ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ లేకుంటే రోజు గడవదు. ప్రతి విషయంలోనూ స్మార్ట్‌ఫోన్ వినియోగం తప్పనిసరి అయింది. ఈ నేపథ్యంలో చాలా మంది ఔత్సాహికులు వీటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే, బడ్జెట్ పరిమితి వీరికి పెద్ద ఆటంకంగా మారింది. ఈ నేపథ్యంలో మెరుగైన ఫీచర్లతో రూ.10 వేల లోపు లభ్యమవుతున్న ఫోన్లపై ఫోకస్ పెడుతున్నారు. ఆయా ఫోన్ల స్పెసిఫికేషన్ల ఆధారంగా అమెజాన్‌లో రూ. 10 వేల లోపు ధరలో అందుబాటులో ఉన్న కొన్ని మెరుగైన స్మార్ట్‌ఫోన్‌లేంటో చూద్దాం.
Samsung Galaxy M13
ఛార్జింగ్ ఎక్కువ సేపు ఉండాలని అనుకునే వారికి ఇదొక బెస్ట్ ఛాయిస్. సామ్‌సంగ్ గెలాక్సీ ఎం13 ఫోన్ 6000mAh బ్యాటరీ కెపాసిటీతో వస్తోంది. సామ్‌సంగ్ ఎగ్జినోస్ 850 చిప్‌సెట్‌తో 2GHz ఆక్టాకోర్ ప్రాసెసర్‌తో తయారైంది. 50MP+ 5MP+ 2MP ట్రిపుల్ కెమెరా సెటప్‌ని కలిగి ఉంది. 4 GB RAM, 64GB ఇంటర్నల్ మెమొరీ, ఆండ్రాయిడ్ 12 వెర్షన్‌ని సపోర్ట్ చేస్తుంది. అమెజాన్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.9,699కి లభిస్తోంది.
Motorola Moto G42
మోటారోలా కంపెనీ నుంచి వచ్చిన మోటో జీ42 స్మార్ట్‌ఫోన్ ధర రూ.9,999. స్నాప్‌డ్రాగన్ 680 చిప్‌సెట్‌తో 2.4GHz ఆక్టాకోర్ ప్రాసెసర్‌తో ఇది తయారైంది. 5000 mAh బ్యాటరీ సామర్థ్యంతో 20W ఫాస్ట్ ఛార్జింగ్ అడాప్టర్‌తో వస్తోంది. 8.26మిల్లీమీటర్ మందంతో ఫోన్ చాలా స్లిమ్‌గా ఉంటుంది. 6.47 అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేని కలిగి ఉంటుంది. 4GB RAM, 64 GB ఇంటర్నల్ మెమొరీతో వస్తోంది. 50MP+8MP+2MP ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది.
Infinix Hot 30i
ఇన్ఫీనిక్స్ హాట్ 30i ఫోన్‌లో మెరుగైన ఫీచర్లు ఉన్నాయి. 5000mAh బ్యాటరీ. 8GB RAM, 128GB ఇంటర్నల్ మెమొరీతో వస్తోంది. హీలియో జీ37 చిప్‌సెట్‌తో 2.37 GHz ఆక్టాకోర్ ప్రాసెసర్‌ని కలిగి ఉంది. 50MP డ్యుయల్ కెమెరాతో వస్తోంది. సెల్ఫీ కెమెరా 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఆండ్రాయిడ్ 12 వెర్షన్‌ని సపోర్ట్ చేస్తుంది. అమెజాన్‌లో ఈ ఫోన్ ధర రూ.9,999గా ఉంది.
Micromax IN Note1
దేశీయ కంపెనీ మైక్రోమాక్స్ నుంచి వచ్చిన ఐఎన్ నోట్ 1 ఫోన్‌లో మంచి ఫీచర్లు ఉన్నాయి. మీడియాటెక్ హీలియో జీ85 చిప్‌సెట్‌తో 2GHz ఆక్టాకోర్ ప్రాసెసర్‌తో వస్తుంది. 5000mAh బ్యాటరీ సామర్థ్యంతో యూజర్లను ఆకర్షిస్తోంది. 4GB RAM, 64 GB ఇంటర్నల్ మెమొరీని కలిగి ఉంది. ఈ ఫోన్ అమెజాన్‌లో రూ.9,390కే లభిస్తోంది.
Tecno Spark 10C
ర్యామ్, స్టోరేజీకి ప్రాధాన్యత ఇచ్చే వారు ఈ ఫోన్‌ను పరిశీలించవచ్చు. 8GB RAM, 128GB ఇంటర్నల్ స్టోరేజీతో వస్తోంది. 5000mAh బ్యాటరీ కెపాసిటీ అదనపు ఆకర్షణ. 6.6 అంగుళాల ఐపీఎస్ స్క్రీన్‌తో డిజైన్ అయింది. యునిసోక్ టీ606 చిప్‌సెట్‌తో 2Hz ఆక్టాకోర్ ప్రాసెసర్‌తో తయారైంది. ఆండ్రాయిడ్ 12.0 వెర్షన్‌ని సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ ధర రూ.9,999గా ఉంది.