మార్చి 24 నుంచి ఓటీటీలోకి ‘బలగం’
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మార్చి 24 నుంచి ఓటీటీలోకి ‘బలగం’

    మార్చి 24 నుంచి ఓటీటీలోకి ‘బలగం’

    March 24, 2023

    Courtesy Twitter:primevideoIN

    కమెడియన్ వేణు ఎల్దండి తెరకెక్కించిన ‘బలగం’ మూవీ ఓటీటీలోకి విడుదల కానుంది. మార్చి 24 అర్ధరాత్రి నుంచి అమెజాన్ ప్రైమ్, సింప్లీ సౌత్ ప్లాట్‌ఫాంలలో ప్రసారం కానుంది. భారత్‌లో తప్ప ప్రపంచ వ్యాప్తంగా సింప్లీ సౌత్‌‌లో ఈ మూవీని వీక్షించవచ్చు. మార్చి 3న విడుదలైన ‘బలగం’ మూవీ హిట్ టాక్‌ని సొంతం చేసుకుంది. సినిమా చూశాక ఇది ప్రతి ఇంటి కథ అనే భావన కలిగించింది. ఎంతో మంది హృదయాలను హత్తుకుంది. సెలబ్రిటీల ప్రశంసలను కూడా అందుకుంది. సినిమాలో నటీనటులు తమ పాత్రలకు ప్రాణం పోశారు. బీమ్స్ సిసిరోలియో సంగీతం సినిమాకు పెద్ద అసెట్.

    Courtesy Twitter:SimplySouth

    బలగం చిత్రానికి కమేడియన్ వేణు దర్శకత్వం వహించాడు. మెుదటిసారి దర్శకత్వం వహించినప్పటికీ ఎక్కడా అలా అనిపించదు. మన సంప్రదాయాలు ఎలా ఉంటాయనే అంశాన్ని కళ్లకు కట్టినట్లుగా చూపించాడు. ఈ సినిమా ఘన విజయం సాధించడంతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. మెగాస్టార్ చిరంజీవి కూడా చిత్రాన్ని చూసి అభినందించారు. వేణుతో పాటు చిత్రబృందాన్ని ఇంటికి పిలిచి సన్మానించారు.

    సినిమాను దిల్‌రాజు బ్యానర్‌లో ఆయన పిల్లలు హర్షిత్ రెడ్డి, హన్షితా రెడ్డి నిర్మించారు. కేవలం రూ.4 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తే దాదాపు రూ. 15 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. దీంతో బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది ఈ చిత్రం.

    బలగం విడుదలైన తర్వాత కాంట్రవర్సీలు కూడా అయ్యాయి. ఈ చిత్ర కథ తనదంటూ ఓ జర్నలిస్ట్‌ రచ్చకెక్కాడు. అవన్నీ అవాస్తవాలన్న దర్శకుడు… సొంతంగా రాసుకున్న కథ అని స్పష్టం చేశాడు. ఎలాంటి అంచనాల్లేకుండా వచ్చిన బలగం చిత్రం… ఈ ఏడాది తొలి త్రైమాసికంలో తెలుగు పరిశ్రమకి మంచి సక్సెస్ అందించింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version