Best Tattoo Studios in Hyderabad: టాప్‌ టాటూ స్టూడియో కావాలా? వీటిని ట్రై చేయండి! ధర కూడా తక్కువే!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Best Tattoo Studios in Hyderabad: టాప్‌ టాటూ స్టూడియో కావాలా? వీటిని ట్రై చేయండి! ధర కూడా తక్కువే!

    Best Tattoo Studios in Hyderabad: టాప్‌ టాటూ స్టూడియో కావాలా? వీటిని ట్రై చేయండి! ధర కూడా తక్కువే!

    February 1, 2024

    పచ్చబొట్టు (Tattoos) వేసుకోవడం అనేది పురాతన కళ. ఒకప్పుడు ఇవి నలుపు, ముదురాకుపచ్చ రంగుల్లో ఉండేవి. పెరుగుతున్న టెక్నాలజీకి అనుగుణంగా టాటూస్‌లో ఎన్నో మార్పులు వచ్చాయి. ప్రత్యేకించి టాటూస్ కోసం ఆర్టిస్టులు పుట్టుకొచ్చారు. ఆకర్షణీయమైన రంగుల్లో, కోరుకున్న ఆకృతులను వారు శరీరంపై వేస్తుండటంతో యువత కూడా టాటూస్‌ వైపు ఆకర్షితులవుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో వందల సంఖ్యలో టాటూస్‌ స్టూడియోలు వెలిశాయి. దీంతో కొత్తగా టాటూస్‌ వేయించుకోవాలని భావించే వారు ఏ సెంటర్‌కు వెళ్లాలో తెలియక తికమకపడుతున్నారు. అటువంటి వారి కోసం హైదరాబాద్‌లోని బెస్ట్‌ టాటూస్‌ స్టూడియోలను YouSay మీ ముందుకు తెచ్చింది. అవేంటో ఇప్పుడు చూద్దాం. 

    Angel Tattoo & Piercing

    హైదరాబాద్‌లో బాగా పాపులర్‌ అయిన టాటూ స్టూడియోలలో ‘Angel Tattoo & Piercing’ ఒకటి. అవార్డ్‌ విన్నింగ్‌ టాటూ ఆర్టిస్ట్‌ అమీన్‌ సుల్తాన్‌ హజైనీ ఈ స్టూడియోను స్థాపించారు. సికింద్రాబాద్‌లోని రామ్‌గోపాల్‌పేట ప్రాంతంలో ఇది ఉంది. మెుత్తం ఆరుగురు ఆర్టిస్టులు ఇక్కడ అందుబాటులో ఉంటారు. ఎటువంటి క్లిష్టమైన ఆకృతినైనా వీరు స్టైలిష్‌గా ముద్రిస్తారు. కనీస టాటూ ధర రూ.1000గా ఉంది. 

    Koru Ink

    టాటూ ఆర్టిస్ట్‌ సుభోజిత్‌ చక్రవర్తి దీన్ని స్థాపించారు. ఇది కూడా సికింద్రాబాద్‌ రామ్‌గోపాల్‌పేట్‌ దగ్గర ఉంది. హైపర్‌రియలిజం, అబ్‌స్ట్రాక్ట్‌, ఫ్రీస్టైల్‌, విజనరి ఆర్ట్‌ టాటూస్‌ వేయడం స్టూడియో ప్రత్యేకత. ఇక్కడ టాటూ కనీస ధర రూ.2,500.

    Hakim’s Aalim

    ఈ టాటూ పార్లర్‌ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఫేమస్‌. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో ఆలీం హకీం దీన్ని ఏర్పాటు చేశారు. వీరికి బెంగళూరు, ముంబాయి, దుబాయ్‌లో కూడా ఫ్రాంచైజీలు ఉన్నాయి. తలపైన కూడా టాటూ వేయడం వీరి ప్రత్యేకత. ఇక్కడ టాటూస్‌ ధరలు రూ.2,500 నుంచి ప్రారంభం అవుతాయి.

    Joysen Tattoos

    తొలుత కోల్‌కత్తాలో ఏర్పాటైన ఈ టూటూస్‌ స్టూడియో (Hyderabad Best Tattoo Studios) 12 ఏళ్ల క్రితం హైదరాబాద్‌కు మార్చబడింది. జూబ్లీహిల్స్‌లో ఉన్న ఈ స్టూడియోలో అనుభవజ్ఞులైన టాటూస్‌ ఆర్టిస్టులు ఉన్నారు. వాటర్‌ కలర్‌ ఎఫెక్ట్‌ టాటూస్‌ ఈ స్టూడియో ప్రత్యేకతగా చెప్పవచ్చు. తొలిసారి టాటూ కోసం వచ్చిన వారు తమ పని తనం నచ్చి  మళ్లీ మళ్లీ వస్తున్నారని నిర్వాహకులు తెలిపారు. వీరి వద్ద రూ.500 నుండి టాటూ ప్రైస్ స్టార్ట్‌ అవుతుంది. 

    Destino Tattoo Studio

    సింపుల్‌ & గుడ్‌ లుకింగ్‌ టాటూస్‌ను కోరుకునే వారికి ఈ టూటూస్‌ స్టూడియోస్‌ బెస్ట్‌ ఆప్షన్‌. ఇది మాధాపూర్‌లో ఉంది. మహిళా టూటూస్‌ ఆర్టిస్ట్‌ విజయ దుర్గా ఇక్కడ సేవలు అందిస్తున్నారు. ముఖ్యంగా యువతులకు ఈ టాటూస్‌ స్టూడియో (Hyderabad Best Tattoo Studios)  చాలా ఫేమస్‌. అపాయింట్‌మెంట్‌ ద్వారా తమ టైమ్‌ షెడ్యూల్‌ను ఫిక్స్‌ చేసుకోవచ్చు. ఇక్కడ టాటూస్‌ రూ.1000 నుంచి మెుదలవుతాయి.

