమీదు ఏరిడువా….. కదిఎండ్ర అవనై చొరనడైవా….. మదిముగం కండే మయంగిడువ, ఎన్న ఎనైతురికైలే తన్నయే…మరందిడువా పళ్ళికట్టు – శబరిమలక్కు కల్లుంముల్లుం కాలికి మెతై స్వామియే అయ్యపో స్వామి శరణం – అయ్యప్ప శరణం చరణం చరణం అయ్యప్ప – స్వామి చరణం అయ్యప్ప స్వామి చరణం – అయ్యప్పా..

    పంబ తీరం మణిహారంతో

    పంబ తీరం మణిహారంతో దొరికిన మణికంఠా 

    పందళ రాజుకు మణికంఠా ||పంబ||

    పరి పరి విధముల పిలిచేమయ్యా 

    రావా మణికంఠా 

    హరిహర తనయ మణికంఠా ||పంబ||

    నిత్య సత్యవో దేవా నీకు నీరాజనమయ్యా 

    దేవా నీరాజనమయ్యా ||2||

    నిర్మల రూపా నీలిమలేశా నిత్య నందమయ్యా 

    ||పంబ||

    ముల్లోకాలను మెప్పించిన ఓ దివ్యశక్తి మూర్తి ఓ దివ్యశక్తి మూర్తి ||కో||

    అండపిండ బ్రహ్మాండము నీవే కలియుగ వరదయ్యా

    ||పంబ||

    పంచగిరిశా ఓ శబరిశా స్వామి జగదీశా 

    ఓ స్వామి జగదీశా 

    ||కో||

    పరమదయళు  పతితపావన పూర్ణ నందమయ్యా ||పంబ||

    దశ దిశాంతాలలో… ఆ దిగాంతాలలో…

    భూ భువనాంతరాలలో… మన అంతరాలలో…

    ఎక్కడ చూసినా నీవే అయ్యప్ప 

    సర్వాంతర్యామి నీవే అయ్యప్ప 

    స్వామి శరణం అయ్యప్ప శరణం 

    శరణం శరణం అయ్యప్పా

    స్వామియే శరణం అయ్యప్పా 

                               “ఎక్కడ”

    చిగురాకులలో పూవులలో నీవే అయ్యప్పా 

    పసి పాపలలో వృద్ధులలో నీవే అయ్యప్పా 

    ప్రతిధ్వనించే పవిత్ర నామం నీవే అయ్యప్పా 

    ప్రజ్వరిల్లే స్వర్ణ రూపం నీవే అయ్యప్పా 

    నీలో నాలో నాలో నీలో 

    అన్నిటా అంతట అక్కడ ఇక్కడ 

                            ” ఎక్కడ “

    రివ్వు రివ్వున వీచే గాలిలో నీవే అయ్యప్పా 

    గల గల గల గల పారే నీటిలో నీవే అయ్యప్పా 

    గణ గణ గణ గణ మ్రోగే గంటలో నీవే అయ్యప్పా 

    డమ డమ లాడే డమరు ధ్వనిలో నీవే అయ్యప్పా 

    రాతిలో నాతిలో మానవ జాతిలో 

    సకల చరాచర జీవ రాశిలో 

                          “ఎక్కడ”

    గల పారే సెలయేరులలో నీవేన అయ్యప్ప.

    ఆ ఏటిలో ఉండే జీవ జలములో నీవేన అయ్యప్ప

    అండ పిండ బ్రహ్మాండ మంతయు నీ సృష్టేనయ్య

    నువ్వు లేని చోటు ఎక్కడా లేనే లేదయ్యా

    అభిషేకించే పాలల్లోన నువ్వేనయ్యప్ప. 

    ఆ పాలను ఇచ్చే గోవుల్లోన నువ్వేనయప్ప

    స్వామియే శరణం శరణం శరణం అయ్యప్ప 

    ఐదు కొండల దేవా మా దైవం నీవేగా (2) 

    కొండ కోనల నడుమ ఐదు కొండల పైన 

    శ్రీ శంభు విష్ణువుల తనయా నీవే శరణుఘోష ప్రియుడు 

    నా మొర ఆలకించి రావా

    స్వామియే శరణం శరణం శరణం అయ్యప్ప 

    స్వామియే శరణం శరణం శరణం అయ్యప్ప 

    ఐదు కొండల దేవా మా దైవం నీవేగా (2) 

