Best Wall Arts: మీ లివింగ్‌ రూమ్‌ మరింత అందంగా కనిపించాలా? అయితే ఈ వాల్‌ ఆర్ట్స్‌ ట్రై చేయండి..!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Best Wall Arts: మీ లివింగ్‌ రూమ్‌ మరింత అందంగా కనిపించాలా? అయితే ఈ వాల్‌ ఆర్ట్స్‌ ట్రై చేయండి..!

    Best Wall Arts: మీ లివింగ్‌ రూమ్‌ మరింత అందంగా కనిపించాలా? అయితే ఈ వాల్‌ ఆర్ట్స్‌ ట్రై చేయండి..!

    September 22, 2023

    ప్రతి ఇంట్లో లివింగ్‌ రూమ్‌ అనేది ఎంతో కీలకమైనది. అతిథులు, బంధువులు ఎవరైన వస్తే ముందుగా వారిని లివింగ్‌ రూమ్‌లోని సోఫా లేదా కూర్చిలో కూర్చోబెడతాం. కాబట్టి లివింగ్‌ రూమ్‌ లుక్‌ను బట్టే వారు మీ ఇల్లు ఎంత అందంగా ఉందో జడ్జ్‌ చేసే ఛాన్స్‌ ఉంది. అంతేగాక ఫ్యామిలీ అంతా కూడా ఒక రోజులో ఎక్కువ సమయం గడిపేది కూడా లివింగ్‌ రూమ్‌లోనే. ఈ నేపథ్యంలో ఇంట్లోని హాల్‌ ఎంత అందంగా ఉంటే మీ మూడ్‌ కూడా అంతే ఆహ్లాదకరంగా ఉంటుంది. లివింగ్‌ రూమ్స్‌కు మరింత అందాన్ని చేకూర్చే అద్భుతమైన వాల్‌ఆర్ట్స్‌ మార్కెట్‌లో చాలానే ఉన్నాయి. వాటిలో టాప్‌ జాబితాను YouSay మీ ముందుకు తెచ్చింది. అవేంటో మీరే చూడండి.

    DSH Metal Wall Art

    ఈ వాల్‌ ఆర్ట్‌ మీ లివింగ్‌ రూమ్‌కు మరింత అందం తెస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. పూల రేకుల ఆకారంలో తయారైన ఈ మెటల్‌ వాల్‌ ఆర్ట్‌ ఇంటి గోడకు అద్భుతమైన అలంకరణగా మారిపోతుంది. అమెజాన్‌లో ఇది రూ.2,849 లకు అందుబాటులో ఉంది.

    SPIROZ Modern Metal Art 

    లివింగ్ రూమ్‌లో స్టైలిష్‌ వాల్‌ ఆర్ట్‌ కోరుకునే వారు ‘SPIROZ Modern Metal Art’ పరిశీలించవచ్చు. బ్యూటిఫుల్‌ ఫ్లవర్‌ డిజైన్‌తో చేసిన ఈ ఐరన్ వాల్‌ ఆర్ట్‌ను లివింగ్‌ రూమ్‌లోనే కాకుండా ఆఫీస్‌, బెడ్‌రూమ్‌లోనూ పెట్టుకోవచ్చు. అంతే కాకుండా మీ మిత్రులు, బంధువుల పెళ్లిలకు గిఫ్ట్‌గా కూడా అందించవచ్చు. దీని ధర అమెజాన్‌లో రూ.2,190.

    KOTART Paintings Modern Art

    లివింగ్‌ రూమ్‌ను అందమైన నేచర్‌ (Nature) పెయింటింగ్స్‌తో ఆకర్షణీయంగా మార్చాలని భావించేవారికి ‘KOTART Paintings Modern Art’ చక్కటి ఆప్షన్‌. ఇది 10 x 13 అంగుళాలు గల 4 ఫ్రేమ్‌ సెట్స్‌తో రానుంది. మెుత్తం 9 రకాల వేరియంట్లలో ఈ అందమైన పెయింటింగ్స్ ఉన్నాయి. వీటిలో మీకు నచ్చిన దాన్ని ఎంపిక చేసుకోవచ్చు. దీని అసలు ధర రూ.1,999 కాగా అమెజాన్‌లో ఇది రూ.949 అందుబాటులో ఉంది.

