Bhoothaddam Bhaskar Narayana Review: థ్రిల్లింగ్‌ అంశాలతో ఆకట్టుకున్న ‘భూతద్ధం భాస్కర్‌ నారాయణ’.. మూవీ ఎలా ఉందంటే? 
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Bhoothaddam Bhaskar Narayana Review: థ్రిల్లింగ్‌ అంశాలతో ఆకట్టుకున్న ‘భూతద్ధం భాస్కర్‌ నారాయణ’.. మూవీ ఎలా ఉందంటే? 

    Bhoothaddam Bhaskar Narayana Review: థ్రిల్లింగ్‌ అంశాలతో ఆకట్టుకున్న ‘భూతద్ధం భాస్కర్‌ నారాయణ’.. మూవీ ఎలా ఉందంటే? 

    March 2, 2024

    నటీనటులు: శివ కందుకూరి, రాశి సింగ్, దేవి ప్రసాద్, వర్షిణి సౌందరరాజన్, శివ కుమార్, షఫీ, సురభి సంతోష్, శివన్నారాయణ, వెంకటేష్ కాకుమాను తదితరులు.

    దర్శకుడు: పురుషోత్తం రాజ్

    సంగీత దర్శకులు: శ్రీచరణ్ పాకాల, విజయ్ బుల్గానిన్

    సినిమాటోగ్రాఫర్‌: గౌతమ్ జి

    నిర్మాతలు : స్నేహల్ జంగాల, శశిధర్ కాసి, కార్తీక్ ముడింబి

    విడుదల తేదీ : మార్చి 01, 2024

    టాలీవుడ్‌లో ఇప్పటివరకూ ఎన్నో డిటెక్టివ్ చిత్రాలు వచ్చాయి. చిరంజీవి ‘చంట‌బ్బాయ్’ నుంచి రీసెంట్‌గా ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ వ‌ర‌కూ ఆ తరహా చిత్రాలు ప్రేక్షకులకు ఎంతో వినోదాన్ని పంచాయి. తాజాగా ‘భూతద్దం భాస్కర్‌ నారాయణ’ డిటెక్టివ్‌ జానర్‌లోనే తెరకెక్కింది. అయితే దర్శకుడు పురుషోత్తం రాజ్‌.. పురాణాల‌తో డిటెక్టివ్ క‌థ‌ని ముడిపెడుతూ ఈ సినిమాను రూపొందించడం ఆసక్తికరం. శివ కందుకూరి ఇందులో క‌థానాయ‌కుడిగా చేశాడు. మ‌రి ఈ చిత్రం ఎలా ఉంది? ఈ డిటెక్టివ్ ఏ మేర‌కు మెప్పించాడు? అన్నది ఇప్పుడు చూద్దాం. 

    కథ

    ఆంధ్రప్రదేశ్, కర్ణాటక సరిహద్దుల్లో (Bhoothaddam Bhaskar Narayana Review) ఓ సీరియల్‌ కిల్లర్‌ మహిళల్ని టార్గెట్‌ చేస్తూ వరుసగా హత్యలు చేస్తుంటాడు. ఆడవారి తలలు నరికేసి వాటి స్థానంలో దిష్టిబొమ్మలు పెడుతుంటాడు. ఈ వరుస హత్యలు పోలీసులకు చిక్కుముడిలా మారిపోతాయి. దీంతో కేసును పరిష్కరించడం కోసం లోకల్‌ డిటెక్టివ్‌ భాస్కర్‌ నారాయణ (శివ కందుకూరి) రంగంలోకి దిగుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? కేసును డిటెక్టివ్‌ ఛేదించాడా? లేదా? ఆ సీరియల్‌ కిల్లర్‌ ఎవరు? ఎందుకు ఆడవారినే హత్య చేస్తున్నాడు? వారి తలలు తీసుకెళ్లి ఏం చేస్తున్నాడు? రిపోర్టర్‌ లక్ష్మీతో హీరో లవ్‌స్టోరీ ఏంటి? వంటివి తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 

