Best Smartphones Under INR 10000: రూ.10 వేల లోపు లెటెస్ట్ బెస్ట్ స్మార్ట్‌ ఫోన్స్ ఇవే!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Best Smartphones Under INR 10000: రూ.10 వేల లోపు లెటెస్ట్ బెస్ట్ స్మార్ట్‌ ఫోన్స్ ఇవే!

    Best Smartphones Under INR 10000: రూ.10 వేల లోపు లెటెస్ట్ బెస్ట్ స్మార్ట్‌ ఫోన్స్ ఇవే!

    September 10, 2024

    ఈ డిజిటల్ యుగంలో స్మార్ట్‌ ఫొన్‌లు ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో ముఖ్యమైన భాగంగా మారాయి. సమాచార మార్పిడిలోనూ, వినోద కేంద్రాలుగా అలరిస్తున్నాయి. ఒక్క మంచి స్మార్ట్ ఫొన్ చేతిలో ఉంటే అరచేతిలోనే అన్ని పనులు పూర్తయ్యే వెసులుబాటు ఉంటుంది. అయితే ఈరోజుల్లో కుప్పలు తెప్పలుగా వచ్చిపడుతున్న స్మార్ట్‌ ఫొన్ల నుంచి అన్ని విధాలుగా మన్నికైన ఫొన్‌ను ఎంంచుకుని కొనాలంటే తలకు మించిన భారంగా మారుతోంది. ఈ క్రమంలో బడ్జెట్ ధరలో అన్ని విధాల మంచి స్మార్ట్ ఫొన్‌ల లిస్ట్‌ను మీకు అందిస్తున్నాం. వీటిపై ఓ లుక్‌ వేయండి మరి.

    మీరు ఒక వేళ రూ.10 వేల లోపు మంంచి స్మార్ట్ ఫొన్‌ కోసం వెతికితే మాత్రం… ఈ ఫొన్‌లు మీకు బెస్ట్‌ ఛాయిస్‌ అని చెప్పవచ్చు. వాటి ధర, ప్రత్యేకతలు ఒక్కొక్కటిగా పరిశీలిద్దాం.

    Itel Color Pro 5G

    డిస్ప్లే: 6.78 ఇంచెస్ టచ్‌ స్క్రీన్, 1620 x 720 HD+ పిక్సెల్‌ల డిస్‌ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది.

    ప్రాసెసర్: ఇందులో శక్తివంతమైన  5G ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్‌సిటీ 6080 ప్రాసెసర్ యూజ్ చేశారు. ఈ ఫొన్ రెండు 12GB ROM, 256GB వేరియంట్లలో లభిస్తోంది.

    కెమెరా: దీని మెయిన్ కెమెరా 50MP, 2MP అల్ట్రావైడ్ కెమెరాతో రానుంది. ఫ్రంట్ కెమెరా మాత్రం 8MP సెట్‌ ఉంటుంది. దీనివల్ల ఫొటోలు మరింత షార్ప్‌గా వస్తాయి. 

    బ్యాటరీ: 5000mAh కెపాసిటీ బ్యాటరీ సామర్థ్యంతో వస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపొర్ట్ చేస్తుంది.

    సాఫ్ట్‌వేర్: Android 13, OriginOS 3.0 ఆధారంగా రన్‌ అవుతుంది.

    మెమోరీ: ఈ ఫోన్‌లో 128జీబీ ఇన్‌బిల్ట్ RAM, మైక్రో SD కార్డ్ ద్వారా మరో 1000జీబీ వరకు సపోర్ట్‌ చేస్తుంది.

    Moto G04s

    రూ.10 వేల లోపు బెస్ట్ స్మార్ట్ ఫొన్ ఛాయిస్‌లలో Moto G04s ఒకటి. దీని ప్రత్యేకమైన డిజైన్, బిల్డ్ క్వాలిటీ ప్రిమియంగా ఉంటాయి.

    డిస్‌ప్లే- 6.56-inch టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే, 1612*720 పిక్సెల్ రెజల్యూషన్‌తో వస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 వాడటం వల్ల స్టైల్‌తో పాటు మన్నికను కలిగి ఉంటుంది.  

    ప్రాసెసర్- Moto G04s శక్తివంతమైన  MyUX ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 14పై రన్‌ అవుతుంది.  4 GB RAMని కలిగి ఉండి ఎలాంటి ఫ్రేమ్ డ్రాప్స్ లేకుండా మంచి పనితీరును కనబరుస్తుంది.

