BEST MICROPHONES: సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు బెస్ట్ మైక్రోఫోన్లు, హెడ్‌సెట్స్ ఇవే!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • BEST MICROPHONES: సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు బెస్ట్ మైక్రోఫోన్లు, హెడ్‌సెట్స్ ఇవే!

    BEST MICROPHONES: సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు బెస్ట్ మైక్రోఫోన్లు, హెడ్‌సెట్స్ ఇవే!

    October 27, 2023

    విద్యార్థులు, వర్కింగ్ ప్రొఫెషనల్స్, సాఫ్ట్‌ ఇంజినీర్స్, కాల్‌సెంటర్లలో పనిచేసే ఉద్యోగుల పనివేళల్లో మైక్రోఫోన్లు అత్యంత ఆవశ్యకమైనవి. వారి రోజువారి జీవితాల్లో ఓ భాగంగా పెనవేసుకుని ఉంటాయి. అయితే ఉత్తమమైన మైక్రోఫోన్లను ఆన్‌లైన్ స్టోర్ల నుంచి కొనుగోలు చేయాలంటే పెద్ద సవాలే అని చెప్పాలి. ఎవరికి ఏ హెడ్‌ఫోన్ సెట్‌ అవుతుందో తెలుసుకుని వెతకాలంటే చాలా సమయం వృథా అవుతుంది. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ కొన్ని మైక్రోఫోన్లు, హెడ్‌సెట్‌లు అందిస్తున్నాం. వీటిని ఓసారి ట్రై చేసి చూడండి.

    ZEBRONICS Zeb-Lucid PRO

    ఈ మైక్రోఫొన్‌ హైసెన్సిటివిటీ సౌండ్‌ను కండెన్స్ చేస్తుంది. దాదాపు -42 డెసిబుల్స్‌ వరకు సౌండ్‌ను గ్రాబ్ చేస్తుంది. క్రిస్టల్ క్లియర్ ఆడియో రికార్డు చేయాలనుకునే వారికి ఇది బెస్ట్ ఛాయిస్. ఇది ఎక్కువగా యూట్యూబ్ వీడియోలు చేసేవారికి మ్యూజిక్ కంపోజ్ చేసేవారికి బాగా ఉపయోగపడుతుంది. దీని ధర రూ.1,199.

    Walmeck Gaming Headset

    మంచి బాస్‌తో సౌండ్ ఎంజాయ్ చేయాలనుకునే వారికి ఈ హెడ్‌ఫోన్స్ మంచి ఎంపిక. గేమింగ్, మ్యూజిక్ లవర్స్‌ ఈ టైప్‌ హెడ్‌ఫోన్స్‌ను బాగా ఇష్టపడుతారు. ఎక్కువ సేపు వినేందుకు వీలుగా దీనిలో ఇయర్ ఫోమ్‌ సౌకర్యాన్ని కల్పించారు. దీని అసలు ధర రూ.3,399 కాగా అమెజాన్‌లో ప్రస్తుతం రూ.1,549 వద్ద కొనుగోలు చేయవచ్చు.

    Kufoo Wired Microphone

    ఆఫీస్‌ ఎన్విరాన్‌మెంట్‌కు ఈ మైక్రోఫోన్ బాగా యూజ్ అవుతుంది. నిత్యం హాల్‌ మీటింగ్‌లు, సమావేశాలతో బిజీగా ఉండేవారికి ఈ మైక్రోఫోన్ బెస్ట్ ఛాయిస్. రౌండ్ టెబుల్ మీటింగ్‌లకు ఈ మైక్రో ఫోన్స్‌ను విరివిగా ఉపయోగించుకోవచ్చు. ఆన్‌లైన్‌ క్లాస్‌ల కోసం విద్యార్థులు దీనిని ఉపయోగించుకోవచ్చు. దీని ధర రూ. 1,914.

    Gaming Headset

    మంచి గెమింగ్ ఎక్స్‌పీరియన్స్‌ కావాలనుకుంటే ఇది మీకు బెస్ట్ ఛాయిస్ కావొచ్చు. ఈ హెడ్‌ఫోన్‌ సెట్ బెస్ట్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్‌ను కలిగి ఉంది. టాబ్‌లెట్, మొబైల్, ల్యాప్‌టాప్ ఇలా ఏ గ్యాడ్జెట్‌తోనేనా దీనిని కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ హెడ్‌ఫోన్ సెట్ 50శాతం డిస్కౌంట్‌తో అమెజాన్‌లో ₹2,419కే లభిస్తోంది.

    Telephone Computer Headset

    టెలీకాలర్స్, నిత్యం ఆన్‌లైన్ మీటింగ్‌లతో బిజీగా ఉండే సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్స్‌కు ఈ హెడ్‌సెట్ బెస్ట్ ఛాయిస్‌గా చెప్పవచ్చు. ఈ హెడ్‌ఫోన్ యాక్టివ్ నాయిస్ క్యాన్సెలేషన్ ఫీచర్‌ను కలిగి ఉంది. కంప్యూటర్, ల్యాప్‌టాప్, మొబైల్‌కు కనెక్ట్ చేసుకునేందుకు వీలుగా ఇది 3.5mm జాక్‌తో వచ్చింది. దీని ధర రూ.1898.

    Ketsicart Call Center Headset

    బ్యాక్‌గ్రౌండ్ నాయిస్‌ను కంప్లీట్‌గా కంట్రోల్ చేయడంలో ఇది గొప్పగా సహాయపడుతుంది. ఈ హెడ్‌ఫోన్ ఎక్కువగా కాల్‌సెంటర్‌లో పనిచేసేవారికి ఉపయోగపడుతుంది. అలాగే నిత్యం ఆన్‌లైన్ మీటింగ్‌లో ఉండేవారికి కూడా ఈ హెడ్‌ఫోన్ మంచి ఛాయిస్. దీని అసలు ఖరీదు రూ.6,165 కాగా ప్రస్తుతం అమెజాన్‌లో రూ.4,110 వద్ద లభిస్తోంది.

    Ketsicart Call Center Headset

    ఈ హెడ్‌ఫోన్‌ సెట్ బెస్ట్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్‌ను కలిగి ఉంది. డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్‌కు USB పోర్ట్‌తో కనెక్ట్ చేసుకోవచ్చు. కాల్‌సెంటర్, ఆన్‌లైన్‌ కాల్స్‌లో నిత్యం గడిపేవారికి ఇది బాగా యూజ్ అవుతుంది. ఈ హెడ్‌ఫోన్ సెట్ 33శాతం డిస్కౌంట్‌తో అమెజాన్‌లో ₹4,169కే లభిస్తోంది.

    Decdeal Call Center Headset

    కాల్‌సెంటర్‌లో పనిచేసేవారికి ఈ హెడ్‌సెట్ ఉద్దేశించింది.  సౌండ్ అడ్జస్టబుల్ మైక్రోఫోన్ ఇది. ఆఫీస్ డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్‌కు ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్‌ను కలిగి ఉంటుంది. దీని అసలు ధర రూ. 10,299 కాగా అమెజాన్‌లో ప్రస్తుతం రూ.5,149 వద్ద కొనుగోలు చేసుకోవచ్చు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version