పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ మల్టీస్టారర్‌గా రూపొందిన చిత్రం ‘బ్రో’. తమిళంలో విజయం సాధించిన ‘వినోదయ సిత్తం’ సినిమాకు రీమేక్ ఇది. మాతృకలో తీసిన డైరెక్టర్ సముద్రఖని తెలుగులోనూ చిత్రీకరించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించారు. ఈ సినిమా విజయంపై మూవీ యూనిట్ ఎంతో ధీమాతో ఉంది. దీనికి కారణం సినిమా మూల కథే. మరి, ‘వినోదయ సిత్తం’ కథ ఎలా పుట్టింది? ఈ సినిమాలో అంతగా ఏముంది? మూవీతో ఏం సందేశం ఇచ్చారు? వంటి అంశాలను తెలుసుకుందాం.
అలా తెరమీదకి..
ఓటీటీ కంటెంట్ కోసం జీ స్టూడియోస్ సముద్రఖనిని పిలిపించుకుని ఓ 5 కథలను చెప్పమంది. ఇందుకు 25 నిమిషాలు టైం ఇచ్చింది. దర్శకుడు 20 నిమిషాల్లోనే 5 కథలను పూర్తి చేశారు. ఇందులో నుంచి ఓ కథను సెలెక్ట్ చేసి ఓకే చేసేశారు. మరో 3 నిమిషాలు మిగిలి ఉండటంతో ఒక కథ చెప్పే అవకాశం ఇవ్వండని కోరి ఈ ‘బ్రో’ మూవీ స్టోరీ లైన్ చెప్పారు సముద్రఖని. దీంతో ముందుగా ఓకే చేసిన స్టోరీని పక్కన పెట్టి ‘వినోదయ సిత్తం’కు నిర్మాతలు ఓటేశారు. అలా ఈ సినిమాకు బీజం పడింది. అయితే, వినోదయ సిత్తం కథను తన గురువు బాలచందర్ గారు అందించినట్లు సముద్రఖని చెబుతుంటారు.
స్టోరీ ఇదే..
పరశురామ్(తంబిరామయ్య) క్రమశిక్షణ గల ఉద్యోగి. 25 ఏళ్లుగా ఓ ఎంఎన్‌సీ కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్‌గా చేస్తుంటాడు. కంపెనీ ఎదుగుదలలో కీలక పాత్ర పోషించి ప్రమోషన్ కోసం ఎదురు చూస్తుంటాడు. సమయాన్ని పకడ్బందీగా వాడుకోవాలని భార్య, పిల్లలకు చెబుతుంటాడు. అమెరికాలో ఉన్న కొడుక్కి సైతం పక్కా ప్లానింగ్ ఇస్తుంటాడు. అలా ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు తీరిక లేకుండా గడిపేస్తుంటాడు. కంపెనీ పనిమీద వేరే సిటీకి వెళ్లి తిరిగి వస్తుండగా యాక్సిడెంట్‌లో పరశురామ్ మరణిస్తాడు. పరశురామ్‌ని స్వర్గానికి తీసుకెళ్లడానికి కాలదేవుడు(సముద్రఖని) వస్తాడు. ఇక్కడ ఇద్దరి మధ్య సంభాషణ జరుగుతుంది.
తాను నెరవేర్చాల్సిన బాధ్యతలు ఇంకా మిగిలే ఉన్నాయని, భవిష్యత్తులో ఆనందంగా ఉండటానికి ఎంతో కష్టపడ్డానని, తనను బతికించాలని వేడుకుంటాడు. వాదోపవాదాల అనంతరం 3 నెలల సమయాన్ని పొందుతాడు. అయితే, దీని గురించి ఇతరులకు చెప్పకుండా ఉండేందుకు కాలదేవుడు కూడా పరశురామ్‌ని వెంబడిస్తాడు. ముందుగా కూతురి పెళ్లిని ఫిక్స్ చేస్తాడు. కానీ, ఆమె ప్రేమించిన అబ్బాయితో వెళ్లిపోతుంది. ఈ బాధలో ఉండగానే కొడుకు ఉద్యోగం కోల్పోయి అమెరికా నుంచి గర్ల్‌ఫ్రెండ్‌ని తీసుకొచ్చేస్తాడు. ఇదిలా ఉండగానే ఆఫీసులో తనకి కాకుండా వేరొకరికి ప్రమోషన్ వస్తుంది. ఇలా ఒకదాని వెంబడి మరొకటి జరిగి పరశురామ్‌కి జీవిత పరమార్థం అంటే ఏంటో అర్థమవుతుంది.
త్రివిక్రమ్‌కి అందుకే నచ్చిందా?
మనిషికి భవిష్యత్తు అనేది ఉండదని వర్తమానం ఒక్కటే ఆచరణలో ఉంటుందని చెప్పే స్టోరీ ఇది. వాస్తవాలకు, భ్రమలకు మధ్య ఉన్న తేడాని తెలుసుకుంటే జీవిత పరమార్థం బోధపడుతుందని చెబుతుంది. అందుకే, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌కి స్టోరీ చెబుతుండగానే నచ్చేసింది. చివర్లో వచ్చే డైలాగుని మళ్ళీ మళ్ళీ చెప్పించుకుని ఇంప్రెస్ అయ్యారట త్రివిక్రమ్. దీంతో తెలుగులో తీయడానికి వెంటనే ఓకే చేసి తానే దగ్గరుండి క్యాస్టింగ్ ఫైనలైజ్ చేశారట. తెలుగు నేటివిటీకి అనుగుణంగా, పవన్ కళ్యాణ్ హీరోయిజాన్ని దృష్టిలో పెట్టుకుని కథను కొత్తగా మలిచి ‘బ్రో’గా తీసుకొచ్చారు.
12 భాషల్లో చిత్రీకరణ
డైరెక్టర్ సముద్రఖని తమిళనాడులోని మారుమూల గ్రామం. అక్కడినుంచి చెన్నై వచ్చి, అటుపై హైదరాబాద్‌కి రావడం వెనకాల ఏదో ఒక శక్తి ఉందని బలంగా నమ్మారు. దానినే ‘టైం’గా అభివర్ణించారు. అలా మనకు ఎన్నో ఇచ్చిన సమాజానికి మనం తిరిగి ఏమివ్వగలం అనే కోణం నుంచి కొత్త ఆలోచన పుట్టుకొచ్చింది. బ్రో మూల కథను అన్ని భాషల ప్రేక్షకులకు చేరవేయాలని సంకల్పించుకున్నారు. అలా, తమిళంలో ‘వినోదయ సిత్తం’తో ముందడుగు వేశారు. ఇప్పుడు తెలుగులో ‘బ్రో’ చేశారు. తర్వాత ‘తుళు’లో చేయడానికి రెడీ అవుతున్నారు. ఇలా బెంగాళీ, మరాఠీ, గుజరాతీ.. తదితర 12 భాషల్లో ఇదే సినిమాను తీస్తానని చెబుతున్నారు సముద్రఖని.
Celebrities Featured Articles Movie News
Pawan Kalyan: ‘ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదా’.. ఫ్యాన్స్‌పై పవన్ ఫైర్