    KOTART Wall Decoration

    లివింగ్‌ రూమ్‌లో మోడ్రన్‌ పెయింటింగ్ వాల్ ఆర్ట్స్‌ను కోరుకునేవారు ‘KOTART Wall Decoration’ ట్రై చేయవచ్చు. ఈ తరం యువతకు బాగా కనెక్ట్‌ అయ్యే 4 వాల్‌ పెయింటింగ్స్ సెట్‌తో ఇది రానుంది. మెుత్తం 12 మోడల్స్‌లో ఇవి అందుబాటులో ఉన్నాయి. నచ్చిన డిజైన్‌ను ఎంపిక చేసుకోవచ్చు. అమెజాన్‌లో దీని వెల రూ.949.

    KYARA ARTS Multiple Frames

    మీ ఇంటి హాల్‌లో ఒక యునిక్‌ వాల్‌ ఆర్ట్‌ను కోరుకునేవారు ‘KYARA ARTS Multiple Frames’ పరిశీలించవచ్చు. ఇది మల్టిపుల్‌ ఫ్రేమ్స్‌తో రూపొందిన అందమైన వాల్‌ పెయింటింగ్‌ ఆర్ట్‌. ఈ వాల్ ఆర్ట్‌ 127 సెం.మీ పొడవు, 76.2 సెం.మీ వెడల్పు కలిగి ఉంది. అమెజాన్‌లో దీని ప్రైస్‌ రూ.2,099గా ఉంది. 

    ORANGESCE 5PCS Boho Moon Phase 

    లివింగ్‌ రూమ్‌లో చందమామను తలపించే వాల్‌ ఆర్ట్‌ కోరుకునే వారు దీన్ని ట్రై చేయవచ్చు. 5 పీసెస్‌ మూన్‌ సెట్‌తో ఇది రానుంది. దీనిని హాల్‌లోనే కాకుండా బెడ్‌రూమ్‌లోనూ ఫిక్స్‌ చేసుకోవచ్చు. అమెజాన్‌ దీనిని రూ.1,250 అందిస్తోంది. 

    SMAART CRAAFTS Metal Pendant

    చాలా మంది తమ లివింగ్‌ రూమ్‌లో అందమైన ఫ్లవర్స్‌తో డిజైన్‌ చేసిన వాల్‌ ఆర్ట్‌ను ఉంచేందుకు ఆసక్తికనబరుస్తారు. అటువంటి వారికి ‘SMAART CRAAFTS Metal Pendant’ మంచి ఎంపిక అని చెప్పవచ్చు. మెుత్తం 13 ఫ్లవర్‌ డిజైన్లలో ఈ మెటల్ వాల్‌ ఆర్ట్‌ అందుబాటులో ఉంది. 

    KOTART Framed Wall Posters

    కొటార్ట్‌ (KOTART) నుంచి మరిన్ని వినూత్నమైన వాల్ పోస్టర్స్‌ అందుబాటులో ఉన్నాయి. ఇది కూడా 4 ఫ్రేమ్‌ సెట్‌తో రానున్నాయి. మీ లివింగ్‌ రూమ్‌ ఎంతో అందంగా మార్చే అద్భుతమైన పెయింటింగ్ డిజైన్స్ ఇందులో ఉన్నాయి. మెుత్తం 16 డిజైన్లలో మీ మనసుకు హత్తుకున్న దాన్ని కొనుగోలు చేసుకోవచ్చు. అమెజాన్‌లో ఇది రూ.1,234కు అందుబాటులో ఉంది. 

    YUMKNOW Aesthetic Wall Collage Kit

    మల్టీ ఫ్రేమ్స్‌తో వచ్చే ఒక యునిక్‌ వాల్‌ ఆర్ట్‌ కోసం దీన్ని ట్రై చేయవచ్చు. మెుత్తం 30 ఫ్రేమ్‌ సెటప్‌తో ఇది మీ లివింగ్‌ రూమ్‌ గోడను అందంగా మార్చేస్తుంది. అమెజాన్‌లో ఇది రూ. 1,850 అందుబాటులో ఉంది. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version