Big Boss Ashwini Sree: అరెబియన్ గుర్రం లాంటి అశ్వినీ శ్రీ అందాలు.. ఇంతకు ఈమె ఎవరో తెలిస్తే షాకవుతారు!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Big Boss Ashwini Sree: అరెబియన్ గుర్రం లాంటి అశ్వినీ శ్రీ అందాలు.. ఇంతకు ఈమె ఎవరో తెలిస్తే షాకవుతారు!

    Big Boss Ashwini Sree: అరెబియన్ గుర్రం లాంటి అశ్వినీ శ్రీ అందాలు.. ఇంతకు ఈమె ఎవరో తెలిస్తే షాకవుతారు!

    October 25, 2023

    బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7 ఉల్టా- ఫుల్టా ట్విస్ట్‌లతో రసవత్తరంగా సాగుతోంది. ఇటీవల ఆరోవారంలో వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన  అశ్వినీ శ్రీ బిగ్‌బాస్‌ హౌస్‌లో సెంటర్ ఆఫ్‌ అట్రాక్షన్‌గా నిలుస్తోంది.

    నామినేషన్ల నుంచి టాస్క్‌ల వరకు తనదైన మాటతీరు బిహేవియర్‌తో ఆటను రక్తికట్టిస్తోంది. దీంతో సహజంగానే ప్రేక్షకుల్లో అశ్వినీ శ్రీ ఎవరు అనే విషయంపై ఆసక్తి మొదలైంది.

    అశ్వీని శ్రీ గురించి నెటిజన్లు ఇంటర్నెట్‌లో భారీగా సెర్చ్ చేస్తన్నారు. ఆమె వయసు, చదువు, కెరీర్, బాయ్ ఫ్రెండ్ వంటి అంశాలపై ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు. మరి ఇంతకు ఈ అందాల అశ్వినీ శ్రీ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

    బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7లో వైల్డ్‌ కార్డు ద్వారా భోలే షవాలీ, పూజామూర్తి, నయనీ పావనీ, అంబటి అర్జున్‌తో సహా అశ్వినీ శ్రీ ఎంట్రీ ఇచ్చింది.

    హైదరాబాద్‌లో జన్మించిన అశ్వినీ శ్రీ.. చదువులో దిట్ట. ప్రతిష్టాత్మక వరంగల్ ఎన్‌ఐటీ కాలేజీలో ఇంజినీరింగ్ అభ్యసించింది. 

    అంతటి మంచి కాలేజీలో చదివిన ఈ ముద్దుగుమ్మ ఏ సాప్ట్‌వేర్ జాబో మరేదో చేయకుండా మోడలింగ్, నటన వైపు అడుగు పెట్టింది.

    తన పెరెంట్స్‌కు తాను సినీరంగం వైపు వెళ్లడం ఇష్టం లేకున్నా తాను మాత్రం అదే రూట్‌లో ప్రయాణించేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గా ఉంటూ ఇన్‌స్టా వీడియోలు, రీల్స్‌తో ఆకట్టుకుంటూ ఉండేది

    అప్పుడప్పుడూ హాట్ ఫోటో షూట్ చేస్తూ కుర్రకారు దృష్టిలో పడుతుండేది. దీంతో భారీగా ఇన్‌స్టా ఫాలోవర్లను అయితే సంపాదించింది.

    తన అందానికి తగ్గట్టే ఇన్‌స్టాలోనూ ఓ ఇంట్రెస్టింగ్ కామెంట్‌ను స్టేటస్‌గా పెట్టుకుంది. నన్ను సరిగా ట్రీట్ చేస్తే… డబుల్ ఫేవర్ చేస్తాను.. ఇట్లు అరేబియన్ గుర్రం అంటూ తనేంటో ఒక్కమాటలో చెప్పుకొచ్చింది.

    ముఖ్యంగా కొంత మంది కళాకారులు అందమైన అమ్మాయిల అందాన్ని అరేబియన్ గుర్రంతో పోలుస్తుంటారు. అయితే తాను కూడా అంతటి అందగత్తెను అని చెప్పకనే చెప్పిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

    ఇక అశ్వినీ శ్రీ సినిమా కెరీర్ పరంగా చూస్తే తాను కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ… పెద్దగా గుర్తింపు అయితే రాలేదు అని చెప్పాలి.

    బీటెక్ బాబులు, అమీర్ పేటలో వంటి సినిమాల్లో నటించింది. ఇక పలు ప్రీ రిలీజ్ ఈవెంట్లు, మ్యూజిక్ షోల్లో స్టేజ్ అప్పియరెన్స్ మాత్రం ఇచ్చింది.

    అయితేనేం… తన అందచందాలతో కుర్రాళ్ల కామెంట్లలో ఎప్పుడూ అశ్వినీ శ్రీ నలుగుతూనే ఉంటుంది.

    ఇక ఇన్‌స్టాలో తాను పెట్టిన ఫోటోల గురించి ఎంత చెప్పినా తక్కువనే చెప్పాలి. చీరకట్టినా, సింగిల్ పీస్ డ్రెస్‌ వేసినా.. హీరోయిన్లకు ఏమాత్రం తగ్గని అందం ఈ గుమ్మ సొంతం.

    హాట్ క్లివేజ్ అందాల ప్రదర్శనతో కుర్రకారుకు ఎప్పుడూ హుషారెత్తిస్తునే ఉంటుంది ఈ అరెబియన్ గుర్రం

    ప్రస్తుతం తన కెరీర్ గ్రాఫ్‌ను మార్చుకునేందుకు బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టింది.. అశ్వినీ శ్రీ. 

    మరి బిగ్‌బాస్‌ హౌస్‌లో ఈ హాట్ డాల్ ఎంతవరకు నెగ్గుకొస్తోందో వేచి చూడాలి. ప్రతి వీక్‌ నామినేట్ అవుతున్న అశ్వినీ శ్రీ భారీగానే ఓట్లు సాధిస్తూ సేవ్ అవుతూ వస్తోంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version