Beast Movie Review
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Beast Movie Review

    Beast Movie Review

    July 20, 2022

    ద‌ళ‌ప‌తి విజ‌య్ హీరోగా న‌టించిన బీస్ట్ మూవీ నేడు రిలీజైంది. పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టించింది. నెల్స‌న్ దిలీప్ కుమార్ డైరెక్ట‌ర్‌. అనిరుద్ మ్యూజిక్ అందించాడు. డైరెక్ట‌ర్ సెల్వ‌రాఘ‌వ‌న్ ఈ సినిమాలో కీల‌క పాత్ర‌లో న‌టించాడు.  ట్రైల‌ర్‌తోనూ ఆస‌క్తి పెంచిన ఈ మూవీ అంచ‌నాల‌కు చేరుకుందా..? ఇప్ప‌టికే సెన్సేష‌న్ క్రియేట్‌ చేసిన అర‌బిక్ కుత్తు పాట ఎలా ఉంది..? సినిమా క‌థేంటి..? ఎవ‌రెలా చేశారు..? తెలుసుకుందాం.

     అస‌లు క‌థేంటి?

    వీర రాఘ‌వ‌న్ (విజ‌య్) రా ఏజెంట్‌గా పనిచేస్తుంటాడు. ఈ క‌థ‌ ఆపరేషన్ జోధ్‌పూర్‌తో ప్రారంభమవుతుంది. ఉమర్ ఫరూక్‌ను పట్టుకునే మిషన్‌కు నాయకత్వం వహించే బాధ్యత హీరోకు అప్ప‌గిస్తారు. అది జ‌రిగిన కొంత‌కాలం త‌ర్వాత ఈస్ట్ కోస్ట్ మాల్‌ను టెర్ర‌రిస్టులు ముట్ట‌డిస్తారు. అందులో ఉన్న ప్ర‌జ‌ల‌ను బంధించి ఉమ‌ర్ ఫ‌రూఖ్‌ను విడుద‌ల చేయాల‌ని డిమాండ్ చేస్తారు. అయితే అదే మాల్‌లో వీర రాఘ‌వ‌న్ ఉంటాడు. మ‌రి టెర్ర‌రిస్టుల నుంచి అంత‌మందిని ఒక్క‌డే ఎలా కాపాడాడు. త‌ర్వాత ఏం జ‌రుగుతుంది అనేదే క‌థ‌. 

    ఎవ‌రెలా చేశారు?

    విజ‌య్ సినిమాలో మొత్తం యాక్ష‌న్ హీరోలా స్టైలిష్‌గా కనిపించిన విధానం ఆక‌ట్టుకుంటుంది. హీరోయిజాన్ని మ‌రో లెవ‌ల్‌కు తీసుకెళ్లాడు.  ఫ్యాన్స్‌ను మెప్పించే సీన్స్ చాలా ఉన్నాయి. విజ‌య్ క్యారెక్ట‌ర్‌ను పెంచ‌డం కోసం విలన్స్ క్యారెక్ట‌ర్స్‌ను త‌క్కువ చేసి చూపించారు. పూజా హెగ్డే హీరోయిన్‌లా కాకుండా ఒక స‌పోర్టింగ్ రోల్ చేసిన ఫీలింగ్ క‌లుగుతుంది. అర‌బిక్ కుత్తు పాట‌లో మిన‌హాయించి ఎక్క‌డా ఆమెను గుర్తుంచుకునే సీన్స్ ఏమి ఉండ‌వు. సెల్వ రాఘ‌వన్ ప‌రిధి మేరకు మెప్పించాడు. అంత బ‌ల‌మైన పాత్ర కాద‌నే చెప్పుకోవాలి. యోగిబాబును కూడా కామెడీ కోసం పెద్ద‌గా వాడుకోలేదు. 

    విశ్లేష‌ణ‌

    నెల్స‌న్ దిలీప్‌కుమ‌ర్ గ‌త సినిమాలు కోకో కోకిల‌, వ‌రుణ్ డాక్ట‌ర్ వంటి సినిమాలు విభిన్న కథాంశాల‌తో తెర‌కెక్కించాడు. ఆ సినిమాల్లో సీరియ‌స్ స‌న్నివేశాల్లోనూ కామెడీ పండించాడు. బీస్ట్‌లో కూడా అదే ప్ర‌య‌త్నించ‌డంతో అది బెడిసికొట్టింది. మాల్‌ను టెర్రిస్తులు హైజాక్ చేయ‌డం మిన‌హాయించి క‌థ‌లో కొత్త‌ద‌నం ఏమీ ఉండ‌దు. దానిచుట్టూ క‌థ‌ను అల్లుకున్నాడు.  యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను ఇంట్రెస్టింగ్‌గా తెర‌కెక్కించిన‌ప్ప‌టికీ అవి క‌థ‌ను ముందుకు తీసుకెళ్లేందుకు ఉప‌యోగ‌ప‌డ‌లేదు. 

    సాంకేతిక విభాగం

    అనిరుద్ మ్యూజిక్ చాలా బాగుంది. ముఖ్యంగా బాక్స్‌గ్రౌండ్ స్కోర్ అద‌ర‌గొట్టాడు. ఇక అర‌బిక్ కుత్తు పాట‌ను స్క్రీన్‌పై చూస్తే విజువ‌ల్ ఫీస్ట్‌లా ఉంది. హీరోను ఎలివేట్ చేసేందుకు మ్యూజిక్ ప్ల‌స్‌గా మారింది. మ‌నోజ్ ప‌ర‌మ‌హంస సినిమాటోగ్ర‌ఫీ , ఆర్. నిర్మ‌ల్ ఎడిటింగ్ బాగుంది. 

    బ‌లాలు:

    విజ‌య్ యాక్టింగ్

    కామెడీ

    యాక్ష‌న్

    ఫ‌స్టాఫ్

    బ‌ల‌హీన‌త‌లు:

    లాజిక్ లేని స‌న్నివేశాలు

    క‌థ‌లో కొత్త‌ద‌నం లేక‌పోవ‌డం

    సెకండాఫ్‌ 

    డ్రామా, ఎమెష‌న్స్ పండ‌క‌పోవ‌డం

    క్లైమాక్స్ 

    రేటింగ్ 2.5/5

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version