    కెమెరా- ఇది 5 MP ఫ్రంట్ కెమెరా, 50MP రియర్ కెమెరా సిస్టమ్‌తో తయారైంది. ఇది అద్భుతమైన ఫోటోలు వీడియోలను  తీయగలదు. ప్రాసెస్ చేయగలదు. 

    బ్యాటరీ- 5000 mAh బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. కేవలం 30 నిమిషాల్లో 50% వరకు ఛార్జ్ అవుతుంది. 5G, 4G, 3G కనెక్టివిటీతో డ్యూయల్ సిమ్ ఫీచర్‌ను అందిస్తుంది.

    Samsung Galaxy M14 4G

    రూ. 10 వేల లోపు ఇది మంచి బ్రాండెడ్ ఫోన్‌లలో ఒకటి అని చెప్పవచ్చు.

    డిస్‌ప్లే- 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లేతో 90HZ రీఫ్రెష్‌ రేటుతో వచ్చింది. గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్‌తో డిస్‌ప్లే మరింత స్ట్రాంగ్‌గా తయారైంది. దీని డీజైన్ చేతికి మంచి ఫీలింగ్ కలిగించును. రూ.10 వేలలో మోస్ట్ రెటేడ్ స్మార్ట్‌ ఫొన్‌గా చెప్పవచ్చు.

    ప్రాసెసర్- ఈ గ్యాడ్జెట్ Qualcomm Snapdragon 680 Processor

    పై రన్‌ అవుతుంది. 8 GB RAM స్మూత్ ఫర్ఫామెన్స్‌ను అందిస్తుంది. దీనిలో ఇంటర్నల్ స్టోరేజ్ 128 వరకు అందిస్తోంది. అయితే దీనిని పెంచుకునే వీలును మాత్రం శామ్‌సంగ్ కల్పించలేదు. 

    కెమెరా-  M14 లో మెయిన్ కెమెరా 50 MP + 2 MP + 2MP ట్రిపుల్ కెమెరా సిస్టమ్‌ను కలిగి ఉంటుంది. ఫ్రంట్ కెమెరా 13MP వరకు ఉంటుంది.  ఇది లోలైట్‌లో అద్భుతమైన ఫొటోలు అందిస్తుంది.

    బ్యాటరీ-  5000 mAh బ్యాటరీతో ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్ చేస్తుంది. గెలాక్సీ M14 డ్యూయల్ సిమ్ క్యాపబులిటీని అందిస్తుంది. అలాగే 4G, 3G నెట్‌వర్క్ కనెక్టివిటిని కలిగి ఉంటుంది.

    Samsung Galaxy M13 5G

    రూ.10 వేల లోపు బెస్ట్ స్మార్ట్‌ ఫొన్ ఎంపికల్లో ఇది అగ్రభాగాన నిలుస్తుంది. దీని బ్యాటరీ, కెమెరా, డిస్‌ప్లే, ప్రాసెసర్‌లు ఈ సెగ్‌మెంట్లలోని ఫొన్లతో పోలిస్తే కాస్త అడ్వాన్స్‌గా ఉన్నాయి.

    డిస్‌ప్లే- 6.5 అంగుళాల లార్జ్‌ డిస్‌ప్లేను కలిగి ఉండటంతో పాటు HD+రెజల్యూషన్‌ను అందిస్తుంది. డిస్‌ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ రక్షణ కలిగి ఉంటుంది.

    4GB, 6GB RAM వేరియంట్లలో అందుబాటులో ఉంది.

    ప్రాసెసర్: Snapdragon 680 Processor కలిగి ఉండి Android 12 రన్‌ అవుతుంది.

    కెమెరా- 50 మెగా ఫిక్సెల్ మెయిన్ కెమెరా+ 2MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా సెటప్ కలిగి ఉండి మంచి ఫోటోలు తీస్తుంది. సెల్ఫీ కెమెరా 5MP సెన్సార్‌తో బోకె ఎఫెక్ట్‌ అందిస్తుంది.

    బ్యాటరీ-5000mAh లాంగ్ లైఫ్ బ్యాటరీని అందిస్తోంది. ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది.

