రామ్ హీరోగా నటించిన ‘ది వారియర్’ సినిమా జులై 14న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ వేగవంతం చేశారు. రామ్, కృతిశెట్టితో బిత్తిరి సత్తి ఇంటర్వ్యూను తాజాగా రిలీజ్ చేశారు. సత్తి తన స్టైల్‌లో ప్రశ్నలడుగుతూ ఇద్దరినీ నవ్వించాడు. ఈ ఫన్నీ ఇంటర్వ్యూని మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. ది వారియర్‌లో ఆది పినిశెట్టి విలన్ పాత్రలో నటిస్తున్నాడు. లింగుస్వామి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఇప్పటికే వచ్చిన బుల్లెట్ సాంగ్ రికార్డులు క్రియేట్ చేస్తుంది.
బిత్తిరిసత్తితో ‘ది వారియర్’ ఫన్నీ ఇంటర్వ్యూ