    శబరిగిరి శిఖరాన పంబానది తీరాన 

    వెలసినవా మా  వేలుపుగా శశి పాలుకు తనయుడుగా 

    స్వామి శబరి గిరిషునిగా

    స్వామియే శరణం శరణం శరణం అయ్యప్ప 

    ఐదు కొండల దేవా మా దైవం నీవేగా (2) 

    కార్తీక మాసం నీకు బహు పుణ్య దినములే మాకు 

    నీ మాల వేసి మేము నియమనిష్టలతో నిన్ను కొలిచేము 

    స్వామి నిన్నే వెడేదము

    స్వామియే శరణం శరణం శరణం అయ్యప్ప 

    ఐదు కొండల దేవా మా దైవం నీవేగా (2) 

    కృష్ణవర్ణ వస్త్రముతో కృష్ణ తులసిమాలలతో 

    పదిలమైన మా మానస ముందు ప్రతిదినము 

    స్వామి నిన్నే వేడుకొందుమయ్య

    స్వామియే శరణం శరణం శరణం అయ్యప్ప 

    ఐదు కొండల దేవా మా దైవం నీవేగా (2) 

    మెట్టు మెట్టు కొక అర్థం భక్తులకు అది పరమార్థం

    తుది మెట్టున నీ రూపము చూసి మురిసిపోతిమ్మయ్య 

    మామది పరవశించేనయ్య

    స్వామియే శరణం శరణం శరణం అయ్యప్ప 

    ఐదు కొండల దేవా మా దైవం నీవేగా (2) 

    నాలుగు దిక్కులు నీకు పడ్నాలుగుభువనాలు 

    పడిమెట్లు గా మారినే మొఖి ఎక్కి తుదిమెట్టు గా మారే 

    స్వామి నీ రూపం స్వామి జగతికి దివ్య వరం

    స్వామియే శరణం శరణం శరణం అయ్యప్ప 

    ఐదు కొండల దేవా మా దైవం నీవేగా (2) 

    మకర సంక్రాంతి సంధ్యా సమయం జ్యోతి రూపముగా చూసి 

    మా దేహం ముందు ప్రతి అణువణువు స్వామి స్వామి అంటూ 

    నీ నామం   పలుకుతున్న మయ్య

    స్వామియే శరణం శరణం శరణం అయ్యప్ప 

    ఐదు కొండల దేవా మా దైవం నీవేగా (2) 

