Best Hilarious Comedy Scenes From F2 Movie
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Best Hilarious Comedy Scenes From F2 Movie

    Best Hilarious Comedy Scenes From F2 Movie

    May 26, 2022

    వెంక‌టేశ్, వ‌రుణ్ తేజ్, త‌మ‌న్నా, మెహ్రిన్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన F2 మూవీ 2019లో రిలీజై భారీ స‌క్సెస్ సాధించింది. ఫ్యామిలీలు, పిల్ల‌ల‌తో స‌హా అంద‌రూ ఆ సినిమాను ఎంజాయ్ చేశారు. ముఖ్యంగా వెంకీ కామెడీ, వ‌రుణ్ మొద‌టిసారిగా కామెడీ యాంగిల్ ట్రై చేయ‌డం ప్రేక్ష‌కుల‌ను మెప్పించాయి. ఇదే కాంబినేష‌న్‌లో తిరిగి F3 మూవీ తెర‌కెక్కింది. ఈ సినిమాలో F2కి మించి మూడు రెట్ల కామెడీ ఉంటుంద‌ని చెప్తున్నారు చిత్ర‌బృందం. అందుకే ఆ సినిమా చూసేందుకు ప్రేక్ష‌కులు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే రేపు F3 మూవీ రిలీజ్ అవుతున్న సంద‌ర్భంగా F2లో కొన్ని బెస్ట్ కామెడీ సీన్స్ మీకోసం..

    వెంకీ పెళ్లి చూపుల సీన్‌:

     F2 మూవీలో వెంకీ పెళ్లి చూపుల సీన్‌లో కామెడీ అదిరిపోతుంది. ఎమ్మెల్యేను త‌న త‌రఫున పెద్ద‌గా తెచ్చుకున్న వెంకీ నాకెవ‌రు లేరు అన్నీ మీరే చూసుకోండి. మీరు ఎలా చెప్తే అలా అంటాడు. కానీ పెళ్లి చూపుల్లో అమ్మాయిని వంటొచ్చా, ఉద్యోగం మానేస్తావా అని అడిగితే అవ‌న్నీ మీకెందుకు పెళ్ల‌య్యాక మేము చూసుకుంటాం అంటాడు. అలాగే క‌ట్నం గురించి అడిగితే ఉన్న‌ది ఇద్ద‌రు అమ్మాయిలు ఉన్న‌దంతా వాళ్ల‌కేగా అని పెళ్లికూతురు త‌ల్లి చెప్ప‌డం, దానికి ఆమె భ‌ర్త అంతేగా అంతేగా అన‌డం.. ఈ సీన్ థియేట‌ర్‌ల‌లో ప్రేక్ష‌కులను క‌డుపుబ్బా న‌వ్వించింది. 

    https://youtu.be/uA-Vct0G1x8

    షాపింగ్ మాల్ సీన్:

    షాపింగ్ మాల్‌లో పెళ్లికి బ‌ట్ట‌లు కొనే సీన్ హిలేరియ‌స్‌గా పండింది. అమ్మ‌కి త‌క్కువ ధ‌ర చీర‌ను సెల‌క్ట్ చేసి, త‌ల్లి కూతుళ్లు ఎక్కువ ధ‌ర‌కు సెల‌క్ట్ చేసుకుంటేంటే ఒక వైపు అమ్మ పోరు అమ్మాయి పోరు ప‌డ‌లేక వ‌రుణ్‌ న‌లిగిపోతాడు. అది చూసి వెంకీ ఎంజాయ్ చేస్తుంటాడు.  ఇక ఇప్ప‌టినుంచి నీ లైఫ్‌లో మూడు ఎఫ్‌లు మిస్ అవుతాయి.. ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఫ్రీడ‌మ్ అని జ్ఞానోదయం చేస్తాడు.

    https://youtu.be/_UbSa4ZazkU

    హ‌నీ ఈజ్ ది బెస్ట్:

    హ‌నీకి ఏం రాక‌పోయినా నేను అన్నిట్లో తోపు అనుకునే క్యారెక్ట‌ర్‌. కాలేజీలో సింగింగ్ కాంపిటీష‌న్‌, డ్యాన్స్ కాంపిటీష‌న్‌లో పాల్గొనేందుకు పోటీప‌డుతుంది. కానీ ఆమె టాలెంట్ తెలిసిన లెక్చ‌ర‌ర్స్ వ‌ద్ద‌ని వారిస్తారు. అప్పుడు వ‌రుణ్‌కి ఫోన్ చేసిన హ‌నీ అత‌డి ముందు త‌న టాలెంట్‌ను చూపిస్తుంది. ఈ సీన్‌లో మెహ్రిన్ న‌ట‌న‌, ఎక్స్‌ప్రెష‌న్స్‌తో ది బెస్ట్ కామెడీ పండించింది.

    https://youtu.be/7Lx0CYsLh_0

    లేడీస్ బ్రెయిన్‌:

    ఇక ఇవ‌న్నీ చూసి ఫ్ట్ర‌స్టేష‌న్‌లో బార్‌కు వ‌చ్చి మందు తాగుతూ బాధ‌ప‌డుతున్న వ‌ర‌ణ్‌కి వెంకీ ఆడ‌వాళ్ల బ్రెయిన్ ఎలా ప‌నిచేస్తుందో వివ‌రించి చెప్తాడు. మ‌గ‌వాల్ల బ్రెయిన్ ఏ విష‌య‌మైనా అన్నింటిని వేర్వేరుగా ఆలోచిస్తుంది. కానీ లేడీస్ బ్రెయిన్ అలా కాదు. అమ్మ నుంచి ఆఫీస్ నుంచి అన్నీ క‌లిపేసి మాట్లాడ‌తారు అంటూ బొమ్మ వేసి గీత‌లు గీసి మ‌రి చెప్తాడు. 

    https://youtu.be/_xDo78xUve8

    అంతేగా.. అంతేగా..

    ఇలాంటి ఇంకా వ‌రుణ్ పెళ్లి చూపుల సీన్, స‌ర్ఫ్ ఎక్సెల్ సీన్, బ్రిడ్జి సీన్, అంతేగా అంతేగా.. ఇలా F2 లో ఆద్యంతం న‌వ్వుకునేలా చాలా సంద‌ర్భాలు ఉంటాయి. అలాంటివి కొన్ని ఈ వీడియోలో చూసేయండి

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version