టాలీవుడ్ రైజింగ్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న భాగ్యశ్రీ బోర్సేకు తొలి చిత్రంతోనే భారీ ఎదురుదెబ్బ తగిలింది. తెలుగులో ఆమె చేసిన ఫస్ట్ ఫిల్మ్ మిస్టర్ బచ్చన్ బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమైంది. అయితే ఈ అమ్మడి నటనకు ప్రేక్షకులు మంచి మార్కులే వేశారు. ఈ భామకు మంచి ఫ్యూచర్ ఉంటుందంటూ కితాబు ఇచ్చారు. ఈ క్రమంలోనే భాగ్యశ్రీకి మరో బంపరాఫర్ దక్కించుకొని అందరినీ ఆశ్చర్యపరిచింది. పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించి అందరి దృష్టిని ఆకర్షించింది. భాగ్యశ్రీ అప్‌కమింగ్ ప్రాజెక్ట్‌కు సంబంధించిన విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
దుల్కర్‌కి జోడీగా భాగ్యశ్రీ
మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) హీరోగా తెరకెక్కుతోన్న చిత్రాల్లో ‘కాంత’ (Kaantha) ఒకటి. ‘నీలా’ ఫేమ్ సెల్వమణి సెల్వరాజ్ (Selvamani Selvaraj) దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. దుల్కర్ పుట్టినరోజు పురస్కరించుకుని ఇటీవల ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేయగా సినీ లవర్స్ నుంచి విశేష ఆదరణ లభించింది. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్‌గా భాగ్యశ్రీ బోర్సేను ఎంపిక చేశారు. అంతేకాదు పూజా కార్యక్రమాలను సైతం నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. ఆమె మంచి ఛాన్స్ కొట్టేశారంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. వేఫరెర్ ఫిలిమ్స్, స్పిరిట్ మీడియా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. త్వరలోనే దీని రెగ్యులర్ షూట్ ప్రారంభం కానుంది. ఇందులో రానా దగ్గుబాటి ఓ ముఖ్యపాత్రలో కనిపించనున్నారు.
1950 నేపథ్యంలో..
కాంత మూవీ పూజా కార్యక్రమాలను హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో నిర్వహించారు. ఈ మూవీకి టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేష్ ఫస్ట్ క్లాప్ కొట్టారు. కాగా, ఈ చిత్రాన్ని 1950 మద్రాసు నేపథ్యంలో తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో దుల్కర్ పాత్ర ఇప్పటివరకూ చేసిన చిత్రాల కంటే పూర్తి భిన్నంగా ఉంటుందని సమాచారం. భాగ్యశ్రీకి కూడా నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రనే దక్కిందని అంటున్నారు. వీరి మధ్య కెమెస్ట్రీ అదిరిపోతుందని అంటున్నారు. ఈ మూవీ షూటింగ్ త్వరలోనే మెుదలవుతుందని ఫిల్మ్ వర్గాలు తెలియజేశాయి.
ఏమాత్రం తగ్గని క్రేజ్!
‘మిస్టర్ బచ్చన్’ సినిమా టైంలో భాగ్యశ్రీ బోర్సే పేరు ఎంతగా ట్రెండ్ అయిందో తెలిసిందే. ఈ సినిమాలో కథానాయికగా ఎంపికైన దగ్గర్నుంచి ఆమె సోషల్ మీడియా దృష్టినీ ఆకర్షిస్తూనే వచ్చింది. సినిమా నుంచి తొలి పాటను అనౌన్స్ చేసినపుడు కొన్ని విజువల్స్ చూసి కుర్రాళ్లకు మతిపోయింది. అయితే ఊహించని విధంగా ‘మిస్టర్ బచ్చన్’ డిజాస్టర్ కావడంతో భాగ్యశ్రీ అంచనాలన్నీ తలకిందులు అయ్యాయి. తొలి చిత్రమే దారుణ పరాజయాన్ని మిగిల్చడంతో ఈ అమ్మడు సోషల్ మీడియాలో తన దూకుడు కాస్త తగ్గించింది. తాజాగా ‘కాంత’ సినిమాలో హీరోయిన్‌గా ఎంపికై తన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని నిరూపించింది. సరైన హిట్ లభిస్తే ఈ అమ్మడు స్టార్ హీరోయిన్‌గా మారిపోవడం ఖాయమని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
విజయ్ దేవరకొండ మూవీలోనూ..
విజయ్ దేవరకొండ – గౌతమ్ తిన్ననూరి కాంబోలో రూపొందుతున్న ‘VD12’ చిత్రంలోనూ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ అమ్మడు షూటింగ్‌లోనూ పాల్గొంటున్నట్లు సమాచారం. ఈ సినిమాలో విజయ్ పోలీసు ఆఫీసర్‌గా కనిపించనున్నట్లు సమాచారం. ఓ సాధారణ పోలీసు కానిస్టేబుల్ అయిన హీరో, మాఫియా లీడర్‌గా ఎలా ఎదిగాడన్న కాన్సెప్ట్‌తో ‘VD12’ రాబోతున్నట్లు తెలుస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించనున్నారు.
Entertainment(Telugu) Featured Articles Reviews
Maa Nanna Superhero Review: భావోద్వేగాలతో నిండిన మంచి ఎమోషనల్ జర్నీ.. సుధీర్ బాబు హిట్ కొట్టినట్లేనా?