నందమూరి నటసింహం బాలయ్య నటించిన ‘భగంత్ కేసరి’ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఇప్పటికే అఖండ, వీరసింహారెడ్డి వంటి హిట్లతో ఫుల్ జోష్‌లో ఉన్న బాలకృష్ణ.. కూతురు సెంటిమెంట్‌తో తెరకెక్కిన భగవంత్ కేసరితో ముందుకొచ్చాడు. ట్రైలర్‌లో బాలయ్య- శ్రీలీల మధ్య వచ్చిన ఎమోషన్ సీన్లు సినిమాపై అంచనాలను పెంచాయి. ఈ సినిమాతో తన పంథాను మార్చుకున్న అనిల్ రావుపూడి.. బాలకృష్ణతో కొత్త ప్రయోగం చేయడంతో సినిమాపై హెప్ పెరిగింది. మరి ఇంతకు ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకుందా? నేలకొండపల్లి భగంవత్ కేసరి మెప్పించాడా? లేదా? YouSay రివ్యూలో చూద్దాం.
నటీనటులు: బాలకృష్ణ, కాజల్ అగర్వాల్, శ్రీలీల, అర్జున్ రామ్‌పాల్, శరత్‌కుమార్
డెరెక్టర్: అనిల్ రావుపూడి
నిర్మాత: సాహు గారపాటి, హరీష్ పెద్ది
సినిమాటోగ్రఫి: సి. రామ్ ప్రసాద్
సంగీతం: తమన్
విడుదల తేదీ: అక్టోబర్ 19
కథ:
కొన్ని తప్పని పరిస్థితుల్లో జైలుకు వెళ్లిన భగవంత్ కేసరికి ఆ జైలు.. జైలర్ ఓ పని అప్పగిస్తాడు. తన కూతుర్ని కొంత మంది దుర్మార్గుల నుంచి రక్షించమని మాట తీసుకుంటాడు. అందుకోసం భగవంత్ కేసరి.. ఆమెను స్ట్రాంగ్ చేసేందుకు నిత్యం కష్టపడుతుంటాడు. అయితే విజ్జి పాప(శ్రీలీల) మాత్రం అవేమి పట్టనట్టుగా ఉంటుంది. తనను వదిలేయమని వేడుకుంటుంది. ఈక్రమంలో విజ్జును చంపడానికి వచ్చిన విలన్లతో బాలయ్య తలపడుతాడు. వాళ్లు ఊహించని ఓ ట్విస్ట్ ఇస్తారు. ఇంతకు ఆ ట్విస్ట్ ఏమిటి? జైలర్‌కు విలన్‌కు ఉన్న విరోధం ఏమిటి? భగవంత్ కేసరి.. జైలర్‌కు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడా? అనే విషయాలు తెలియాలంటే థియేటర్లకు వెళ్లి సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే?
ఇక సినిమా ఫస్టాఫ్ విషయానికొస్తే.. బాలకృష్ణ, శ్రీలీల మధ్య కామెడీ ట్రాక్, ఎమోషనల్ సీన్లు ఉంటాయి. ఈ సన్నివేశాలు ఆడియన్స్‌కు కనెక్ట్ అవుతాయి. శ్రీలీల- బాలయ్య కాంబోలో తెరకెక్కిన గణపతి సాంగ్ అదిరిపోతుంది. బాలయ్య మాస్ స్టేప్పులతో ఇరగదీశాడు. అయితే సినిమాలో కాజల్‌తో పాటలు ఏమి లేవు. బాలకృష్ణతో శ్రీలీల బాండింగ్, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ సినిమాకు హైలెట్ అని చెప్పాలి. అయితే భగవంత్ కేసరి చిత్రం బాలయ్య గత సినిమాల మాదిరి ఉండదు. కొంత వినోదం, కొంత ఎమోషనల్‌గా సాగుతుంది. కూతురు సెంటిమెంట్ సినిమాలో ఎక్కువగా కనిపిస్తుంది. సినిమాలో మూడు పెద్ద ఫైట్లు ఉన్నాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిపోతుంది. బాలయ్య చెప్పే హిందీ డైలాగ్స్ ప్రేక్షకుల చేత వన్స్ మోర్ అనిపిస్తాయి. బాలయ్య తెలంగాణ యాసలో చెప్పే డైలాగ్‌లు ఆకట్టుకుంటాయి. విలన్ అర్జున్ రామ్‌పాల్‌తో బాలయ్య సన్నివేశాలు గూస్‌బంప్స్. సినిమాకే హైలెట్‌గా బాలకృష్ణ ఇంకో గెటప్ ఉంటుంది. బాలయ్యకు జైలర్‌కు మధ్య ఉన్న సంబంధమే కథకు సెంట్రల్ పాయింట్. ఆ పాయింట్‌కు శ్రీలీల, అర్జున్ రామ్‌పాల్‌ను ముడిపెట్టిన తీరు కుటుంబ ప్రేక్షకులను కదిలిస్తుంది, ఇక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్.. భగవంత్ కేసరి సినిమాకు మెయిన్ థీమ్. ఈ ఎపిసోడ్‌లో 15 నిమిషాల పాటు బాలయ్య పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తాడు.
