Best Rice Cookers 2023: మార్కెట్‌లోని టాప్‌ రైస్‌ కుక్కర్స్‌… అన్నం వండటమే కాదు మరెన్నో..!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Best Rice Cookers 2023: మార్కెట్‌లోని టాప్‌ రైస్‌ కుక్కర్స్‌… అన్నం వండటమే కాదు మరెన్నో..!

    Best Rice Cookers 2023: మార్కెట్‌లోని టాప్‌ రైస్‌ కుక్కర్స్‌… అన్నం వండటమే కాదు మరెన్నో..!

    September 20, 2023

    ప్రస్తుతం కాలం మారింది. వంట గదుల్లోకి సైతం సాంకేతికత ప్రవేశించింది. దీంతో ఆహారాన్ని తయారు చేసుకోవడంలో వేగం పెరిగింది. ఒకప్పుడు అన్నం వండాలంటే అతిపెద్ద టాస్క్‌గా ఉండేది. ఎలక్ట్రిక్‌ రైస్‌ కుక్కర్‌ (Electric Rice Cooker) రాకతో అది ఎంతో తెలిగ్గా మారిపోయింది. ముఖ్యంగా కాలేజీ స్టూడెంట్స్‌, బ్యాచిలర్స్‌కు రైస్‌ కుక్కర్‌ తప్పనిసరిగా మారిపోయింది. ప్రస్తుతం మార్కెట్‌లో చాలా రైస్‌ కుక్కర్స్‌ అందుబాటులో ఉన్నాయి. అయితే వాటిలో ఏది కొనాలో తెలియక చాలా మంది కన్ఫ్యూజ్‌ అవుతున్నారు. అటువంటి వారి కోసం బెస్ట్‌ రైస్‌ కుక్కర్స్‌ జాబితాను YouSay మీ ముందుకు తీసుకొచ్చింది. అవేంటో ఇప్పుడు చూద్దాం. 

    Borosil 1.8-Liters Rice Cooker

    మార్కెట్‌లో లభిస్తున్న అత్యుత్తమ రైస్‌ కుక్కర్లలో Borosil 1.8-Liters Rice Cooker అత్యుత్తమైన నాణ్యతను కలిగి ఉంది. ఇది డిజిటల్‌ ఫంక్షన్స్‌ను కలిగి ఉంది. దీని ద్వారా రైస్‌నే కాకుండా కూరగాయాలు ఉడికించుకోవచ్చు. పలావ్‌ రైస్‌లు చేసుకోవచ్చు. ఈ కుక్కర్‌తో సూప్స్‌ కూడా పెట్టుకోవచ్చు. అమెజాన్‌లో ఈ కుక్కర్‌ రూ.4,492 లభిస్తోంది. 

    AGARO Regal Electric Rice Cooker

    మార్కెట్‌లో ఉన్న మరో అత్యుత్తమమైన రైస్‌ కుక్కర్‌ ‘AGARO Regal Electric Rice Cooker’ చెప్పుకోవచ్చు. దీని ద్వారా కూడా రైస్‌, కూరగాయాలు, ఇతర రకాల వంటలు చేసుకోవచ్చు. 3 లీటర్ల సామర్థ్యాన్ని ఇది కలిగి ఉంది. దీని అసలు ధర రూ.5,495. కానీ అమెజాన్‌ దీనిపై 27% డిస్కౌంట్‌ ప్రకటించింది. దీనివల్ల రూ.3,999కే ఈ రైస్‌ కుక్కర్‌ లభిస్తోంది. 

    Butterfly Raga 1.8 Liters Rice Cooker

    బటర్‌ఫ్లై కంపెనీకి చెందిన రైస్‌ కుక్కర్లకు మార్కెట్‌లో మంచి గుడ్‌విల్‌ ఉంది. ఈ కంపెనీకి చెందిన కుక్కర్‌ కొనాలని భావించేవారు Butterfly Raga 1.8 Liters Rice Cooker పరిశీలించవచ్చు. స్టెయిన్‌లెస్‌ స్టీల్‌తో ఈ కుక్కర్‌ తయారు చేశారు. 1.8 లీటర్ల సామర్థ్యాన్ని దీనికి అందించారు. దీని అసలు ధర రూ.4,295 కాగా, అమెజాన్‌లో ఇది రూ. 2,728 లభిస్తోంది. 36% డిస్కౌంట్ ఇవ్వడమే ఇందుకు కారణం. 

    Panasonic SRWA 18 

    పానాసోనిక్‌ కంపెనీ రైస్‌ కుక్కర్లకు కూడా మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంది. ఈ కంపెనీ రిలీజ్‌ చేసిన రైస్‌ కుక్కర్లలో Panasonic SRWA 18 ఆకట్టుకుంటోంది. ఇది ఆటో కుకింగ్‌ ఆప్షన్‌ను కలిగి ఉంది. రెండు సంవత్సరాల వారంటీని దీనికి అందించారు. ఈ కుక్కర్‌ ఒరిజినల్‌ కాస్ట్‌ రూ.3,295 కాగా, అమెజాన్‌లో ఇది రూ.2,449కే లభిస్తోంది. 

    Preethi RC 320 A18 

    క్వాలిటీ ఎలక్ట్రిక్‌ రైస్‌ కుక్కర్లను అందిస్తున్న కంపెనీల్లో ప్రీతి ఒకటి. ఈ కంపెనీ తయారు చేసిన Preethi RC 320 A18 రైస్‌ కుక్కర్‌ వినియోగదారు మన్ననలు పొందుతోంది. దీని ద్వారా త్వరగా ఎంతో తేలిగ్గా రైస్‌ను వండుకోవచ్చు. ఇది రెండు ప్యాన్‌ రైస్‌ కుక్కర్లతో వస్తోంది. అమెజాన్‌లో 29% రాయితీకి ఇది అందుబాటులో ఉంది. ఫలితంగా రూ.2,775కే దీన్ని పొందవచ్చు.

    Prestige PRWO 1.0 L Electric Rice Cooker

    తక్కువ బడ్జెట్‌లో మంచి రైస్‌ కుక్కర్‌ కోరుకునేవారు Prestige PRWO 1.0 ట్రై చేయవచ్చు. అమెజాన్‌లో ఇది రూ.1,699కే లభిస్తోంది. హీటింగ్‌పై 5 ఏళ్లు, కుక్కర్‌పై ఏడాది వారంటీ కూడా లభిస్తుంది. 

    SOLARA Automatic Rice Cooker

    దీంతో రైస్‌ ఒక్కటే కాకుండా బిర్యానీలు కూడా చేసుకోవచ్చు. ఒకేసారి కిలో రైస్‌ను వండుకోవచ్చు. ఐదుగురు సభ్యులున్న ఒక చిన్న ఫ్యామిలీకి ఇది సరిగ్గా సరిపోతుంది. దీని అసలు ధర రూ.4,999 కాగా, అమెజాన్‌ ఏకంగా  దీనిపై 60% డిస్కౌంట్‌ ప్రకటించింది. దీంతో ఈ ఎలక్ట్రిక్‌ రైస్‌ కుక్కర్‌ రూ.1,999 లభిస్తోంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version