ప్రస్తుతం వర్చువల్ రియాలిటీ అనేది దైనందిన జీవితంలో ఒక భాగంగా మారింది. జరిగే ప్రదేశంలో వాస్తవంగా మనం లేకున్నా … ఆ ప్రాంతంలో మనం ఉన్నట్లు ఓ రకమైన భ్రమను వర్చువల్ రియాలిటీ పరికరాలు కలిగిస్తాయి. VR హెడ్‌సెట్లను ఎక్కువగా గేమింగ్, సినిమాలు, వెబ్‌సిరీస్‌లు చూసేందుకు ఉపయోగిస్తున్నారు. మార్కెట్‌లో చాలా వర్చువల్ రియాలిటీ గ్యాడ్జెట్లు అయితే అందుబాటులో ఉన్నాయి. వాటిలో ప్రైస్ పరంగా బెస్ట్ వీఆర్ గ్యాడ్జెట్లు ఇక్కడ ఇస్తున్నాం. వాటిపై ఓ లుక్ వేయండి.
Domo N hanse
కేవలం రూ.178కే ఈ VR హెడ్‌సెట్ లభిస్తోంది. దీనిద్వారా సినిమా, వెబ్‌సిరీస్‌లు చూస్తున్నప్పుడు మంచి 3D ఎక్స్‌పీరియన్స్‌ను పొందవచ్చు. దీనిలో 25mm ఏస్పెరికల్ లెన్స్‌ను యూజ్ చేశారు. వీటిని సులభంగా తొలగించవచ్చు.
Virtual Reality Headset Glasses
ఇది మొబైల్ ఫోన్ ద్వారా బెస్ట్ VR అనుభూతి పొందాలనుకుంటే ఈ హెడ్‌సెట్ బెస్ట్ ఛాయిస్. ఇది లైట్‌వెయిట్‌తో 2K యాంటీ బ్లూలైట్ లెన్సెస్‌తో వస్తుంది. ఇందులో 3D లెన్స్ సూపర్ ఎక్స్‌పీరియన్స్‌ను అయితే ఇస్తుంది. దీని 6.53 అంగుళాల వైడ్ స్క్రీన్ మంచి సినిమాటిక్ అనుభూతిని పంచుతుంది. దీని ధర రూ.440.
IBS HD Virtual Reality Headset
రియల్ ఎన్విరాన్‌మెంట్‌లో గెమింగ్ ఆడాలనుకునే వారికి ఈ VR హెడ్‌సెట్ మంచి ఎంపిక. ఇది ఆండ్రాయిడ్, ఆపిల్ ఫొన్లకు కంపాటబులిటీ కలిగి ఉంటుంది. ఈ గ్యాడ్జెట్ ద్వారా బెటర్ సౌండ్ ఎక్స్‌పీరియన్స్ పొందవచ్చు. VR సినిమాలు, గేమ్స్ కోసం బాగా యూజ్ అవుతుంది. 1050 అంగుళాల స్క్రీన్‌ను 3మీటర్ల డిస్టెన్స్ నుంచి చూసిన అనుభూతి అయితే కలుగుతుంది. దీని ధర రూ.3,999
JioDive VR Headset
ఈ గ్యాడ్జెట్‌ను ముఖ్యంగా జియో ప్లాట్ పాంలో వచ్చే సినిమాలు, వీడియోలు, టీవీ షోలు చూసేందుకు మార్కెట్‌లోకి తీసుకొచ్చారు. దీనిని ఆండ్రాయిడ్ 9+, ioS 15+ ఫొన్లలో మాత్రమే ఉపయోగించుకోవచ్చు. ఈ గ్యాడ్జెట్ ద్వారా 100 అంగుళాల భారీ వర్చువల్ స్క్రీన్‌ను ఎంజాయ్ చేయవచ్చు. దీని ధర రూ.1,299
Irusu Monster VR Headset
ఈ VR హెడ్‌సెట్ ద్వారా 2K రెజల్యూషన్‌లో స్క్రీన్ ప్రజెన్స్‌ను ఎంజాయ్ చేయవచ్చు. దీనిలోని 40MM HD లెన్స్‌లు మంచి వర్చువల్ రియాలిటీ ఎక్స్‌పీరియన్స్‌ను అయితే అందిస్తాయి. 6.9 అంగుళాల వరకు పొడవున్న మొబైల్స్‌ను ఈ గ్యాడ్జెట్‌లో సర్దుబాటు చేసుకోవచ్చు. దీని అసలు ధర రూ.3,500 ఉండగా అమెజాన్‌లో ప్రస్తుతం రూ.₹1,879 వద్ద లభిస్తోంది.
Irusu Play VR Ultra VR Headset
ఈ గ్యాడ్జెట్ అడ్జస్టపుల్ హెడ్‌ఫోన్లతో ప్రత్యేకంగా తయారైంది. దీనిలోని 40MM HD లెన్స్… క్రిస్టల్ క్లియర్ విజువల్స్ అయితే అందిస్తుంది. VR గేమింగ్, మూవీస్, వెబ్ సిరీస్‌లు చూడాలనుకునే వారికి ఇది బెస్ట్ ఛాయిస్. దీని ధర ₹2,913
AMVR VR Headset
ఇది వీఆర్ గ్యాడ్జెట్స్‌లో ప్రత్యేకంగా తయారు చేయబడింది. ప్రత్యేకమైన హెడ్‌ఫోన్స్, కంట్రోలర్ మౌంట్ స్టేషన్, రిఫ్ట్ కంట్రోలర్స్‌ను కలిగి ఉంది. ఇది బెస్ట్ 3D ఎక్స్‌పీరియన్స్, సౌండ్ క్వాలిటీని అందిస్తుంది. అమెజాన్‌లో టాప్ రేటింగ్‌ను అయితే కలిగి ఉంది. దీని ధర రూ.4742
PROCUS One X Virtual Reality Headset
ఈ VR గ్యాడ్జెట్ ఆండ్రాయిడ్, iOS మొబైల్స్‌కు సపోర్ట్ చేస్తుంది. దీనిలోని 42MM బెస్ట్ వర్చువల్ రియాలిటీ ఎక్స్‌ఫీరియన్స్‌ను అయితే అందిస్తుంది. 360డిగ్రీలో వర్చువల్ మూవీస్ చూసేందుకు, గేమ్స్ ఆడేందుకు ఇది బాగా యూజ్ అవుతుంది. దీని అసలు ధర రూ.3,999 కాగా అమెజాన్‌లో ₹2,299 వద్ద లభిస్తోంది.