ఈ రోజుల్లో గ్యాడ్జెట్ ప్రియులు స్మార్ట్‌వాచ్‌లపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మంచి ఫీచర్లతో కూడిన గ్యాడ్జెట్లను పొందాలంటే రూ.5 వేలకు పైనే వెచ్చించాల్సి ఉంటుంది. స్మార్ట్‌వాచ్ కొనాలనే ఆసక్తి ఉన్నా ధర ఎక్కువగా ఉండటంతో కొందరు ఔత్సాహికులు వెనకడుగు వేస్తుంటారు. అయితే, ఇలాంటి వారి కోసం కంపెనీలు బెస్ట్ ఫీచర్లతో తక్కువ ధరకే స్మార్ట్‌వాచ్‌లను అందజేస్తున్నాయి. బేసిక్ ఫీచర్లతో వీటిని ఇంట్రడ్యూస్ చేస్తున్నాయి. ఈ క్రమంలో రూ.2 వేల లోపు లభించే బెస్ట్ స్మార్ట్‌వాచ్‌లేంటో తెలుసుకుందాం.
bOAt watch blaze
బోట్ స్మార్ట్‌వాచ్ అందుబాటు ధరల్లోనే మంచి ఫీచర్లతో స్మార్ట్‌వాచ్‌ని అందిస్తోంది. బోట్ వాచ్ బ్లేజ్ స్మార్ట్‌వాచ్ రూ.1,999కే లభిస్తోంది. 1.75 అంగుళాల హై డెఫినేషన్ డిస్‌ప్లేతో వస్తోంది. అపోలో 3 ప్లస్ ప్రాసెసర్‌తో ఇది తయారైంది. ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే సగటుగా 7 రోజుల వరకు బ్యాటరీ లైఫ్‌ని అందించగలదు. రెగ్యులర్ స్మార్ట్‌వాచ్‌లలో ఉండే SPo2, హెల్త్ మానిటర్, తదితర ఫీచర్లు దీని సొంతం.
Noise ColorFit Pulse
ఎక్కువ బ్యాటరీ లైఫ్‌తో నాయిస్ కలర్‌ఫిట్ పల్స్ స్మార్ట్‌వాచ్ అందుబాటులోకి వస్తోంది. ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 10 రోజుల పాటు సేవలు అందించగలదు. 1.4 అంగుళాల ఫుల్ టచ్ డిస్‌ప్లేతో ఇది రూపుదిద్దుకుంది. హార్ట్ రేట్, స్లీప్, ఎస్పీవో2, తదితర హెల్త్ ట్రాక్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఆండ్రాయిడ్, ఐవోఎస్ యూజర్లకు ఇది సపోర్ట్ చేస్తుంది. రాయల్ బ్లూ, ఆలివ్ గ్రీన్, తదితర రంగుల్లో ఈ స్మార్ట్‌వాచ్ అందుబాటులో ఉంది. ధర రూ.1,199 మాత్రమే.
DIZO Watch D2 Power
డిజో వాచ్ డీ2 పవర్ భారీ డిస్‌ప్లేతో వస్తోంది. 1.91 అంగుళాల డిస్‌ప్లేని ఇది కలిగి ఉంది. 500 నిట్స్ హై బ్రైట్‌నెస్‌కి సపోర్ట్ చేయగలదు. ఈ స్మార్ట్‌వాచ్ బ్యాటరీ లైఫ్ 10 రోజులు. 24 స్పోర్ట్స్ మోడ్‌లు కూడా ఉన్నాయి. ఇన్- యాప్ జీపీఎస్ సదుపాయం ఉంది. కాల్స్ మాట్లాడే సమయంలో నాయిస్ క్యాన్సలేషన్ ఫెసిలిటీ సపోర్ట్ చేస్తుంది. 150కు పైగా స్టైలిష్ వాచ్ ఫేసెస్ ఇందులో ఉన్నాయి. బ్లాక్, బ్లూ, గ్రే రంగుల్లో లభ్యమవుతోంది. ధర రూ.1,799.
beatXP Marv Neo
స్మార్ట్ ఏఐ వాయిస్ అసిస్టెంట్ ఫీచర్‌తో వస్తోంది ఈ స్మార్ట్‌వాచ్. ఫాస్ట్ ఛార్జింగ్‌కి సపోర్ట్ చేస్తుంది. కనీసం 7 రోజుల పాటు బ్యాటరీ బ్యాకప్‌ని అందిస్తుంది. 1.85 అంగుళాల డిస్‌ప్లేతో 560 నిట్స్ హై బ్రైట్‌నెస్‌కి సపోర్ట్ చేస్తుంది. ఎస్పీవో2, హార్ట్ రేట్, బ్లడ్ ప్రెషర్, స్లీప్ ట్రాకర్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. వందకు పైగా స్పోర్ట్స్ మోడ్స్ ఉన్నాయి. బ్లాక్, బ్లూ, ఛాంపియన్ గోల్డ్, సిల్వర్, ఐస్ సిల్వర్, గ్రీన్ కలర్స్‌లలో మార్వ్ నియో స్మార్ట్ వాచ్ లభ్యమవుతోంది. దీని ధర రూ.1,499.
Fire-Boltt Phoenix Pro
మెటల్ బాడీతో ఫైర్ బోల్ట్ ఫీనిక్స్ ప్రో స్మార్ట్‌వాచ్ రూపుదిద్దుకుంది. ఏఐ వాయిస్ అసిస్టెంట్ ఫీచర్ దీనికి సపోర్ట్ చేస్తుంది. 1.39అంగుళాల హై డెఫినేషన్ డిస్‌ప్లే దీని సొంతం. హార్ట్ రేట్ మానిటర్, ఎస్పీవో2 స్థాయులను ఈ స్మార్ట్‌వాచ్ ట్రాక్ చేస్తుంది. 120కి పైగా స్పోర్ట్స్ మోడ్స్‌ని కలిగి ఉంది. బ్లాక్, పింక్, సిల్వర్, తదితర రంగుల్లో లభ్యమవుతుంది. గరిష్ఠంగా 7 రోజుల పాటు బ్యాటరీ బ్యాకప్ అందిస్తుంది. దీని ధర రూ.1,499.
TAGG Engage Lite
బిల్ట్ ఇన్ గేమ్స్, క్యాలిక్యులేటర్, స్మార్ట్‌వాచ్ వంటి అప్లికేషన్లతో వస్తోందీ స్మార్ట్‌వాచ్. అడ్వాన్స్‌డ్ కాలింగ్ ఫీచర్లను ఇది కలిగి ఉంది. ఏఐ వాయిస్ అసిస్టెంట్, ఎస్పీవో2 ట్రాకర్ తదితర ఫీచర్లతో వస్తోంది. 1.69 అంగుళాల క్రిస్టల్ హై డెఫినేషన్ డిస్‌ప్లేని కలిగి ఉంది. 10 నిమిషాల పాటు ఛార్జ్ చేస్తే 12 గంటల పాటు సేవలు అందించగలదు. 5 రోజుల బ్యాటరీ బ్యాకప్‌ని అందించనుంది. బ్లూ టూత్ కాలింగ్ ఫీచర్‌ని వాడితే 3 రోజుల పాటు సర్వీస్ ఇస్తుంది. దీని ధర రూ.1,832.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!