జాతీయ అవార్డు విజేత అయిన ఒడియా నటి ప్రకృతి మిశ్రాపై, హీరో భూషణ్ మొహంతీ భార్య దాడిచేసింది. ప్రకృతి, భూషణ్ కలిసి ఒక సినిమాలో నటించారు. దాంతో వాళ్లిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఈ విషయాన్ని గ్రహించి భూషణ్ భార్య వాళ్లిద్దరు కలిసి కార్‌లో వెళ్తున్నారన్న సంగతి తెలుసుకొని అక్కడికి వెళ్లింది. నడిరోడ్డుపై ప్రకృతి జుట్టు పట్టుకొని దాడిచేసింది. ఈ వీడియోను కొందరు సోషల్‌మీడియాలో పోస్ట్‌చేయగా అది వైరల్‌గా మారింది. అయితే తామిద్దరం చెన్నైలోని ఒక కార్యక్రమంలో తమ సినిమా ప్రమోట్ చేసేందుకు వెళ్తున్నామని, భూషణ్ భార్య నాపై దాడిచేయడం సహించలేనంటూ ప్రకృతి సోషల్‌మీడియా ద్వారా చెప్పుకొచ్చింది.
భర్తతో సన్నిహితంగా ఉంటుందని హీరోయిన్‌పై దాడిచేసిన హీరో భార్య

screengrab youtube