Best Curved Display Phones 2023: ఫీచర్సే కాదు.. డిస్‌ప్లే కూడా ముఖ్యమే.. టాప్‌ రేటెడ్ కర్వ్డ్ డిస్‌ప్లే ఫొన్లు ఇవే..!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Best Curved Display Phones 2023: ఫీచర్సే కాదు.. డిస్‌ప్లే కూడా ముఖ్యమే.. టాప్‌ రేటెడ్ కర్వ్డ్ డిస్‌ప్లే ఫొన్లు ఇవే..!

    Best Curved Display Phones 2023: ఫీచర్సే కాదు.. డిస్‌ప్లే కూడా ముఖ్యమే.. టాప్‌ రేటెడ్ కర్వ్డ్ డిస్‌ప్లే ఫొన్లు ఇవే..!

    October 30, 2023

    ప్రస్తుత స్మార్ట్ ఫోన్ యుగంలో మంచి ఫోన్ సెలెక్ట్ చేసుకోవాలంటే డిస్‌ప్లే టెక్నాలజీ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మొబైల్‌లో టాప్ ఫీచర్లతో పాటు డిస్‌ప్లే వెర్షన్‌ కూడా కీలకమే. ప్రస్తుతం కర్డ్వ్‌ డిస్‌ప్లే ట్రెండ్ నడుస్తోంది. ఈ ట్రెండ్‌కు అనుగుణంగా మొబైల్ కంపెనీలు ఇబ్బడిముబ్బడిగా కర్వ్డ్‌ డిస్‌ప్లే ఫోన్లను మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నాయి. మీరు కనుక మంచి కర్వ్డ్ డిస్‌ప్లే స్మార్ట్ ఫోన్ కోసం వెతికితే ఈ కథనం మిమ్మల్ని గైడ్ చేస్తుంది. ఇక్కడ మార్కెట్‌లో టాప్‌ రేటింగ్ ఉన్న కర్వ్డ్ డిస్‌ప్లే ఫోన్లను అందించడం జరిగింది. వాటిలో మీ ఛాయిస్‌ ఏదో కనిపెట్టండి మరి..

    iQOO Z7 pro

    ప్రిమియం ఫీచర్లతో మంచి కర్వ్‌డ్ డిస్‌ప్లే ఫోన్ కావాలనుకునే వారికి iQOO Z7 Pro మంచి ఛాయిస్. ఇది 6.78 అంగుళాల పొడవుతో 2400*1080 పిక్సెల్‌ రిజల్యూషన్‌తో 3D కర్వ్డ్‌ డిస్‌ప్లేతో వస్తుంది. MediaTek Dimensity 7200 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 8GB RAM, 128GB స్టోరెజ్ కెపాసిటీ కలిగి ఉంటుంది. 64MP AURA ప్రధాన కెమెరా(OIS) సెటప్‌తో పాటు 16MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. దీని ధర రూ.23,999

    Lava Agni 2 5G

     రూ.20 వేల లోపు మంచి ఫీచర్లతో కర్వ్‌డ్ డిస్‌ప్లే స్మార్ట్‌ కొనాలనుకునేవారికి ఇది మంచి ఎంపిక. పైగా ఇది ఇండియన్ బ్రాండ్. విదేశీ బ్రాండ్లకు ఏమాత్రం తగ్గని ఫీచర్లు ఇందులో ఉన్నాయి. లావా అగ్ని2 .. 6.78 అంగుళాల పొడవు, 120 హెడ్డ్ రీప్రెష్‌ రేటుతో  ఫుల్‌ హెచ్‌డీ కర్వ్‌డ్ ఆమోల్డ్‌ డిస్‌ప్లేతో వచ్చింది. ఇందులో శక్తివంతమైన మీడియా టెక్‌ డైమెన్సిటీ 7050 ప్రాసెసర్‌ను అమర్చారు. 60MP మెయిన్‌ కెమెరాతో పాటు 16MP సెల్ఫీ కెమెరా సెటప్‌తో వచ్చింది. 8జీబీ ర్యామ్, 256జీబీ ఇంటర్నల్ స్టోర్జేజ్ దీని ప్రత్యేకత. మరో విశేషమేమిటంటే ఇది 13 5G బ్యాండ్లను సపోర్ట్ చేస్తుంది. ఇక లావా అగ్ని 2 ధర రూ.19,999.

    Honor 90 Pro

     హానర్ 90 ప్రో స్మార్ట్ ఫోన్ 6.78 సూపర్ ఆమోల్డ్ డిస్‌ప్లే 437ppi బ్రైట్‌ నెస్‌తో 120 హెడ్జ్ రిఫ్రేష్ రేటుతో ఉంటుంది. 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ కెపాసిటీని కలిగి ఉంది. దీని ప్రధాన కెమెరా వచ్చేసి 200 MP + 12 MP + 32 MP సెటప్‌తో రాగా… ఫ్రంట్ కెమెరా 50 MP + 2 MP కన్ఫిగరేషన్‌తో అందుబాటులో ఉంది. 5000 mAh బ్యాటరీ కెపాసిటీతో ఫాస్ట్ 63W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. దీని ధర రూ. 31,999.

