బాలీవుడ్ బడా స్టార్స్ మ‌ధ్య బాక్సాఫీస్ పోటీ
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • బాలీవుడ్ బడా స్టార్స్ మ‌ధ్య బాక్సాఫీస్ పోటీ

  బాలీవుడ్ బడా స్టార్స్ మ‌ధ్య బాక్సాఫీస్ పోటీ

  June 17, 2022

  బాలీవుడ్ మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్ న‌టించిన ‘లాల్ సింగ్ ఛ‌ద్దా’ సినిమా చాలా సార్లు వాయిదా ప‌డ్డ‌ త‌ర్వాత ఆగ‌స్ట్ 11న రిలీజ్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అయితే మ‌రోవైపు అక్ష‌య‌క్ కుమార్ న‌టించిన ‘ర‌క్షా బంధ‌న్’ కూడా అదే రోజు విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు చిత్ర‌బృందం తాజాగా వెల్ల‌డించింది. అమీర్ ఖాన్ లాలా సింగ్ ఛ‌ద్దాపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. చాలా గ్యాప్ త‌ర్వాత ఈ స్టార్‌ను తెర‌పై చూసేందుకు ఫ్యాన్స్ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవ‌ల విడుద‌లైన ట్రైల‌ర్‌కు మంచి స్పంద‌న ల‌భించింది. అయితే అక్ష‌య్ కుమార్ ర‌క్షా బంధ‌న్‌కు ఆనంద్ ఎల్.రాయ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డంతో ఆ సినిమాపై కూడా ఆస‌క్తి పెరిగింది. ఇలా ఇద్ద‌రు బడా స్టార్స్ ఒకేసారి సినిమా విడుద‌ల చేస్తే ఫ‌లితాలు తారుమార‌య్యే అవ‌కాశాలు ఉన్నాయ‌ని ఫ్యాన్స్ అభిప్రాయ‌ప‌డుతున్నారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
  Exit mobile version