Best OnePlus Phones: టాప్‌ వన్‌ప్లస్‌ మెుబైల్‌ కోసం వెతుకుతున్నారా? అయితే వీటిని ట్రై చేయండి!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Best OnePlus Phones: టాప్‌ వన్‌ప్లస్‌ మెుబైల్‌ కోసం వెతుకుతున్నారా? అయితే వీటిని ట్రై చేయండి!

    Best OnePlus Phones: టాప్‌ వన్‌ప్లస్‌ మెుబైల్‌ కోసం వెతుకుతున్నారా? అయితే వీటిని ట్రై చేయండి!

    October 19, 2023

    దేశంలో మంచి గుడ్‌విల్‌ ఉన్న మెుబైల్‌ తయారీ కంపెనీల్లో వన్‌ప్లస్‌ (OnePlus) ఒకటి. ఈ కంపెనీ రిలీజ్‌ చేసే స్మార్ట్‌ఫోన్లు అత్యాధునిక ఫీచర్లను కలిగి ఉంటాయి. బడ్జెట్‌ పరంగా చూసుకున్న ఇవి అందుబాటు ధరలోనే ఉంటాయి. అందుకే మెుబైల్ ప్రియుల్లో ఎక్కువ మంది వన్‌ప్లస్‌ ఫోన్‌ను తీసుకునేందుకు ఆసక్తి కనబరుస్తుంటారు. అయితే వన్‌ప్లస్‌ నుంచి చాలా మెుబైల్స్‌ మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఏది కొనాలో తెలియక చాలా మంది సతమతమవుతుంటారు. ఈ సమస్యకు చెక్‌ పెట్టేందుకు ‘YouSay’ వన్‌ప్లస్‌ ఫోన్లలో బెస్ట్‌ జాబితాను రూపొందించింది. ఫీచర్లు, ధరతో సహా ఆయా ఫోన్ల సమాచారాన్ని మీ ముందుకు తీసుకొచ్చింది. వాటిపై ఓ లుక్కేయండి. 

    OnePlus Nord CE 2 Lite

    ఈ మెుబైల్‌ 6.59 అంగుళాల స్క్రీన్‌, 120 Hz రిఫ్రెష్‌ రేట్‌, 6GB RAM / 128GB స్టోరేజ్‌, 64 MP AI ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌, 5000 mAh బ్యాటరీ ఫీచర్లను కలిగి ఉంది. Nord CE 2 Lite అసలు ధర రూ.19,999. అమెజాన్‌ ఈ ఫోన్‌ను 10% డిస్కౌంట్‌తో రూ.17,998 అందిస్తోంది. 

    OnePlus Nord CE 3 Lite

    5G సపోర్ట్‌తో ఈ స్మార్ట్‌ఫోన్‌ తయారైంది. 6.72 అంగుళాల FHD+ స్క్రీన్‌, 120 Hz రిఫ్రెష్‌ రేట్‌, Android 13.1 ఆధారిత Oxygen OS, Qualcomm Snapdragon 695 ప్రొసెసర్‌, 108 MP మెయిన్‌ కెమెరా, 16MP సెల్ఫీ కెమెరా ఫీచర్లు ఇందులో ఉన్నాయి. అమెజాన్ ఈ ఫోన్‌ను రూ. 21,999కు ఆఫర్ చేస్తోంది. 

    Oneplus Nord CE 3 5G

    వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 5G స్మార్ట్‌ ఫోన్ అత్యుత్తమ ఫీచర్లను కలిగి ఉంది. ఈ మెుబైల్‌ 6.7 అంగుళాల Full HD+ స్క్రీన్‌, 5,000mAh బ్యాటరీ సామర్థ్యం, 50 MP + 8MP + 2MP ట్రిపుల్‌ రియర్‌ కెమెరా సెటప్‌, 16MP సెల్ఫీ కెమెరాను ఫోన్‌ కలిగి ఉంది. అలాగే 5G, 4G LTE, Wi-Fi, Bluetooth 5.2, NFC, GPS, A-GPS వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌ రూ.26,999కు అందుబాటులో ఉంది. 

    OnePlus Nord 3 5G 

    ఈ ఫోన్‌ ఆక్టాకోర్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 9,000 ప్రాసెసర్‌, ఆండ్రాయిడ్‌ 13 ఆధారిత ఆక్సిజన్‌ ఓఎస్‌13తో తయారైంది. 120Hz రీఫ్రెస్‌ రేట్‌ ఉన్న 6.74 అమోలెడ్‌ డిస్‌ప్లే, 50MP బ్యాక్ కెమెరా, 16MP సెల్ఫీ కెమెరా ఇందులో ఉన్నాయి. 80W Super VOOC ఛార్జింగ్‌ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని ఈ ఫోన్‌కు అందించారు. ఈ స్మార్ట్‌ఫోన్ అమెజాన్‌లో రూ.33,999లకు సేల్ అవుతోంది. 

    OnePlus 11R 5G

    వన్‌ప్లస్ 11ఆర్ 5జీ స్మార్ట్‌ఫోన్‌  6.7 అంగుళాల సూపర్ ఫ్లూయిడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్‌తో ఇది పనిచేస్తుంది. గేమ్స్ ఆడేవారి కోసం హైపర్‌బూస్ట్ గేమింగ్ ఇంజిన్, అడాప్టర్ ఫ్రేమ్ స్టెబిలైజర్ 4.0 ఫీచర్స్ ఉన్నాయి. ఆండ్రాయిడ్ 13 + ఆక్సిజన్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఇందులో 50మెగాపిక్సెల్ Sony IMX890 ప్రైమరీ కెమెరా + 8మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా + 2మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్లతో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఈ మెుబైల్‌ అమెజాన్‌లో రూ.39,999 అందుబాటులో ఉంది. 

    OnePlus 11 5G

    ఈ వన్ ప్లస్ ఫోన్ 6.7 అంగుళాల AMOLED QHD డిస్‌ప్లేను కలిగి ఉంది. అలాగే 50MP + 48MP + 32 MP ట్రిపుల్‌ రియర్‌ కెమెరా సెటప్‌ను ఫోన్‌కు అందించారు. Android 13 ఆధారిత Oxygen OSపై ఈ మెుబైల్‌ వర్క్ చేస్తుంది. 5000 mAh బ్యాటరీ, 16GB RAM /  256GB ROM వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version