ఎవరెలా చేశారంటే..
భగవంత్ కేసరిలో బాలకృష్ణ పూర్తిగా కొత్తగా కనిపించారు. ఇప్పటివరకు యాక్షన్ సీన్లలోనే ఎక్కువ కనిపించిన బాలయ్య.. కామెడీ సీన్స్‌లోనూ అదరగొట్టారు. శ్రీలీలతో జరిగే ఎమోషనల్ సీన్స్‌లో బాలయ్య తన నటనతో కంటతడి పెట్టించారు. యాక్షన్ సీన్స్‌లో ఎప్పటిలాగే అదరగొట్టారు. తెలంగాణ యాసలో చెప్పిన డైలాగ్స్ ప్రేక్షకుల చేత విజిల్స్ వేపిస్తాయి. ఇక శ్రీలీల గురించి చెప్పాలంటే.. విజ్జు పాత్రలో సహాజమైన నటనతో ఆకట్టుకుంది. ఈ పాత్ర శ్రీలీల కెరీర్‌లో గుర్తిండి పోతుంది. ముఖ్యంగా శ్రీలీలకు కెరీర్ ఆరంభంలోనే ఇలా నటనకు స్కోప్ ఉన్న పాత్ర పడటం నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి. కొన్ని ఎమోషనల్ సీన్లలో బాలయ్యతో పోటీపడి మరి నటించింది. ఇక బాలయ్య సరసన నటించిన కాజల్ తన పాత్ర పరిధిమేరకు నటించింది. పెద్దగా తన పాత్రకు స్కోప్ లేనప్పటికీ.. ఉన్నంతలో బాగా చేసింది. విలన్‌గా అర్జున్ రామ్‌పాల్ మెప్పించాడు. కథకు తగ్గట్లు ఇతర నటీనటులు తమ పరిధిమేరకు నటించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే?
ఇప్పటి వరకు కామెడీ జోనర్‌లో హిట్ అయిన అనిల్ రావిపూడి తన సినిమాలకు భిన్నంగా బాలయ్యతో ఒక సీరియస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ తీసేందుకు మంచి ప్రయత్నమే చేశాడు. అనిల్ తీసుకొచ్చి స్టోరీ లైన్ బలమైనదే అయినప్పటికీ.. దానికి తగినవిధంగా ఇంకాస్త బలంగా కథ రాసుకుంటే బాగుండేది అనిపించింది. కానీ తాను అనుకున్న స్టోరీని అమలు చేయడంలో మాత్రం విజయం సాధించాడు. బాలయ్య- శ్రీలీల మధ్య ఇంకొన్ని బలమైన ఎమోషన్ సీన్లు పడితే బాగుండేది అనిపించింది.
టెక్నికల్ పరంగా
సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. తమన్ మ్యూజిక్ మెప్పిస్తుంది. కానీ గత సినిమాలతో పోలిస్తే BGM రేంజ్ కాస్త తగ్గినట్లు అనిపిస్తుంది. సినిమాలోని రెండు పాటలు అలరిస్తాయి. శ్రీరామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫి ప్రత్యేకంగా ఉంది. ప్రతి ఫ్రేమ్‌లో బాలయ్య రిచ్ లుక్‌లో కనిపించేందుకు బాగా కష్టపడినట్లు అర్థం అవుతోంది. ఇక వెంకట్ యాక్షన్ సిక్వెన్స్ హెలెట్. ఉన్న మూడు ఫైట్లు బాలయ్య మాస్ హీరోయిజాన్ని బాగా ఎలివేట్ చేశాయి. క్లైమాక్స్ సన్నివేశాలు మాత్రం అదిరిపోయాయి.
బలాలు
బాలకృష్ణ- శ్రీలీల మధ్య ఎమోషనల్ సీన్లు
యాక్షన్ సన్నివేశాలు
ఇంటర్వెల్ బ్యాంగ్
బలహీనతలు
అంచనాలకు తగ్గట్టుగా లేని ఫస్టాఫ్
కొన్ని చోట్ల లాగ్ సీన్లు
చివరగా: తండ్రి- కూతుళ్ల మధ్య ఎమోషనల్ సెంటిమెంట్‌తో వచ్చిన ఈ చిత్రంలో అక్కడక్కడ కొన్ని లోపాలు ఉన్నప్పటికీ… ప్రేక్షకులకు అన్ని విధాల కనెక్ట్ అవుతుంది.
Celebrities Featured Articles
Revanth Reddy: సీఎం రేవంత్‌పై విరుచుకుపడ్డ హీరోయిన్.. సినీ పెద్దల భేటిపై మరో నటి ఫైర్!