    కనెక్టివిటీ:  5Gలోని అన్ని బ్యాండ్ల కనెక్టివిటిని దాదాపుగా కలిగి ఉంది.

    Vivo Y16

    డిస్ప్లే: 6.51 ఇంచెస్ టచ్‌ స్క్రీన్, 720 x 1600 HD+ పిక్సెల్‌ల డిస్‌ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది.

    ప్రాసెసర్: ఇందులో శక్తివంతమైన  5G ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్‌సిటీ 6080 ప్రాసెసర్ యూజ్ చేశారు. ఈ ఫొన్ రెండు 12GB ROM, 256GB వేరియంట్లలో లభిస్తోంది.

    కెమెరా: దీని మెయిన్ కెమెరా 113MP, 2MP అల్ట్రావైడ్ కెమెరాతో రానుంది. ఫ్రంట్ కెమెరా మాత్రం 5MP సెట్‌ ఉంటుంది. దీనివల్ల ఫొటోలు మరింత అందంగా వస్తాయి.

    బ్యాటరీ: 5000mAh కెపాసిటీ బ్యాటరీ సామర్థ్యంతో వస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపొర్ట్ చేస్తుంది.

    సాఫ్ట్‌వేర్: Android 12, OriginOS 3.0 ఆధారంగా రన్‌ అవుతుంది.

    మెమోరీ: ఈ ఫోన్‌లో 128జీబీ ఇన్‌బిల్ట్ ROM, 4GB RAM సెటప్‌తో వస్తుంది.

    డ్యూయల్ నానో సిమ్ సెటప్‌ సపోర్ట్‌ చేస్తుంది. 

    కనెక్టివిటీ: Vivo Y16లో Wi-Fi, GPS, బ్లూటూత్ v5.00, USB OTG, USB టైప్-C, FM రేడియో మరియు 4G ఉన్నాయి. 

    ఫోన్‌లోని సెన్సార్‌లలో యాక్సిలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, కంపాస్/మాగ్నెటోమీటర్, గైరోస్కోప్, ప్రాక్సిమిటీ సెన్సార్, ఫింగర్‌ప్రింట్ సెన్సార్ కలిగి ఉంటుంది..

    Tecno Spark 9

    రూ. 10 వేల లోపు మంచి స్మార్ట్‌  ఫోన్‌లలో ఇది ఒకటి అని చెప్పవచ్చు.

    డిస్‌ప్లే- 6.6 ఇంచెస్ హెచ్‌డీ డిస్‌ప్లేతో 90HZ రీఫ్రెష్‌ రేటుతో వచ్చింది. గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్‌తో డిస్‌ప్లే మరింత స్ట్రాంగ్‌గా తయారైంది. దీని డీజైన్ చేతికి మంచి ఫీలింగ్ కలిగించును.

    ప్రాసెసర్- ఈ గ్యాడ్జెట్ ఆక్టా కోర్ మీడియా టెక్ హెలియో G37 Processorతో పని చేస్తుంది.

    6 GB RAM స్మూత్ ఫర్ఫామెన్స్‌ను అందిస్తుంది. దీనిలో ఇంటర్నల్ స్టోరేజ్ 64జీబీ, 128జీబీ వరకు అందిస్తోంది. అయితే దీనిని పెంచుకునే వీలు మాత్రం కల్పించలేదు. 

    కెమెరా-  Tecno Spark 9లో మెయిన్ కెమెరా 13 MP సిస్టమ్‌ను కలిగి ఉంటుంది. ఫ్రంట్ కెమెరా 8MP వరకు ఉంటుంది.  ఇది లోలైట్‌లో కూడా ఫొటోలు అందిస్తుంది.

    బ్యాటరీ-  5000 mAh బ్యాటరీతో ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్ చేస్తుంది. Tecno Spark 9  డ్యూయల్ సిమ్ క్యాపబులిటీని అందిస్తుంది. అలాగే 4G, 3G నెట్‌వర్క్ కనెక్టివిటిని కలిగి ఉంటుంది.

    కనెక్టివిటీ- Tecno Spark 9..  Wi-Fi, GPS, 3G, 4G LTE బ్యాండ్ కనెక్టివిటీని సపోర్ట్ చేస్తుంది. ఫోన్‌లోని సెన్సార్‌లలో యాక్సిలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, ఫింగర్‌ప్రింట్ సెన్సార్ అందుబాటులో ఉంటాయి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version