Best Winter Places: దేశంలో బెస్ట్‌ టూరిస్ట్ మంచు ప్రదేశాలు.. జీవితంలో ఒక్కసారైన వెళ్లాల్సిందే!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Best Winter Places: దేశంలో బెస్ట్‌ టూరిస్ట్ మంచు ప్రదేశాలు.. జీవితంలో ఒక్కసారైన వెళ్లాల్సిందే!

    Best Winter Places: దేశంలో బెస్ట్‌ టూరిస్ట్ మంచు ప్రదేశాలు.. జీవితంలో ఒక్కసారైన వెళ్లాల్సిందే!

    November 28, 2023

    దేశంలో ఎన్నో సుప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. రాజుల కాలం నాటి కోటలు, పురాతన ఆలయాలు, ప్రపంచ వారసత్వ కట్టడాలు, ప్యాలెస్‌లు ఇలా వివిధ రకాల ప్రదేశాలు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ఇదిలా ఉంటే శీతాకాలంలో తప్పక సందర్శించాలని మంచు ప్రదేశాలు మన దేశంలో చాలానే ఉన్నాయి. ప్రస్తుతం వింటర్‌ మెుదలవడంతో అందరి దృష్టి వాటిపై పడింది. ఈ నేపథ్యంలో ఉత్తరభారతంలో అందమైన మంచు ప్రదేశాలు ఏవి? వాటి ప్రత్యేకతలు ఏంటి? వంటి విశేషాలను ఈ కథనంలో చూద్దాం. 

    గుల్‌మార్గ్, జమ్ముకశ్మీర్‌

    ఉత్తర భారతదేశంలో చాలా ప్రాంతాలు శీతాకాలంలో మంచుతో క‌ప్ప‌బ‌డి ఎంతో ఆహ్లాదాన్ని పంచుతాయి. అలాంటి ప్రాంతాల్లో ఒకటి జమ్ముకశ్మీర్‌లోని ‘గుల్‌మార్గ్’ (Gulmarg Town). పశ్చిమ హిమాలయాల్లోని పీర్ పంజాల్ శ్రేణిలో ఉన్న ఈ ప్రాంతం పర్యాటకులకు విశేష అనుభూతిని పంచుతుంది. ఈ ప్రాంతంలో అనేక మంచు క్రీడలు అందుబాటులో ఉంటాయి. ఇక్కడి వాతావరణ వీక్షకులను కట్టిపడేస్తుంది. 

    శంఘర్, హిమాచల్ ప్రదేశ్‌

    హిమాచల్‌ప్రదేశ్‌లోని శంఘర్‌ పట్టణాన్ని (Shangarh Town) శీతాకాలంలో మంచి పర్యాటక ప్రాంతంగా చెప్పవచ్చు. దీనిని మినీ స్విట్జర్లాండ్ అని కూడా పిలుస్తారు. ఈ ప్రాంతంలో ఎటు చూసిన మంచుతో కప్పబడిన హిమాలయాలే దర్శనమిస్తాయి. మంచుతో గడ్డకట్టిన జలపాతాలకు సైతం శంఘర్‌ ప్రాంతం ప్రసిద్ధి చెందింది. 

    ఔలి, ఉత్తరాఖండ్‌

    దేశంలోని అత్యుత్తమ వింటర్‌ పర్యాటక ప్రాంతాల్లో ఉత్తరాఖండ్‌లోని ఔలి (Auli) ఒకటి. మానవ నిర్మిత ఔలీ సరస్సుకి ఎదురుగా మంచుతో కప్పబడిన నందా దేవి పర్వతాలు చూప‌రుల‌ను క‌ట్టిపడేస్తాయి. ఔలి ప్రాంతంలో స్కీయింగ్ కూడా ఆడవచ్చు. ప‌ర్యాట‌కుల‌కు ఈ ఆట మంచి అనుభూతిని ఇస్తుంది.

    మనాలి, హిమాచల్‌ ప్రదేశ్‌

    హిమాచల్‌ ప్రదేశ్‌లోని మరో చూడతగ్గ పర్యాటక ప్రాంతం మనాలి (Manali Town). ఈ ప్రాంతం శీతాకాలంలో అత్యుత్తమ గమ్యస్థానంగా ఉంటుంది. కుటుంబ సమేతంగా మంచులో ఎంజాయ్‌ చేయడానికి మనాలి బెస్ట్‌ ప్లేస్ అని చెప్పవచ్చు. ఇక్కడ స్కీయింగ్‌ (Skiing)తో పాటు స్నోబోర్డింగ్‌, మంచు సంబంధింత ఆటలు ఆకట్టుకుంటాయి. 

    సోన్‌మార్గ్, జమ్ముకశ్మీర్‌

    శీతాకాలంలో మంచి అనుభూతిని పంచే మంచు ప్రాంతాల్లో జమ్ముకశ్మీర్‌లోని సోన్‌మార్గ్‌ (Sonmarg) కూడా కచ్చితంగా ఉంటుంది. ఈ మార్గం టిబెట్‌ను కశ్మీర్‌ను కలుపుతుంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రోడ్డు మార్గాల్లో సోన్‌మార్గ్‌ ఒకటి. భారత్, చైనాలను కలిపే సిల్క్ రోడ్‌కి పురాతన గేట్‌వే కూడా ఈ సోన్‌మార్గ్‌ కావడం విశేషం. 

    లేహ్‌, లడక్‌

    శీతాకాలంలో మంచు పర్వతాల నడుమ బైక్‌ రైడ్‌ను ఇష్టపడేవారికి లడక్‌లోని లేహ్‌ (Leh) ప్రాంతం  బెస్ట్ చాయిస్‌ అని చెప్పవచ్చు. ఈ మార్గంలో ఒకసారి రైడ్‌ చేస్తే జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేరు. ఘనీభవించిన పాంగోంగ్ త్సో సరస్సుపై స్వారీ చేయడం ఒక చ‌క్క‌ని అనుభూతిని పంచుతుంది. ఇక ఈ ప్రాంతం అనేక బౌద్ద స్థూపాలకు సైదం ప్రసిద్ధి చెందింది. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version