     రంగైనా రతనాల 

    పల్లవి: రంగైనా రతనాల అందమైన శబరిమల

    మము దయతో చూడగరావయ్యా శబరిగిరీ అయ్యప్పా

                                                              ||రంగైనా||

    నీవుండేది శబరిమలా! మేముండేది పాలమూరు

    మము దయతో చూడగరావయ్యా శబరిగిరీ అయ్యప్పా

                                                           ||రంగైనా||

    నీ తల్లీ మోహిని నీ తండ్రీ హరిహరుడు

    మము దయతో చూడగరావయ్యా శబరిగిరీ అయ్యప్పా

                                                           రంగైనా||

    కార్తీక మాసాన మళాలే వేసితిమి

    మండలాకాలంలో దీక్షాలే చేసితిమి

    మము దయతో చూడగరావయ్యా శబరిగిరీ అయ్యప్పా

                                                          ||రంగైనా||

    ఇరుముడులూ కట్టుకోని నెత్తిమీద పెట్టుకోని

    మేము గురుస్వామూల వెంబడీ వస్తున్నాము అయ్యప్పా

    మము దయతో చూడగరావయ్యా శబరిగిరీ అయ్యప్పా

                                                           ||రంగైనా

    గణ గణ గంటలు ఘనముగా మ్రోగంగ 

    గణ గణ గంటలు ఘనముగా మ్రోగంగ 

    అయ్యప్ప నీ అభిషేకము జరుగంగా

    కోటొక్క భక్తులు పాటలు వాడంగ

    అబ్బబ్బ శబరిమల ధగ ధగ మెరిసే ఆ కోవెల 

    మణికంట నీ క్షేత్రము జూడ ముచ్చటగా 

    మణికంట నీ రూపము కన్నుల విందంటా

    అల శబరీ శిఖరానా అంతెత్తు కొండల పైన 

    స్వర్ణ మందిర నిలయం అయ్యప్పా నీ దివ్య రూపం 

    చూసిన భాగ్యమటా నిన్ను కొలిచిన పుణ్య మటా

    అయ్యప్పా అభిషేక ప్రియ మా అయ్యప్పా 

    అయ్యప్పా అలంకార ప్రియ అయ్యప్పా 

    అద్భుత మహిమల వాడా మా ఆపద్భందువు నీవే 

    మహిషిని కూల్చిన వాడా మా మంచి మార్పువు నీవే 

    నీదు భక్తిలోనా  మాకు ముక్తి కలిగేనయా

    మణికంట మా భారము అంతా నీదంతా 

    మణికంట నువ్వు లేని నేను లేనంటా

    కుల మత భేదాలు లేక నీ మాలను వేసినమయ్య 

    సత్యము ధర్మమూ మాలో అణువణువున నిలిపిన మయ్యా 

    గుండె నిండా భక్తీ నింపి నీ గుడికొచ్చినము

    శత కోటి భక్తులు నీ శబరి చూడంగా 

    ఆనందం పరమానందం అయ్యే నయ్యా

    బరి కొండపై వెలిసిన అయ్యప్పా

    శబరి కొండపై వెలిసిన అయ్యప్పా 

    నీ అండ దండ మాకుండాలని 

    కొబ్బరి కాయలు పూలు పండ్లు

    పలహారములే తెచ్చితిమయ్యప్పా

    ” శబరి కొండపై “

    భవ బంధాలను వీడామయ్య భక్తితో నిన్నే కొలిచామయ్యా 

    మండల వ్రతమే చేసామయ్యా  మదిలో నిన్నే తలచామయ్యా 

    ఎరుమేలి వాసా ఏకాంత వాసా…

    ఎరుమేలి వాసా ఏకాంత వాసా  ఏమని నిన్ను కొలిచేమయ్యప్పా

    ” శబరీ కొండపై “

    ఐదు కొండలు దాటోచ్చాము ఎండవానలకు మేమొచ్చాము 

    నీ నామమునే పలుకుతూ రాగా నీ పాటలనే పాడుతూ రాగా 

    పంపా వాసా పందల రాజా… 

    పంపా వాసా పందల రాజా పాపాలను కదా తీర్చగా రావయ్యా 

    ” శబరి కొండపై “

    పాలాభిషేకం పూలాభిషేకం తేనభిషేకం భాస్మభిషేకం 

    నేయ్యభిషేకం చేసామయ్యా జ్యోతిగా దర్శనమిచ్చినవయ్యా    

    జగములనేలే ఓ శబరీశా …

    జగములనేలే ఓ శబరీశా జన్మ ధన్యము చేయగా రావయ్యా 

    ” శబరి కొండపై “

    స్వామీ రా… రా రా రా రా

    స్వామీ రా… రా రా రా రా

    అయ్యా రా… రా రా రా రా

        “స్వామీ రా “

    మణి మాలా ధారుడా మహినేలే దేవుడా

    నీ భక్తుల బ్రోవగా కొండ దిగి రావయ్యా

        ” స్వామి రా “

    శబరి మలై కొండల్లో కొలువై ఉన్నావంటా

    నీలి మలై నీడల్లో నిలిచి ఉన్నావంటా

    పంపా నది తీరాన పవళించి ఉన్నావంటా

    పందల రాజయ్య చెంత చేర రావయ్యా

        “స్వామి రా “

    కాషాయం కట్టినోల్లు కఠిన దీక్షలున్నారు

    నీలి వస్త్ర మేసినోల్లు నియమంతో ఉన్నారు

    నల్ల బట్టలేసినోల్లు నిన్నే నమ్ముకున్నారు

    నిండిన మా స్వామి అండగా నువ్వు రావయ్యా

        ” స్వామి రా “

    ప్రకృతంతా నీ కోసం పులకరించి పోయింది

    పున్నాగలు విరి మల్లెలు కాచి విరగ బూచాయి

    నీ మేడలో ఉండాలని నీ సేవలే పొందాలని

    కొండంత ఆశతో దండగా మారింది

        ” స్వామీ రా “

    పన్నీరు చిలకరించి పూ మాలలు కట్టాము

    పాతిక బెల్లం పాయసాలు పాలు పళ్ళు తెచ్చాము

    కస్తూరి గంధాలు అరగ దీసుకోచ్చాము

    అయ్యా ఓరయ్యా మా పూజలందు కోవయ్య

        ” స్వామి రా “

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version