BEST 5G PHONES UNDER 20000: వీటి ఫీచర్లు చూస్తే కొనకుండా ఉండలేరు భయ్యా!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • BEST 5G PHONES UNDER 20000: వీటి ఫీచర్లు చూస్తే కొనకుండా ఉండలేరు భయ్యా!

    BEST 5G PHONES UNDER 20000: వీటి ఫీచర్లు చూస్తే కొనకుండా ఉండలేరు భయ్యా!

    October 27, 2023

    మీడియం బడ్జెట్‌ రేంజ్‌లో తయారయ్యే స్మార్ట్‌ ఫోన్లకు ఈ మధ్య విపరీతమైన డిమాండ్ నెలకొంది. అటు ప్రిమియం లుక్‌తో పాటు ఇటు ఫీచర్ల పరంగా ఫ్లాగ్ షిప్ ఫోన్లతో ఇవి పోటీ పడుతున్నాయి. ముఖ్యంగా రూ.20 వేల లోపు స్మార్ట్‌ ఫోన్లకు క్రేజ్ ఎక్కువగా ఉంది. ఐకూ, శామ్‌సంగ్, పోకో బ్రాండ్ల నుంచి ఇబ్బడి ముబ్బడిగా ఫోన్లు రిలీజ్ అవుతున్నప్పటికీ.. వీటిలో ఏ ఫోన్‌ కొనాలో తెలియక చాలా మంది తికమకపడుతున్నారు. అటువంటి వారి కోసమే YouSay బెస్ట్‌ 5G ఫోన్లను మీ ముందుకు తీసుకొచ్చింది. మీ బడ్జెట్‌ రూ.20 వేల లోపు  అయితే వీటిలో ఒక స్మార్ట్‌ ఫోన్‌ను ట్రై చేయవచ్చు.

    iQOO Z7 5G

    ఐకూ జెడ్7 5జీ (iQOO Z7 5G) స్మార్ట్‌ఫోన్‌ను పుల్ హెచ్‌డీ+ కర్వ్‌డ్ అమొలెడ్ సూపర్ విజన్ డిస్‌ప్లే 90Hz రీఫ్రేష్ రేటుతో డిస్‌ప్లే వచ్చింది.  స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌పై ఇది అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్ 13, ఫన్‌టచ్ ఓఎస్13 ఆపరేటింగ్ సిస్టమ్‌ను ఇందులో ఇన్‌బిల్ట్‌ చేశారు.  iQOO Z7లో క్వాలిటీ కెమెరా సెటప్‌ ఫిక్స్‌ చేశారు. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో 64MP ప్రైమరీ కెమెరాను అమర్చారు. ఇక ఫ్రంట్‌ సైడ్‌ 16MP సెల్ఫీ కెమెరా ఉంది. ఇందులో 4600mAh బ్యాటరీని ఫిక్స్ చేశారు. అయితే దీనికి 66వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను అందించడం విశేషం. 6GB RAM + 128GB ROM, 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్లలో దీన్ని తీసుకొచ్చారు. దీని ధర రూ. 15,999.

    Samsung Galaxy M34

    శాంసంగ్‌లో రూ.20 వేల లోపు బెస్ట్ ఫోన్‌ కావాలనుకునే వారికి శాంసంగ్‌ గెలాక్సీ M34 స్మార్ట్‌ఫోన్‌ మంచి ఆప్షన్‌ అని చెప్పొచ్చు. ఇది 8GB RAM/128GB ROMతో వస్తోంది. ఇది 120Hz అమోలెడ్‌ డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, 6000mAh బ్యాటరీని కలిగి ఉంది. దీనిపై అమెజాన్‌లో ఫ్లాట్ 33% తగ్గింపు ఉంది. దీంతో ఈ ఫోన్ ధర రూ. 16,499లకు అందుబాటులోకి వచ్చింది. HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కొనుగోళ్లపై రూ. 15,000 వరకు తగ్గింపు కూడా ఉంది. ఫలితంగా ఈ ఫోన్‌ను ఇంకా తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. ఎక్స్‌ఛేంజ్‌ ఆఫర్, No Cost EMI కూడా అందుబాటులో ఉంది.