    ఎవరెలా చేశారంటే

    శివ కందుకూరి డిటెక్టివ్ పాత్ర‌లో స‌హ‌జంగా ఒదిగిపోయాడు. న‌ట‌న ప‌రంగానూ వైవిధ్యం ప్ర‌ద‌ర్శించాడు. ప్ర‌థ‌మార్ధంలో స‌ర‌దా స‌న్నివేశాల్లో హుషారుగా కనిపించిన అతడు.. సెకండాఫ్‌లో సీరియ‌స్ స‌న్నివేశాల‌పైనా బ‌ల‌మైన ప్ర‌భావం చూపించాడు. అటు హీరోయిన్‌ రాశిసింగ్ చాలా అందంగా క‌నిపించింది. రిపోర్ట‌ర్ ల‌క్ష్మిగా ఆమెకీ కీల‌క‌మైన పాత్రే ద‌క్కింది. ష‌ఫి, దేవి ప్ర‌సాద్‌, శివ‌న్నారాయ‌ణ, శివ‌కుమార్ త‌దిత‌రులు అల‌వాటైన పాత్ర‌ల్లో తమ పరిధి మేరకు నటించి మెప్పించారు. 

    డైరెక్షన్‌ ఎలా ఉందంటే 

    డైరెక్టర్‌ పురుషోత్తమ్‌ రాజ్‌.. ఆసక్తికర కథను ఎంచుకున్నారు. డిటెక్టివ్‌ కథను పురుణాలతో ముడిపెట్టిన విధానం బాగుంది. హీరోను ప‌క్కా లోక‌ల్ డిటెక్టివ్‌గా చూపించడం అంద‌రినీ క‌నెక్ట్ అయ్యేలా చేస్తుంది. హ‌త్య‌ల పూర్వాప‌రాలు, పోలీసుల ప‌రిశోధ‌న‌, ఆ కేసులోకి హీరో ప్ర‌వేశం, అత‌నికీ స‌వాల్ విసిరే ప‌రిశోధ‌న త‌దిత‌ర అంశాల‌న్నీ ఆస‌క్తిని రేకెత్తిస్తాయి. ద్వితీయార్ధంలో మ‌లుపులు మ‌రింత ఉత్కంఠ‌ని పెంచుతాయి. అయితే అక్కడక్కడా కొన్ని సన్నివేశాలు మరీ నాటకీయంగా అనిపిస్తాయి. ముఖ్యంగా ప్రథమార్థంలో కొన్ని సీన్లు కథకు స్పీడ్‌ బ్రేకుల్లా తయారయ్యాయి. ఓవరాల్‌గా పురషోత్తం రాజ్‌ దర్శకత్వం ఆకట్టుకుంటుంది.

    సాంకేతికంగా

    సాంకేతికంగా సినిమా ఉన్న‌తంగా ఉంది. సంగీతం, కెమెరా, ఎడిటింగ్, క‌ళ త‌దిత‌ర  విభాగాలన్నీ మంచి ప‌నితీరుని క‌న‌బ‌రిచాయి. నేప‌థ్య సంగీతం ఈ సినిమాకు చాలా బాగా ప్లస్‌ అయ్యింది.  నిర్మాణంలోనూ నాణ్య‌త క‌నిపిస్తుంది. బడ్జెట్‌కు వెనకాడినట్లు ఎక్కడా అనిపించలేదు. 

    ప్లస్‌ పాయింట్స్

    • హీరో నటన
    • క‌థ‌లో పురాణ నేప‌థ్యం
    • ద్వితీయార్థం

    మైనల్‌ పాయింట్స్‌

    • ప్ర‌థ‌మార్థంలో కొన్ని సీన్లు

    Telugu.yousay.tv Rating : 3/5

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version