    Vinnu’s Body Art Studio Tattoos

    చేతులు, కాళ్లు శరీరంపై అందమైన టాటూస్ కోరుకునే వారు ఈ స్టూడియోను సంప్రదించవచ్చు. ఇక్కడ ఎంతో శుచి – శుభ్రతను పాటిస్తూ నిబంధనలకు అనుగుణంగా టూటాస్‌ వేస్తారు. కస్టమర్లు కచ్చితంగా 18 ఏళ్ల వయసు నిండివారై ఉండాలి. మీకు కావాల్సిన విధంగా, నచ్చిన స్టైల్‌లో ఇక్కడి ఆర్టిస్టులు టాటూస్‌ వేస్తారు. ఇది హైదరాబాద్‌లోని ముషిరాబాద్‌లో ఉంది. మరిన్ని వివరాలకు కింద ఉన్న లింక్‌పై క్లిక్ చేయండి. టాటూ  ప్రారంభ ధర రూ.1000గా ఉంది.

    7 hills tattoo studio

    హైదరాబాద్‌ బేగంపేటలోని ఈ స్టూడియో (Hyderabad Best Tattoo Studios) కూడా నగరంలో మంచి పేరు ఉన్న టాటూస్‌ సెంటర్‌గా గుర్తింపు పొందింది. తాత్కాలిక, శాశ్వతమైన కలర్‌ టాటూస్‌ను వేయడం వీరి ప్రత్యేకతగా చెప్పవచ్చు. దేవుళ్లకు సంబంధించిన టాటూస్‌ను కూడా ఇక్కడి ఆర్టిస్టులు ఎంతో అందంగా ముద్రిస్తారు. స్టార్టింగ్‌ ప్రైస్‌ రేంజ్‌ రూ.1000-1500.

    Blaze tattoo studio

    హైదరాబాద్‌ ఫోరం మాల్‌ సమీపంలోని ఈ టాటూస్‌ స్టూడియో కస్టమర్ల నుంచి 5స్టార్‌ రేటింగ్‌ను కలిగి ఉంది. 3D టాటూస్‌, బటర్‌ఫ్లై టాటూస్‌ ఇలా 16 రకాల విభిన్నమైన టాటూస్‌ కళాకృతులను వీరు ఆఫర్ చేస్తున్నారు. యువతుల కోసం ప్రత్యేకంగా ఫీమేల్ ఆర్టిస్టు కూడా ఇక్కడ ఉంది. ఈ స్టూడియోలో 24 గంటల సర్వీసును పొందవచ్చు. టాటూ డిజైన్‌ను బట్టి రూ.1000 నుంచి రూ.3000 వరకూ ఛార్జ్‌ చేస్తారు. 

    Aliens Tattoo

    ఇది గచ్చిబౌలిలోని హౌసింగ్‌ బోర్డ్‌ కాలనీలో ఉంది. పెట్‌, పొట్రెయిట్‌, స్మాల్‌, రిలీజియస్‌, వాటర్‌ కలర్‌, జియోమెట్రిక్‌, కపుల్‌, ట్రావెల్‌ ఇలా విభిన్నమైన టాటూస్‌కు (Hyderabad Best Tattoo Studios) ఈ స్టూడియో ఫేమస్‌గా ఉంది. అటు రెడ్‌ఇట్‌లోనూ ఈ పార్లర్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇక్కడి సేవలు చాలా బాగున్నాయని, కొత్తగా టాటూ వేసుకునేవారు నిరభ్యంతరంగా Aliens Tattoo వెళ్లవచ్చని ఓల్డ్‌ కస్టమర్లు సూచిస్తున్నారు. ప్రైస్‌ రేంజ్‌ రూ.1,000-2,000.

    Machu Tattoos

    ప్రస్తుతం రెడ్‌ఇట్‌ (reddit) బాగా పాపులర్‌ (Hyderabad Best Tattoo Studios) అవుతున్న టాటూస్‌ స్టూడియో ‘Machu Tattoos’. ఈ స్టూడియోలో టాటూస్‌ వేయించుకున్న వారు తమ అనుభవాలను రెడ్‌ఇట్‌ ద్వారా తెలియజేస్తున్నారు. కొత్తగా టాటూస్‌ కోసం ప్రయత్నిస్తున్నవారికి ‘మచు టాటూస్‌’ బెస్ట్ ఆప్షన్ అవుతుందని పేర్కొంటున్నారు. కాగా, ఇది కొండాపూర్‌లోని ప్రశాంత్‌ నగర్‌ కాలనీలో ఉంది. నడుముపై భాగంలో వేసే టాటూస్‌కు ఈ స్టూడియో ఎంతో ఫేమస్‌. మీరు డాగ్‌ లవర్స్‌ అయితే ఈ స్టూడియో ద్వారా మీకు తిరుగుండదు. ఎందుకంటే ఇక్కడ కుక్క బొమ్మలను కూడా స్టైలిష్‌గా టాటూస్‌ రూపంలో ముద్రిస్తారు. ప్రైస్‌ రేంజ్‌ రూ.1500-2500.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version