Balakrishna – Simran: బాలకృష్ణ- సిమ్రాన్‌ జంటగా ఎన్ని సినిమాల్లో నటించారంటే? అందులో హిట్ సినిమాలు ఎన్నో తెలుసా?
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Balakrishna – Simran: బాలకృష్ణ- సిమ్రాన్‌ జంటగా ఎన్ని సినిమాల్లో నటించారంటే? అందులో హిట్ సినిమాలు ఎన్నో తెలుసా?

    Balakrishna – Simran: బాలకృష్ణ- సిమ్రాన్‌ జంటగా ఎన్ని సినిమాల్లో నటించారంటే? అందులో హిట్ సినిమాలు ఎన్నో తెలుసా?

    November 8, 2023

    నందమూరి నటసింహం బాలకృష్ణ- సిమ్రాన్‌కు తెలుగులో సిల్వర్ స్క్రీన్ పేయిర్‌గా మంచి గుర్తింపు ఉంది. అప్పట్లో వీరి జోడికి ప్రేక్షకుల్లో యమ క్రేజ్ ఉండేది. బాలయ్య- సిమ్రాన్ కాంబోలో ఐదు చిత్రాలు వచ్చాయి. వీటిలో రెండు ఇండస్ట్రీ హిట్స్ ఉన్నాయి. మరి ఆ చిత్రాలేంటో ఓసారి చూద్దాం.

    సమరసింహారెడ్డి

    సిమ్రాన్- బాలకృష్ణ(Balakrishna – Simran) కాంబోలో వచ్చిన మొదటి చిత్రం సమర సింహా రెడ్డి(1999).  సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాను బి.గోపాల్ తెరకెక్కించారు.

    గొప్పింటి అల్లుడు

    సమరసింహారెడ్డి సినిమా తర్వాత మళ్లీ వీరిద్దరి జోడి కుదరింది. ఈవీవీ సత్యనారాయణ డైరెక్షన్‌లో వచ్చిన ‘గొప్పింటి అల్లుడు'(2000) చిత్రంలో బాలయ్య- సిమ్రాన్ కలిసి నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌ టాక్ తెచ్చుకుంది.

    నరసింహ నాయుడు

    బాలకృష్ణ- సిమ్రాన్(Balakrishna – Simran) జోడిగా వచ్చిన హ్యాట్రిక్ చిత్రం నరసింహనాయుడు(2001). ఈ చిత్రం సంక్రాంతి బరిలో విజేతగా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. నరసింహనాయుడు అప్పట్లో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రాన్ని  బి.గోపాల్ డైరెక్ట్ చేశారు.

    సీమసింహం

    బాలకృష్ణ- సిమ్రాన్ కాంబోలో వచ్చిన నాల్గోవ చిత్రం సీమసింహం(2002). సీమసింహం చిత్రాన్ని జి.రామ్‌ప్రసాద్ తెరకెక్కించారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ప్లాప్‌గా నిలిచింది.

    ఒక్క మగాడు

     ‘సీమ సింహం’ సినిమా తర్వాత బాలకృష్ణతో సిమ్రాన్ చివరిసారిగా  ‘ఒక్క మగాడు’ చిత్రంలో నటించింది. ఈ సినిమా బాలయ్య కేరిర్‌లో బిగ్గెస్ట్‌ డిజాస్టర్ మూవీగా నిలిచింది. మొత్తంగా  బాలయ్య, సిమ్రాన్  కలిసి ఐదు సినిమాల్లో జంటగా నటించారు. వీటిలో ఒక్కమగాడు మినహా మిగతా సినిమాలు ప్రేక్షకాదరణ పొందాయి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version