    OnePlus Nord CE 3 Lite 5G

    వన్‌ప్లస్ బ్రాండ్‌ నుంచి మంచి ప్రీమియం లుక్‌ ఉన్న ఫోన్‌ కొనాలనుకునే వారికి ఇది బాగా నచ్చుతుంది. రూ.20 వేల లోపు ఫోన్‌ కావాలనుకునే వారు ‘వన్‌ప్లస్ నార్డ్‌ CE 3 లైట్’ ట్రై చేయోచ్చు. ఇది 1.5K రిజల్యూషన్‌తో 120Hz రిఫ్రెష్‌ రేట్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 6.74 అంగుళాల పరిమాణంలో ఆమోలెడ్ ప్యానెల్‌ను ఈ ఫోన్‌కు అమర్చారు. 108MP మెయిన్ కెమెరా, 16 సెల్ఫీ కెమెరా సెటప్‌తో వచ్చింది. ఇందులో Qualcomm Snapdragon 695 చిప్‌ సెట్ ఉంది. ఈ ఫోన్ ధర రూ. 19,999గా ఉంది. గత అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌లో రూ.2500 వరకు డిస్కౌంట్ లభించింది. ఈసారి దీపావళి సేల్‌లో మళ్లీ ఈ ఫోన్‌పై ఆఫర్లు అయితే ఉండే అవకాశం ఉంది.

    Vivo T2X 5G

    రూ. 20 వేల లోపు లభిస్తున్న స్మార్ట్‌ ఫోన్లలో ఇది బెస్ట్ ఛాయిస్‌గా చెప్పవచ్చు. ఈ ఫోన్‌ డిస్‌ప్లే సైజు 6.38(16.21cm) అంగుళాలు ఉంటుంది. ఫుల్ హెచ్‌డీతో పాటు అమోల్డ్‌ డిస్‌ప్లే టైప్‌తో రూపుదిద్దుకుంది. 1080 x 2400 పిక్సెల్ రెజల్యూషన్ సపోర్ట్ చేస్తుంది. స్నాప్ డ్రాగన్ 695 ఆక్టాకోర్‌ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఆండ్రాయిడ్‌ 13 వెర్షన్‌తో 2.2 GHz ప్రైమరీ క్లాక్ స్పీడ్, 90Hz రిఫ్రెష్ రేట్‌తో డిజైన్ అయింది. ఇది 128GB + 8GB, 128GB + 8GB వేరియంట్లతో అందుబాటులో ఉంది. ఇక కెమెరా విషయానికి వస్తే… ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కలిగిన 64MP ప్రైమరీ కెమెరాతో పాటు 2 MP పోర్ట్‌రైట్ లెన్స్‌ కలిగిన మరో కెమెరా ఉంది. 16MP ఫ్రంట్ కెమెరా ఉంది. 4500mAh బ్యాటరీ కెపాసిటీతో  ఫాస్ట్‌ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. 44W ఛార్జర్‌ను ఇస్తున్నారు. వివో T2 128GB + 6GB RAM ఫోన్‌ ధర రూ. 17,999గా ఉంది. 128+8GB వేరియంట్  రూ.20,999కు లభిస్తోంది.

    Poco X5 Pro 5G

    Poco X5 Pro 5G స్మార్ట్‌ ఫోన్ మీడియం బడ్డెట్‌ రేంజ్‌లో మంచి ఫోన్‌గా చెప్పవచ్చు. ఇది 6GB RAM +GB ఇంటర్నల్‌ స్టోరేజీతో  ₹18,999,  8GB RAM + 256GB స్టోరేజీతో  ₹20,999 వద్ద ఈ ఫోన్‌ అందుబాటులో ఉంది. స్నాప్‌డ్రాగన్‌ 778G ప్రాసెసర్‌ చిప్‌ సెట్‌తో వచ్చింది. 108MP ప్రధాన కెమెరా, 16MP సెల్ఫీ కెమెరా సెటప్‌తో వచ్చింది. 6.67 అంగుళాల పొడవున్న సూపర్ AMOLED డిస్‌ప్లే కలిగి ఉంది. ఇది 120Hz రీఫ్రేష్ రేటు బ్రైట్‌నెస్ అందిస్తుంది. 5,000mAh బ్యాటరీ 33W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version