మార్కెట్‌లో చాలా రకాల ల్యాప్‌టాప్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే ఐటీ ఉద్యోగులు, వ్యాపారులు మిడ్ రేంజ్‌లోని ల్యాప్‌టాప్స్‌నే ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. ఎందుకంటే రూ.40 వేల నుంచి రూ.70 వేల మధ్య ఉన్న వాటిని మల్టీటాస్కింగ్ ల్యాప్‌టాప్స్‌గా చెప్పవచ్చు. ఇవి హై స్పీడ్ ప్రొసెసింగ్‌ను కలిగి ఉంటాయి. భారీ సాఫ్ట్‌వేర్ అప్లికేషన్స్‌ను కూడా ఇవి అలవోకగా నిర్వహిస్తాయి. అలాగే వెబ్ డెవలపింగ్, AI సొల్యూషన్స్, గ్రాఫిక్ డిజైన్ & వీడియో ఎడిటింగ్‌లకు సపోర్ట్ చేస్తాయి. మిడ్‌రేంజ్‌లో మంచి ల్యాప్‌టాప్ కోసం ఎదురు చూస్తున్న వారి కోసం YouSay ఈ ప్రత్యేక కథనాన్ని తీసుకొచ్చింది. రూ.70,000 లోపున్న వాటిలో బెస్ట్ ల్యాప్‌టాప్స్‌ను మీ ముందుకు తెచ్చింది. అవేంటో ఇప్పుడు చూద్దాం.
ASUS VivoBook K15 OLED
ఈ ల్యాప్‌టాప్ Intel Core i3-1115G4 Processor 3.0 GHzతో పని చేస్తుంది. Intel Ultra HD Graphics, 8GB / 512GB SSD స్టోరేజ్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. Windows 11 ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఈ ల్యాప్‌టాప్ పనిచేస్తుంది. 15.6-inch (39.62 cms) FHD (1920 x 1080) స్క్రీన్, 600 nits బ్రైట్‌నెస్‌ను ల్యాప్‌టాప్‌కు అందించారు. దీని అసలు ధర రూ.62,990. కానీ అమెజాన్ దీనిపై 30% డిస్కౌంట్ ప్రకటించింది. ఫలితంగా ఇది రూ.43,990లకు అందుబాటులోకి వచ్చింది.
HP 14s Ryzen 5-5500U
ఈ ల్యాప్‌టాప్ 14 అంగుళాలు ఫుల్ హెచ్‌డీ స్క్రీన్‌ను కలిగి ఉంది. 6 GB RAM / 512GB SSD స్టోరేజ్‌ను దీనికి అందించారు. Windows 11 Home ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఇది పనిచేస్తుంది. AMD Ryzen 5 5500U ప్రొసెసర్‌ను ల్యాప్‌టాప్‌కు అందించారు. దీని అసలు ధర రూ. 59,241. అమెజాన్ దీనిపై 23% రాయితీ ఇస్తోంది. ఫలితంగా HP 14s ల్యాప్‌టాప్‌ను రూ.45,890కే పొందవచ్చు.
ASUS Vivobook 15
ASUS కంపెనీ నుంచే మరో బెస్ట్ ప్రొఫెషనల్ ల్యాప్‌టాప్ అందుబాటులో ఉంది. ASUS Vivobook 15 ల్యాప్‌టాప్‌కు వినియోగదారుల నుంచి మంచి ఫీడ్‌బ్యాక్‌ను కలిగి ఉంది. ఈ ల్యాప్‌టాప్ 11వ జనరేషన్ (11th Gen) Intel Core i5-1135G7 ప్రొసెసర్‌ను కలిగి ఉంది. 8GB RAM / 512GB SSD స్టోరేజ్ సామర్థ్యాన్ని దీనికి అందించారు. Integrated Graphics, Windows 11 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఇది వర్క్ చేయనుంది.
HP ProBook 445 G8 Notebook
HP ProBook కూడా అడ్వాన్స్‌డ్ ప్రొఫెషనల్ ల్యాప్‌టాప్ అని చెప్పవచ్చు. ఇది AMD Ryzen 7 5800U ప్రొసెసర్‌తో పని చేస్తుంది. 8GB RAM / 512GB SSD స్టోరేజ్‌ను కలిగి ఉంది. 14 అంగుళాల FHD స్క్రీన్‌తో ఉన్న ఈ ల్యాప్‌టాప్.. AMD Radeon Graphicsకు సపోర్ట్ చేస్తుంది. దీని అసలు ధర రూ. 73,268. అమెజాన్ ఈ ల్యాప్‌టాప్‌పై 35% డిస్కౌంట్ ప్రకటించింది. ఫలితంగా ఇది రూ.47,990 అందుబాటులోకి వచ్చింది.
HP Laptop 15s
HP కంపెనీ రిలీజ్ చేసిన అత్యుత్తమమైన ల్యాప్‌టాప్‌లలో ఇదీ ఒకటి. HP Laptop 15s.. 15.6 అంగుళాల FHD స్క్రీన్‌ను కలిగి ఉంది. 8GB DDR4 RAM / 512GB SSD స్టోరేజ్‌ను దీనికి అందించారు. Intel Iris Xe Graphics ఇందులో ఇన్‌బిల్ట్‌గా ఉంది. 11th Gen Intel Core i5-1155G7 ప్రొసెసర్, విండోస్ 11 హోమ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ ల్యాప్‌టాప్ వర్క్ చేయనుంది. అమెజాన్‌లో ఇది రూ. 51,990 లభిస్తోంది.
Acer Aspire 5 Gaming Laptop
ఈ ల్యాప్‌టాప్ ప్రత్యేకంగా గేమర్స్‌ను ఉద్దేశించి రూపొందించబడింది. Intel Core i5-1335U ప్రొసెసర్‌తో ఇది వర్క్ చేయనుంది. ఇందులో గేమ్స్ కోసం పవర్‌ఫుల్ NVIDIA GeForce RTX2050 గ్రాఫిక్స్‌ను అందించారు. 8 GB/512 GB SSD/Windows 11 Home ఆపరేటింగ్ సిస్టమ్‌ను కలిగి ఉంది. అమెజాన్‌లో ఈ ల్యాప్‌టాప్ రూ. 59,990 అందుబాటులో ఉంది.
Samsung Galaxy Book2
శాంసంగ్ నుంచి బెస్ట్ ల్యాప్‌టాప్ కోరుకునే వారు Samsung Galaxy Book 2 పరిశీలించవచ్చు. ఇది Intel 12th Gen core i5 39.6cm ప్రొసెసర్‌తో వర్క్ చేయనుంది. 15.6 FHD LED స్క్రీన్ కలిగి ఉంది. 16GB RAM/512 GB SSD ల్యాప్‌టాప్‌కు అందించారు. Windows 11, MS Office, బ్లాక్ లైట్ కీబోర్డు, ఫింగర్ ప్రింట్ రీడర్ వంటి ఫీచర్లను కలిగి ఉంది.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!