    OnePlus 11

    మార్కెట్‌లోని టాప్‌ ఫీచర్లతో కర్వ్‌డ్ డిస్‌ప్లే కలిగిన ఫొన్లలో ఇది టాప్‌లో ఉంటుందని చెప్పవచ్చు. 6.7 అంగుళాల ఆమోల్డ్ డిస్‌ప్లే..‌ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ కలిగి ఉంటుంది. ఇది సూపర్ ఫ్యూయిడ్ డిస్‌ప్లేను కలిగి 1440*3216 పిక్సెల్ రిజల్యూషన్ బ్రైట్‌నెస్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. 16GB RAM, 512GB స్టోరేజ్ కెపాసిటీని అందిస్తుంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 చిప్‌సెట్‌తో ఆండ్రాయిడ్ 13 వెర్షన్‌తో వస్తోంది. 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ దీని సొంతం. 5000mah బ్యాటరీ కెపాసిటీ కలదు. 100వాట్స్ ఫాస్ట్ ఛార్జర్‌తో వస్తోంది. 50MP మెయిన్ కెమెరా+ 48 అల్ట్రా వైడ్ సెన్సార్, 32MP టెలీఫోటో సెటప్‌ కలిగి ఉటుంది. 16MP సెల్ఫీ కెమెరాతో బ్యూటిల్ ఫొటోలు అయితే తీస్తుంది. దీని ధర రూ. 61,999

    Motorola Edge 40

    మోటోరోలా ఎడ్జ్‌ 40 ఫోన్‌ 6.55 అంగుళాల ఫుల్‌ HD+ 3D కర్వ్డ్ పోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్‌ను 144Hz రిఫ్రెష్‌ రేట్‌తో రూపొందించారు. ఇది  MediaTek డైమెన్సిటీ 8020 SoC ద్వారా పనిచేస్తుంది.

    ఈ 5G ఫోన్‌ ప్రైమరీ కెమెరా 50 MP ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సెటప్‌తో వచ్చింది. ఇక ఫ్రంట్‌ కెమెరాలో 13MP అల్ట్రా వైడ్‌ లెన్స్‌ను ఫిక్స్ చేశారు. ఇది మాక్రో విజన్‌ కలిగి ఉంది.  ఇది మీడియా టెక్ డైమెన్సీటి 8020 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. మోటోరోలా ఎడ్జ్‌ 40 ఫోన్‌ 8GB RAM,  256GB UFS 3.1 స్టోరేజ్‌ను కలిగి ఉంది. ఎక్కువ స్టోరేజ్ సామర్థ్యం ఉండటంతో హై రిజల్యూషన్ ఫొటోలు, వీడియోలను ఎలాంటి ఆందోళన లేకుండా స్టోర్ చేసుకోవచ్చు.  4,400mAh బ్యాటరీతో 68W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, వైర్‌లెస్ ఛార్జింగ్‌కు కూడా సపోర్టు చేస్తుంది. దీని ధర రూ. 31,999.

    realme 11 Pro

    రియల్‌మీ 11 ప్రో మొబైల్ 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ(1,080*2,412 పిక్సెల్స్) ఆమోల్డ్ డిస్‌ప్లేతో వచ్చింది. 120 Hz టచ్ సాంప్లింగ్ రిప్రెష్ రేటు కలిగి ఉంది. రియల్ మీ ప్రో మూడు స్టోరేజీ వేరియంట్లలో లభిస్తోంది. బేస్ వేరియంట్ 8GB RAM, 256GB ఇంటర్నల్ స్టోరేజీతో వస్తోంది. దీంతో పాటు 8GB RAM + 256GB, 12GB + 256GB వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి.11 ప్రో 5G  ప్రధాన కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫెసిలిటీతో 100 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌ని కలిగి ఉంది. 2మెగా పిక్సెల్‌ క్లారిటీతో రెండో కెమెరా ఉంది. ఇక సెల్పీ కెమెరా 16 మెగాపిక్సెల్ సెటప్‌తో తయారైంది. 5,000mAh కెపాసిటీతో బ్యాటరీ,  67వాట్స్ సూపర్ వూక్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. దీని ధర రూ. 23,999

    vivo V29e

    వివో V29e హ్యాండ్‌సెట్  3D కర్వ్డ్‌ డిస్‌ప్లేతో స్క్రీన్‌పై హోల్ పంచ్ కట్‌అవుట్ ఆప్షన్‌తో వచ్చింది. డిస్‌ప్లే  6.78 ఇంచ్ పొడవుతో  120Hz రిఫ్రేష్ రేటును కలిగి OLED.. FPSను సపోర్ట్ చేస్తుంది. Vivo V29e మొబైల్‌లో మెయిన్ కెమెరా 64 మెగాఫిక్సెల్ సెటప్‌తో.. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్(OIS) సపోర్ట్ చేస్తుంది.  సెల్ఫీ కెమెరా 50 మెగాఫిక్సెల్ కన్ఫిగరేషన్‌తో క్వాలిటీ చిత్రాలు, వీడియో టేకింగ్‌ను అందిస్తుంది. వైడాంగిల్, నైట్ మోడ్, టైమ్ ల్యాప్స్ ఫీచర్సును కలిగి ఉంది. 8GB RAM + 128GB స్టోరేజీ సామర్థ్యంతో బేసిక్ మోడల్, 8GB RAM + 256GB స్టోరేజ్ కాన్ఫిగరేషన్లతో ప్రీమియ్ మోడల్ అందుబాటులో ఉంది. 80W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది.  4,600mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. దీని ధర రూ.26,260.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version